Ram Mandir Inaugration: ఈరోజు అయోధ్యలో జరిగే రామ మందిర ప్రారంభోత్సవానికి తిరుపతి ఎమ్మెల్యే.. టీటీడీ చైర్మన్ కరుణాకర్ రెడ్డి కూడా హాజరుకానున్నారు. ఎర్రటి దుస్తులు ధరించి నుదుటిన శ్రీరామ నామాలతో ఇప్పటికే అయోధ్య చేరుకున్నారు కరుణాకర్ రెడ్డి. అలానే ఈరోజు అక్కడికి వచ్చే వచ్చే భక్తులకు పంపిణీ చేయడానికి తిరుమల శ్రీవారి ఆలయంలో ప్రత్యేకంగా తయారు చేసిన లక్ష లడ్డూలను చైర్మన్ శ్రీ కరుణాకరరెడ్డి రామ మందిర ట్రస్టు ప్రతినిధులకు అందజేశారు.
కాగా ఈరోజు తిరుపతి అలానే తిరుమలకు విచ్చేసే భక్తులకు రెండు శుభవార్తలు తెలియజేశారు. తిరుపతి, తిరుమలలో ఎల్లప్పుడూ ప్రచారం అయ్యే శ్రీ వేంకటేశ్వర భక్తి ఛానల్ తమిళం, కన్నడ, హిందీ ఛానళ్లలో, అదేవిధంగా ఎస్వీబీసీ తెలుగు యూట్యూబ్ ఛానల్ ద్వారా అయోధ్యలోని రామ మందిరం ప్రారంభోత్సవం లైవ్ స్ట్రీమింగ్ ప్రేక్షకులకు అందిస్తాము అని తెలియజేశారు. శ్రీరాముని విగ్రహ ప్రతిష్ట జనవరి 22వ తేదీ ఉదయం 11.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు జరుగనుంది. ఈ సందర్భంగా పైన చెప్పిన అన్నిటిలోలు ఆ సుమధుర ఘట్టం నిరంతరాయంగా ప్రత్యక్షప్రసారం కానుంది.
అంతేకాదు జనవరి 22న సోమవారం ఉదయం 9 గంటలకు టీటీడీ పరిపాలనా భవనం నుండి అన్నమయ్య ఉత్సవ విగ్రహం ఊరేగింపు మొదలుకానుండి. కళాకారులు సంకీర్తనలు ఆలపిస్తూ శ్రీ కోదండరామాలయ మాడ వీధుల గుండా దేవుడిని ఊరేగిస్తూ అన్నమాచార్య కళామందిరానికి తీసుకెళతారు. ఉదయం 11 గంటల నుండి మరుసటిరోజైన మంగళవారం ఉదయం 11 గంటల వరకు, 24 గంటల పాటు నిరంతరాయంగా కళాకారులు సంకీర్తనలను ఆలపిస్తారు. మరోపక్క తిరుపతిలో ఎంతో ప్రతిష్ట గాంచిన అన్నమాచార్య కళామందిరంలో జనవరి 22, 23వ తేదీల్లో అన్నమయ్య సంకీర్తనల అఖండ మహాయజ్ఞం కార్యక్రమం నిర్వహించనున్నారు. తిరుమల భక్తులు కూడా అక్కడికి చేరి ఆ మహోన్నత కార్యక్రమం లో పాల్గొనవచ్చు.
Also Read: Ayodhya Holiday: అయోధ్య ఆలయంపై డీకే శివ కుమార్ సంచలన వ్యాఖ్యలు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook