Saturn Effect: శని వక్రమార్గం అంటే శని తిరోగమనం ప్రారంభమైపోయింది. జూన్ 5న కుంభరాశిలో తిరోగమనమై..ఆక్టోబర్ 23 వరకూ కొనసాగనుంది. శని వక్రమార్గ ప్రభావం 12 రాశులపై పడనుంది. కానీ కొన్ని రాశుల జాతకులకు మాత్రం సంపదే సంపద వచ్చిపడనుంది.
ఏదైనా గ్రహం వక్రమార్గంలో పయనమవడం లేదా గోచారం అవడం అన్ని రాశుల జాతకాలపై , జీవితంపై ప్రభావం చూపిస్తుంది. ఇందులో శనిగ్రహం అత్యంత నెమ్మదిగా కదిలే గ్రహం. జూన్ 5న శని కుంభరాశిలో ప్రవేశించి..తిరోగమనమై అక్టోబర్ 23 వరకూ ఇదే అవస్థలో కొనసాగనుంది. శని పీడ, శని దుష్ప్రభావంతో పాటు శని దృష్టి కూడా ప్రాధాన్యత కలిగిందే. దీని ప్రభావం ఆ వ్యక్తి జీవితంపై కన్పిస్తుంది. శని 141 రోజులవరకూ ఇదే అవస్థలో ఉండనున్నాడు. శని వక్రమార్గం కావడం కొన్ని రాశులకు మాత్రం అంతులేని ప్రయోజనాలు చేకూర్చనుంది.
మేషరాశివారికి జ్యోతిష్యశాస్త్రం ప్రకారం అంతులేని లాభం చేకూరనుంది. శని వక్రమార్గపు పాజిటివ్ ప్రభావం పనిచేసే చోట కన్పిస్తుది. దీర్ఘకాలంగా ఉద్యోగం మారాలని ఆలోచించేవారికి లాభం కలగనుంది. శని కటాక్షం కారణంగా మంచి ఆఫర్లు వస్తాయి. ఈ సందర్భంగా ఆర్ధిక పరిస్థితి కూడా మెరుగవుతుంది. అన్ని కోర్కెలు నెరువేరుతాయి.
వృశ్చికరాశివారికి శని వక్రమార్గం కావడం కెరీర్‌పరంగా లాభదాయకంగా ఉంటుంది. మీరు ఏ పని చేపట్టినా అందులో విజయం సాధిస్తారు. ఉద్యోగం, వ్యవసాయం, ప్రతి రంగంలోనూ విజయం ప్రాప్తిస్తుంది. ఆర్ధిక సమస్యలు దూరమౌతాయి. పెట్టుబడులు పెట్టేందుకు అనువైన సమయం. దాంతోపాటు విద్యార్ధులకు కూడా సానుకూలమైన సమయం.
ధనస్సురాశివారికి శని కటాక్షం కారణంగా పెద్దఎత్తున ప్రయోజనం కలగనుంది. ప్రభుత్వ ఉద్యోగాల కోసం ప్రయత్నిస్తున్న విద్యార్ధులకు అనువైన సమయం. అటు డబ్బుల సమస్య దూరమౌతుంది. ఈ సందర్భంగా భవిష్యత్ కోసం పెట్టుబడులు పెట్టడం లాభదాయకం కానుంది.
కుంభరాశివారికి ఈ సమయం చాలా అనుకూలం. లాభాలార్జించవచ్చు. పనిచేసేచోట సాఫల్యత లభిస్తుంది. శని కటాక్షంతో విద్యార్ధులకు కూడా లాభం కలగనుంది. పరీక్షల్లో మంచి ర్యాంకులు సాధించవచ్చు. దాంతోపాటు ఆర్ధిక పరిస్థితులు మెరుగవుతాయి.
Also read: Saturday Remedies: ధనవంతులయ్యేందుకు ప్రతి శనివారం ఇలా చేస్తే చాలు, మీ కోరిక నెరవేరినట్టే
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook