Budh Asta on 19th June 2023: ఆస్ట్రాలజీ ప్రకారం, గ్రహాలు కాలానుగుణంగా ఉదయించడం లేదా అస్తమించడం చేస్తాయి. గ్రహాల యువరాజు బుధుడు జూన్ 19న వృషభరాశిలో అస్తమించబోతున్నాడు. సాధారణంగా గ్రహాల అస్తమయం చెడు ఫలితాలనే ఇస్తుంది. త్వరలో మెర్క్యూరీ అస్తమయం వల్ల ఏయే రాశులవారు భారీగా నష్టాలను చవిచూడనున్నారో తెలుసుకుందాం.
వృషభరాశి
ఇదే రాశిలో బుధుడు అస్తమించబోతున్నాడు. దీని కారణంగా వృషభరాశి వారు అనేక సమస్యలను ఎదుర్కోవల్సి ఉంటుంది. మీ ఖర్చులు విపరీతంగా పెరుగుతాయి. కుటుంబంలో గొడవలు వస్తాయి. మీరు మానసిక సమస్యలతోపాటు పైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ను ఎదుర్కోంటారు. మీ కష్టానికి తగిన ప్రతిఫలం దక్కదు. ఉద్యోగులకు ప్రమోషన్ లేదా ఇంక్రిమెంట్ లభించదు. దాంపత్య జీవితంలో ఇబ్బందులు వస్తాయి. మీ ఆరోగ్యం చెడిపోయే అవకాశం ఉంది.
కర్కాటక రాశి
కర్కాటక రాశిలో బుధుడు పదకొండవ స్థానంలో అస్తమించబోతున్నాడు. మీరు ఉద్యోగ మరియు వ్యాపారాల్లో అనేక సమస్యలను ఎదుర్కోవల్సి ఉంటుది. వ్యాపారులు భారీగా నష్టపోతారు. మీ ఆర్థిక పరిస్థితి దిగజారిపోయే అవకాశం ఉంది. మీరు లవ్ లో అనేక సమస్యలను ఎదుర్కోంటారు. ఉద్యోగులకు రావాల్సిన ప్రమోషన్ ఆగిపోతుంది.
Also Read: Shash Rajyog: జాతకంలో ఈ రాజయోగం ఉన్నవారు కింగ్ లా బతుకుతారు..!
సింహరాశి
ఈరాశి వారి జాతకంలో మెర్క్యురీ పదో ఇంట్లో అస్తమించబోతున్నాడు. ఇది సింహరాశి వారిపై ప్రతికూల ప్రభావం చూపనుంది. మీరు చేసే ప్రతి పని చెడిపోయే అవకాశం ఉంది. మీ శ్రమకు తగిన ప్రతిఫలం లభించదు. మీరు లక్ష్యాన్ని సాధించడంలో అనేక కష్టాలను ఎదుర్కోవల్సి ఉంటుంది. మీ ఆర్థిక స్థితి చెడిపోయే అవకాశం ఉంది.
Also Read: Astrology: నవపంచం రాజయోగంతో ఈ 4 రాశులకు మహార్దశ.. వీరు పట్టిందల్లా బంగారమే...
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook