Sravana Somavaram 2022: శ్రావణ మాసం మెుదటి సోమవారం ఎప్పుడు? శివారాధన ఎలా చేయాలి?

Sravana Masam 2022: శివ భక్తులు ఎంతగానో ఎదురుచూస్తున్న శ్రావణ మాసం మరో 10 రోజుల్లో మెుదలవనుంది. శివుడిని ప్రసన్నం చేసుకోవడానికి శ్రావణ మాసంలోని సోమవారాల్లో ప్రజలు రుద్రాభిషేకం చేస్తారు.   

Written by - Samala Srinivas | Edited by - ZH Telugu Desk | Last Updated : Jul 3, 2022, 04:18 PM IST
  • జూలై 14 నుంచి శ్రావణ మాసం ప్రారంభం
  • ఈ మాసం శివుడికి ఎంతో ప్రీతిపాత్రమైనది
  • పూజా విధానం తదితర వివరాలు
Sravana Somavaram 2022: శ్రావణ మాసం మెుదటి సోమవారం ఎప్పుడు?  శివారాధన ఎలా చేయాలి?

Sravana Somavaram 2022:  హిందువులకు పవిత్రమైన మాసం శ్రావణ మాసం (Sravana Masam). శివుడికి ఎంతో ప్రీతికరమైన మాసం శ్రావణ మాసం. ఈ మాసం నుండే ప్రపంచాన్ని నడిపించే శ్రీమహావిష్ణువు 4 నెలలపాటు యోగ నిద్రలోకి జారుకుంటాడు. అప్పటి నుండి శ్రీహరి బాధ్యతలను శివుడు (Lord Shiva) తీసుకుంటాడు. శ్రావణ మాసంలోని సోమవారాలకు చాలా ప్రత్యేకత ఉంది. ఈ రోజు శివుడిని పూజించటం ద్వారా మీ కోరికలు నెరవేరుతాయి.  ఈ సంవత్సరం శ్రావణ మాసం 14 జూలై 2022న ప్రారంభమై... 12 ఆగస్టు 2022 వరకు కొనసాగుతుంది.

శ్రావణ సోమవారాల లిస్ట్
మెుదటి శ్రావణ సోమవారం- 18 జూలై 2022
రెండో శ్రావణ సోమవారం- 25 జూలై 2022
మూడో శ్రావణ సోమవారం- 1 ఆగస్టు 2022
నాల్గో శ్రావణ సోమవారం- 8 ఆగస్టు 2022
ఐదో శ్రావణ సోమవారం- 12 ఆగస్టు 2022

శ్రావణ సోమవారం పూజా విధానం
శ్రావణ సోమవారం నాడు ఉదయాన్నే స్నానం చేసి శుభ్రమైన బట్టలు ధరించాలి. ఉపవాసం ఉంటూ...శివుడికి గంగాజలంతో అభిషేకం చేయండి. అనంతరం శివునికి పంచామృతాన్ని సమర్పించండి. ఓం నమః శివాయ అనే మంత్రాన్ని జపిస్తూ... శివునికి తెల్ల చందనం, అక్షత, తెల్లటి పూలు, దాతుర, తమలపాకులు మొదలైన వాటిని సమర్పించండి. వీలైతే మహాదేవుడికి పండ్లు, స్వీట్లు కూడా పెట్టండి. తర్వాత శ్రావణ సోమవార వ్రత కథను చదవండి. చివరగా హారతి ఇచ్చి... ప్రసాదం పంచి పెట్టండి.  

Also Read: Budhaditya Yoga: మిథునరాశిలో బుధాదిత్య యోగం... ఈ 5 రాశులవారి భవిష్యత్తు అమోఘం! 

 

స్థానిక నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి

Android Link https://bit.ly/3hDyh4G 

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook

Trending News