Akshaya Tritiya 2023: హిందూ పంచాంగం ప్రకారం వైశాఖ మాసం శుక్లపక్షంలోని తృతీయ తిధిన అక్షయ తృతీయ జరుపుకుంటారు. ఈ ఏడాది అక్షయ తృతీయ ఏప్రిల్ 22వ తేదీన ఉంది. హిందూమతం ప్రకారం అక్షయ తృతీయ నాడు ఈసారి గురుడు మేషరాశిలో ప్రవేశించనుండటం వల్ల పలు శుభయోగాలు ఏర్పడనున్నాయి.
గురుగ్రహం మేషరాశిలో ప్రవేశించినప్పుడు 5 గ్రహాలు ఒకేసారి కలిసిరానున్నాయి. ఫలితంగా పంచాగ్రహి యోగం ఏర్పడనుంది. దాంతో 5 రాశుల జాతకమే మారిపోనుంది. ఊహించని ధనలాభం కలగనుంది. ఈ రోజున పూర్తి విధి విధానాలతో పూజలు చేస్తే లక్ష్మీదేవి ప్రసన్నమై భక్తుల కోర్కెలు నెరవేరుస్తుందని నమ్మకం. ఈసారి అక్షయ తృతీయ రోజున మేషరాశిలో సూర్యుడు, గురుడు, బుధుడు, రాహువు, యురేనస్ ఒకేసారి కలిసి పంచాగ్రహి యోగం ఏర్పర్చనున్నాయి. చంద్రుడు, శుక్రుడు రెండు గ్రహాలు వృషభ రాశిలో విరాజిల్లనున్నారు. ఫలితంగా అన్నీ శుభ పరిణామాలే ఎదురుకానున్నాయి.
వృశ్చిక రాశి
ఈ రాశి జాతకులకు ఈ రోజు అత్యంత శుభసూచకం కానుంది. వాహనాలు ఖరీదు చేయాలనుకుంటే అత్యంత అనువైన సమయంగా పరిగణిస్తారు. ఇళ్లు, ఆస్థులు కొనుగోలు చేస్తారు. అక్షయ తృతీయ ఈ రాశివారికి అత్యంత శుభదాయకం. ఆర్ధిక ఇబ్బందులుండవు. ఆరోగ్యం బాగుంటుంది. చేపట్టిన పనిలో విజయం సాధిస్తారు.
మేష రాశి
ఈ రాశివారికి అక్షయ తృతీయ అక్షయపాత్రలానే లాభాల్ని ఆర్జించి పెడుతుంది. మేష రాశి అధిపతైన శుక్రుడు ఇదే రాశిలో ఉండటం వల్ల రాజయోగం ఏర్పడనుంది. వృషభ రాశి జాతకులకు అక్షయ తృతీయ రోజున బట్టలు, ఆభరణాలతో సహా ఇతర భౌతిక సుఖాలు అందనున్నాయి. కొన్ని ప్రత్యేకమైన రంగాలకు చెందినవారికి ఊహించని లాభాలుంటాయి. కుటుంబ జీవితంలో ప్రేమ సంబంధాలు కొనసాగుతాయి. ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఆర్ధికంగా మంచి స్థితిలో ఉంటారు.
సింహ రాశి
అక్షయ తృతీయ రోజున అంటే ఏప్రిల్ 22వ తేదీన సింహ రాశి జాతకులకు అత్యంత శుభ పరిణామాలు ఎదురుకానున్నాయి. ఇంటి పెద్దల ఆశీర్వాదం తోడుగా ఉంటుంది. సమాజంలో మీ ప్రతిష్ట పెరుగుతుంది. బంగారం, రాగి వస్తువులు కొనుగోలు చేయడం మంచిది. ఆర్ధికంగా కలిసొస్తుంది. వ్యాపారులకు మంచి లాభాలుంటాయి.
కర్కాటక రాశి
ఈసారి అక్షయ తృతీయ రోజున ధన సంపదల యోగం ఏర్పడనుంది. ఈ రాశి అధిపతి శుక్రుడితో కలిసి ఉండం వల్ల పంచాగ్రహి యోగం ఏర్పడనుంది. ఫలితంగా పనిచేసేచోట ముందుకు దూసుకెళ్తారు. ఆర్ధికంగా లాభాలు కలుగుతాయి. వెండి, వజ్రాలు లాభదాయకం. ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఎప్పట్నించో ఉన్న రోగాల నుంచి ఉపశమనం పొందుతారు.
వృషభ రాశి అక్షయ తృతీయ రోజున వృషభ రాశి అధిపతి అయిన శుక్రుడు ఇదే రాశిలో విరాజిల్లనున్నాడు. ఈ క్రమంలో ఏర్పడనున్న రాజయోగం లాభదాయకం కానుంది. ఆర్ధికంగా ఏ విధమైన ఇబ్బంది ఉండదు. ఆరోగ్యపరమైన సమస్యలు బాధించవు. వ్యాపారులకు అనువైన సమయం. కొత్త ఉద్యోగావకాశాలు లభిస్తాయి. కుటుంబంతో మంచి సమయం గడపనున్నారు.
Also read: Budh Reverse: మే 15 వరకు ఈ రాశులకు డబ్బే డబ్బు.. ఇందులో మీ రాశి ఉందా?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook