When Is Raksha Bandhan 2022: సోదర, సోదరీమణుల ప్రేమకు ప్రతీక రాఖీ పండుగ (Rakhi Festival). ఈ ఫెస్టివల్ ను శ్రావణ మాసం పౌర్ణమి రోజున జరుపుకుంటారు. అయితే ఈ సారి రక్షాబంధన్ తేదీ విషయంలో ప్రజల్లో గందరగోళం నెలకొంది. హిందూ క్యాలెండర్ ప్రకారం ఈసారి రాఖీ పండుగ (Raksha Bandhan 2022) ఆగస్ట్ 11గా పేర్కొంటున్నారు. కానీ ఈ రోజు భద్ర కాలం ఉండటంతో..చాలా మంది రక్షాబంధన్ ను ఆగస్టు 12న జరుపుకుంటున్నారు.
రక్షాబంధన్ 2022 తేదీ, శుభ సమయం
శ్రావణ మాసం పౌర్ణమి తిథి ఆగస్టు 11వ తేదీ ఉదయం 10.39 గంటలకు ప్రారంభమై ఆగస్టు 12వ తేదీ ఉదయం 7.05 గంటలకు ముగుస్తుంది. ఈ రోజున భద్ర కాలం ఉదయం నుండి ప్రారంభమై రాత్రి 08:51 గంటలకు ముగుస్తాయి. హిందూ మతంలో, సూర్యాస్తమయం తర్వాత ఎటువంటి శుభకార్యాలు జరగవని నమ్ముతారు. అందుకే ఆగస్టు 11వ తేదీ రాత్రి సోదరులకు రాఖీ కట్టరు. కాబట్టి ఆగస్టు 12న రాఖీ కట్టడం శుభప్రదంగా భావిస్తారు. మీరు కూడా ఆగస్టు 12న రాఖీ కట్టాలని ఆలోచిస్తున్నట్లయితే... ఉదయం 7.05 గంటలలోపు సోదరులకు రాఖీ కట్టవచ్చు.
ఆగస్టు 11న కూడా రాఖీ కట్టవచ్చు
ఆస్ట్రాలజీ ప్రకారం, ఆగస్టు 11న రోజంతా భద్ర సమయం ఉంటుంది, కాబట్టి ఈ ముహూర్తంలో రాఖీ కట్టడం శుభప్రదంగా పరిగణించబడదు. కానీ పూంచ్ భద్ర సమయంలో రాఖీ కట్టవచ్చని అంటున్నారు జ్యోతిష్య నిపుణులు. పూంచ్ భద్ర ఆగష్టు 11న సాయంత్రం 5:17 గంటలకు ప్రారంభమై సాయంత్రం 06.18 వరకు కొనసాగుతుంది. ఈ కాలంలో రాఖీ కట్టడం శుభప్రదం.
Also Read: Astro Tips: ఈ 5 చెట్లను పూజిస్తే.. మీ ఇంట్లో ఎప్పుడూ డబ్బుకు లోటు ఉండదు!
స్థానిక నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook