Panchak In August 2022: ఆగస్టు నెలలో ఈ సమయాల్లో ఎవరైనా మరణిస్తే తప్పకుండా ఇలా చేయాలి..!

Panchak In August 2022: భారతీయ సాంప్రదాయం ప్రకారం ఏ శుభ కార్యమైనా శుభ ముహూర్తాన్ని బట్టి ప్రారంభిస్తారు. అయితే జోతిష్యం శాస్త్రం ఇటీవలే పలు రకాల సూచనలు చేసింది. ప్రతి నెలలో  5రోజులు పవిత్రమైన పనులను అస్సలు చేయకూడదని శాస్త్ర నిపుణులు పేర్కొన్నారు.

Written by - ZH Telugu Desk | Last Updated : Aug 5, 2022, 12:07 PM IST
  • ఆగస్టు నెలలో పలు గడియల్లో ఇలా చేయాలి
  • 5 పనులు తప్పకుండా చేయాలి
  • అంత్యక్రియలలో ఇలా చేయాలి
Panchak In August 2022: ఆగస్టు నెలలో ఈ సమయాల్లో ఎవరైనా మరణిస్తే తప్పకుండా ఇలా చేయాలి..!

Panchak In August 2022: భారతీయ సాంప్రదాయం ప్రకారం ఏ శుభ కార్యమైనా శుభ ముహూర్తాన్ని బట్టి ప్రారంభిస్తారు. అయితే జోతిష్యం శాస్త్రం ఇటీవలే పలు రకాల సూచనలు చేసింది. ప్రతి నెలలో  5రోజులు పవిత్రమైన పనులను అస్సలు చేయకూడదని శాస్త్ర నిపుణులు పేర్కొన్నారు. చంద్రుడు కుంభం, మీన రాశులలో ఉన్నప్పుడు పంచకం జరుగుతుందని జ్యోతిష్య శాస్త్రం తెలిపింది. అయితే ఈ సమయంలో పలు రకాల శుభ కార్యాలు చేయడం వల్ల పలు రకాల ప్రతి కూల ప్రభావం పడే అవకాశాలున్నాయి. అయితే ఆగస్టులో కూడా ఇలాంటి ప్రభావం పడుతుండడంతో పలు రకాల జాగ్రత్తలు పాటించడం చాలా మేలని శాస్త్ర నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అంతేకాకుండా పలు రకాల శుభకార్యాలు కూడా చేయోద్దని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.  

రాఖీ పండగ గడియలు:

ఆగస్టు 11వ తేదీన గురువారం రోజునా రాఖీ పండగా.. అయితే మరుసటి రోజు ఆగస్టు 12 నుంచి పలు రకాల మార్పలు సంభవించబోతున్నాయి. అయితే పంచక కాలం ఆగస్టు12 శుక్రవారం మధ్యాహ్నం 02:49 నుండి ప్రారంభంకానుంది. ఈ గడియలు ఆగస్టు 16 మంగళవారం రాత్రి 09:07 వరకు కొనసాగనుంది.

5 పనులు చేయకండి:

పంచకలములో ఐదు రకాల పనులు అస్సలు చేయకూడదని జ్యోతిష్య శాస్త్రం పేర్కొంది. దీనితో పాటు ఇంట్లోకి చెట్ల చెక్కలను తీసుకురావడం.. మంచాలు నేయడం, ఇంటికి పైకప్పు వేయడం, దక్షిణ దిశలో ప్రయాణించడం వంటి పనులను అస్సలు చేయకూడదని నిపుణులు తెలుపుతున్నారు.

ఎవరైనా ఈ సమయాల్లో మరణిస్తే ఇలా చేయండి:

హిందూ సాంప్రదాయ ప్రకారం..ఒక వ్యక్తి పంచకలంలో మరణిస్తే.. అంత్యక్రియల సమయంలో ప్రత్యేక శ్రద్ధ వహించాలని నిపుణులు తెలుపుతున్నారు. అంతేకాకుండా పలు రకాల శాంతి పూజలు కూడా చేయాలని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు అభిప్రాయపడుతున్నారు. మృతదేహంతో పాటు ఐదు పిండులతో దిష్టిబొమ్మలను తయారు చేసి భూమిపై ఉంచాలని నిపుణులు పేర్కొన్నారు. ఆచార వ్యవహారాలతో అంత్యక్రియలు నిర్వహించాలని వారు చెబుతున్నారు. ఈ నియమాలు తప్పకుండా పాటించాలని నిపుణులు తెలుపుతున్నారు.

(NOTE: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం సాధారణ అంచనాలు, సమాచారంపై ఆధారపడి ఉంటుంది. ZEE NEWS దానిని నిర్ధారించలేదు.)

Also Read: Bimbisara Twitter Review: కల్యాణ్ రామ్ 'బింబిసార' ట్విట్టర్ రివ్యూ.. సినిమా ప్రేక్షకులను మెప్పించిందా..

Also Read: Sita Ramam Twitter Review: ప్రేక్షకుల ముందుకు 'సీతారామం'.. టాక్‌ ఎలా ఉందంటే?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook

 

 

Trending News