Horoscope Today 28 March 2021: పన్నెండు రాశిచక్రాలు ప్రతి దాని ప్రత్యేక లక్షణాన్ని కలిగి ఉంటాయి. ఆకస్మిక ధనలాభం, వాహనయోగం, కుటుంబంలో ఎలా ఉండనుందననే విషయాలు ఈరోజు మీ సంబంధిత రాశిచక్ర చిహ్నంలోని నక్షత్రాలు మరియు గ్రహాలు మీ రోజును ఎలా ప్రభావితం చేస్తాయో తెలుసుకోండి. మేషం, వృషభం, మిథునం మొదలుకుని మీన రాశివారికి మార్చి 28న సందీప్ కొచ్చర్ నేటి రాశి ఫలాలు అందిస్తున్నారు.
మేష రాశి
ఈ రోజు కొన్ని దుర్వినియోగం అయ్యే అవకాశాలున్నాయి. మీరు చెప్పే విషయాన్ని మీ చుట్టూ ఉన్నవారు వేరే విధంగా అర్థం చేసుకోవచ్చు. ఇది మీ వృత్తిపరమైన మరియు వ్యక్తిగత జీవితంలోనూ ఇబ్బంది కలిగిస్తుంది. మీ మాట వింటున్నారని నిర్ధారించుకున్నాక, ఏదైనా సమాచారం ఇవ్వండి. రుణాలు తీరనున్నాయి. ఆకస్మిక ధనలాభం గోచరిస్తుంది. ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలి.
Also Read: PM Modi: బంగ్లాదేశ్‌లో జెషోరేశ్వరి కాళీ ఆలయాన్ని సందర్శించిన ప్రధాని నరేంద్ర మోదీ
వృషభ రాశి
ఈ రోజు మీకు ఆరోగ్యపరంగా కలిసిరాదు. వేసవి మధ్యలో మీరు చలిని కూడా పొందవచ్చు. మీరు మీ ఆరోగ్యంపై జాగ్రత్తలు తీసుకోవాలి. విటమిన్లు, పోషకాలతో కూడిన ఆహారం తీసుకోవాలి. కొన్ని శుభకార్యాలలో పాల్గొంటారు. చేపట్టిన పనులు విజయవంతంగా పూర్తి చేయనున్నారు.
మిథున రాశి
ఈ రోజు మీరు కాస్త గందరగోళానికి గురవుతారు. అయితే కొంత సమయం వరకు మాత్రమే ఇలా ఉండనుంది. పని ఒత్తిడి కారణంగా అలసిపోతారు. ఏదేమైనా త్వరగా నిద్రపోవడానికి ప్రయత్నించండి. పనిని పూర్తి చేయడానికి మీకు అవసరమైన శక్తి ఉంటుంది. వ్యాపారస్తులకు లాభాలు గోచరిస్తున్నాయి. కుటుంబసభ్యులు, బంధువులతో కలిసి సమయాన్ని గడుపుతారు.
కర్కాటక రాశి
మీ మనసుకు ఇష్టమైన ఓ వస్తువును నేడు కోల్పోయే అవకాశం ఉంది. దీని గురించి కొంత సమయం చింతిస్తారు. కొందరి నుంచి శుభవార్తలు వింటారు. ఇతరులకు సాయం చేసేందుకు ముందడుగు వేస్తారు. సమాజంలో పేరు, ప్రతిష్టలు పెరుగుతాయి.
Also Read: ఈ 7 పదార్థాలు, వస్తువులు శివుడికి సమర్పించకూడదని తెలుసా
సింహ రాశి
మీరు ఈ రోజు సొంతంగా నిర్ణయాలు తీసుకుంటారు. ఈ రోజు మీ పనులను స్వయంగా సమీక్షిస్తారు. ఇతరులతో సరదాగా సమయాన్ని గడుపుతారు. బంధువులు, సన్నిహితులతో మాట్లాడేటప్పుడు ఆచితూచి వ్యవహరించాలని మరిచిపోవద్దు. మీ చుట్టుపక్కల వారికి సహాయం చేయడానికి మీకు నైపుణ్యాలు అవసరం.
కన్య రాశి
ఈ రోజు మీ మాటలు ఇతరులపై మరింత ప్రభావం చూపనున్నాయి. మీరు చేసే పనులు మీ చుట్టూ ఉన్నవారికి సహాయపడతాయి. మీరు వాహనాలను నడిపే సమయంలో జాగ్రత్త వహించాలి. వస్తులాభం గోచరిస్తుంది. ఆత్మవిశ్వాసంతో సమస్యలను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉంటారు.
తులా రాశి
మీ చుట్టుపక్కల వారితో సంబంధాలు సవాలుగా మారతాయి. వారు మీతో అన్ని విషయాలు చెప్పడం లేదని, మీకు వ్యతిరేకంగా కుట్రలు సైతం చేస్తున్నారని మీరు భావిస్తారు. అదే సమయంలో మీ పనులతో తీరిక లేకుండా గడుపుతారు. లేకపోతే మీ మానసిక ఆందోళన మీకు ప్రశాంతత లేకుండా చేస్తుంది. ప్రయాణాలు చేస్తారు. కొన్ని భయాల్ని వదలిపెట్టాలి.
వృశ్చిక రాశి
ఈ రోజు మీకు ధ్రువీకరణ అవసరం కావచ్చు. మీ చుట్టుపక్కల వ్యక్తుల నుండి ధ్రువీకరణ అడగడానికి సిగ్గుపడకండి. మీరు చేస్తున్న పనితో సంతోషంగా ఉంటారు. ఆకస్మిక ధననష్టం గోచరిస్తుంది. ఇంట్లో వ్యక్తులు, సన్నిహితులతో ఆచితూచి మాట్లాడకపోతే విభేదాలకు దారితీస్తుంది.
Also Read: Vastu Tips: రాత్రివేళ హాయిగా నిద్రించాలంటే Pillow కింద ఉంచాల్సిన వస్తువులు ఇవే
ధనుస్సు రాశి
ఏదైనా చేయడానికి సరైన సమయం ఉందని మాకు తెలుసు, అయినప్పటికీ, మీరు ఏదైనా చేయాలనుకుంటే తక్షణమే దాన్ని అమలు చేయాలి. హఠాత్తుగా తీసుకునే నిర్ణయాలు ఈ రోజు మీకు సత్ఫలితాలుగా మారబోతున్నాయి. కొన్ని సందర్భాలలో తెగించి ముందుకు నడవాల్సి ఉంటుంది. పరిస్థితుల ప్రభావంతో ఆలోచించుకునే సమయం దొరకదు.
మకర రాశి
ఈరోజు మీరు ఊహించని వ్యక్తి మిమ్మల్ని కలుసుకోనున్నాడు. మీరు సాధారణంగా మీ చుట్టూ ఉన్న వ్యక్తులను బెదిరించడం వలన వారు మీకు దూరమవుతారు. కొందరు మీ సాయం కోరి వస్తారు. వారితో సఖ్యతగా వ్యవహరించాలి. ప్రతి ఒక్కరూ మిమ్మల్ని సంప్రదించరని గుర్తుంచుకోండి. ఉద్యోగులకు, వ్యాపారులకు మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. ఖర్చులు పెరగడంతో రుణ యత్నాలు చేస్తారు.
కుంభ రాశి
మీరు ఇతరులను చూసే కోణంలో కొంత మార్పు అవసరం అవుతుంది. దానివల్ల కొందరి నిజస్వరూపాలు మీకు తెలుస్తాయి. మీరు మీ కంఫర్ట్ జోన్ నుండి బయటకు వచ్చి వాస్తవాలు తెలుసుకోవాలి. ఇతరుల ఆలోచనలను అంగీకరించడం ద్వారా మీకు మేలు జరుగుతుంది. ఆభరణాలు కొనుగోలు చేస్తారు. వస్తులాభం సైతం గోచరిస్తుంది. కుటుంబం, సన్నిహితులతో సరదాగా సమయాన్ని గడుపుతారు.
మీన రాశి
మీరు ఈ రోజు మీ కాళ్ల మీద నిలుచునేందుకు ప్రయత్నిస్తారు. గత కొంతకాలం నుంచి అసంపూర్తిగా ఉన్న పనులను పూర్తి చేయాలని భావిస్తారు. మీకు ఇష్టమైన వారితో సమయాన్ని గడపాలని ప్లాన్ చేసుకుంటారు. రుణ యత్నాలు ఫలిస్తాయి. కుటుంబ పరిస్థితులు చికాకు తెప్పిస్తాయి. మానసిక ప్రశాంతత కోసం యోగా, ధ్యానం చేయడం ఉత్తమం.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook