Mahashivaratri 2024: మహాశివరాత్రి 8 లేదా 9న రానుందా? శుభముహూర్తం, పూజావిధానం తెలుసుకోండి..

Mahashivaratri 2024 Date and time : మహాశివరాత్రి మహాదేవుడికి అంకింత చేసిన రోజు. ఈరోజు శివశక్తుల కలయిక అని నమ్ముతారు. అంటే శివపార్వతుల పెళ్లిరోజు అని నమ్ముతారు. హిందూమతంలో శివరాత్రి అత్యంత పవిత్రమైన పండుగ.

Written by - Renuka Godugu | Last Updated : Mar 3, 2024, 08:33 AM IST
Mahashivaratri 2024: మహాశివరాత్రి 8 లేదా 9న రానుందా? శుభముహూర్తం, పూజావిధానం తెలుసుకోండి..

Mahashivaratri 2024 Date and time : మహాశివరాత్రి మహాదేవుడికి అంకింత చేసిన రోజు. ఈరోజు శివశక్తుల కలయిక అని నమ్ముతారు. అంటే శివపార్వతుల పెళ్లిరోజు అని నమ్ముతారు. హిందూమతంలో శివరాత్రి అత్యంత పవిత్రమైన పండుగ. దేశవ్యాప్తంగా ఈ వేడుకను అంగరంగ వైభవంగా జరుపుకుంటారు. మరో నమ్మకం ప్రకారం ఈరోజు పాలసముద్రం నుంచి హాలాహలం బయటకు వస్తే లోకకల్యాణం కోసం శివుడి ఆ విషాన్ని సేవిస్తాడు. ఆరోజు నుంచి గుర్తుగా మహాశివరాత్రిని వేడుకగా జరుపుకొంటారు. శివుడికి ఉపవాసం ఉండి రాత్రి జాగరణ చేస్తారు. ప్రతి సంవత్సరం శివరాత్రి ఫాల్గున మాసం కృష్ణపక్షంలో వచ్చే చతుర్ధశి తిథి రోజు జరుపుకుంటారు. ఈ ఏడాది మహాశివరాత్రి ఏ రోజు రానుంది? మార్చి 8 లేదా 9 తెలుసుకుందాం.

మహాశివరాత్రి 2024 శుభ సమయం..
మార్చి 8న రాత్రి 09:57 మొదలవుతుంది..
మరుసటి రోజు అంటే 9న సాయంత్రం 6:17 కు చతుర్ధశి తిథి ముగుస్తుంది. శివరాత్రి పూజ సాయంత్రం సమయంలోనే జరుపుకోవడం విశేషం. మార్చి 8 న శివుని ఆరాధన సమయం సాయంత్రం 06:25 నుండి రాత్రి 09:28

ఈరోజు శివభక్తులు ఆయన కోసం ఉపవాసం జాగరణలు చేస్తారు. శివయ్యకు అభిషేకం, రుద్రాభిషేకాలు చేసి శివమంత్ర పఠనం చేస్తారు. ఇలా చేయడం వల్ల పరమత్ముని కృప వారిపై ఉంటుందని నమ్ముతారు.

ఇదీ చదవండి: మహాశివరాత్రి పర్వదినాన పవిత్రమైన యోగం.. ఈ 4 రాశులకు గుడ్ టైమ్ స్టార్ట్..

శివరాత్రి పూజా విధానం..
ఈరోజు ఉదయం నిద్రలేచి స్నానం చేసి, ఇంటిని శుభ్రం చేసుకుంటారు. పూజగదిలో దీపం పెట్టి శివయ్యను పూజిస్తారు. అంతేకాదు దగ్గర్లో ఉన్న శైవాలయాలకు వెళ్లి జలాభిషేకం చేసి పంచామృతాన్ని శివయ్యకు సమర్పిస్తారు. పంచామృతంలో పాలు, పెరుగు, తేనె, చక్కెర, నెయ్యి ఉంటుంది. ఈ ఐదింటిని కలిపి అభిషేకం చేస్తారు. 

శివ మంత్రాలు..
ఓం నమః శివాయ
ఓం త్రయంభకం యజామహే సుగంధిం పుష్టి
వర్ధనం ఉర్వరుక్మివ్ బంధనం మృత్యయోర్ ముక్షియ మామృతాత్

ఇదీ చదవండి: ఈ ఒక్క మొక్క మీ ఇంట్లో ఉంటే కనకవర్షమే.. డబ్బు అయస్కాంతంలా ఆకర్షిస్తుంది..

ఈ మహాశివరాత్రి రోజున ఉపవాసం, జాగరణ చేయడం వల్ల మనస్సు ఆహారానికి నీటికి దూరంగా ఉంటారు. ఇది ఆరోగ్యానికి కూడా ఎంతో మంచిది. ఇది కేవలం మనదేశంలోనే కాదు నేపాల్ ఇతర సౌత్ ఏషియా దేశాల్ల కూడా జరుపుకుంటారు. కోణార్క్, ఖజురహో, చిదంబరం, శ్రీశైలం వంటి శైవ క్షేత్రాలు దేదీప్యమానంగా అలంకరిస్తారు. భక్తుల తాకిడి కూడా విపరీతంగా పెరుగుతుంది. మహాశివరాత్రి రోజున శివయ్య భూమిపై ఉన్న అన్ని శివలింగాలలో ఉంటాడని నమ్ముతారు. ఇక శివయ్యకు బిల్వపత్రం, ధాతురాలు అత్యంత ఇష్టం.(Disclaimer: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం సాధారణ నమ్మకాలు మరియు సమాచారంపై ఆధారపడి ఉంటుంది. ZEE NEWS దీన్ని ధృవీకరించలేదు.) 
 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter

Trending News