Shani Planet Set In Kumbh 2023: వేద జ్యోతిషశాస్త్రం ప్రకారం, గ్రహాలు ఒక నిర్దిష్ట సమయం తర్వాత ఉదయించడం లేదా అస్తమించడం చేస్తాయి. కర్మప్రదాత అయిన శనిదేవుడు కుంభరాశిలో అస్తమించనున్నాడు. ఎవరి జాతకంలో శనిదేవుడు శుభస్థానంలో ఉంటాడో వారికి దేనికీ లోటు ఉండదు. కుంభరాశిలో శనిదేవుడు అస్తమయం వల్ల మూడు రాశులవారు జాగ్రత్తగా ఉండాలి. ఆ దురదృష్ట రాశులేంటో తెలుసుకుందాం.
ఈ రాశులవారు జాగ్రత్త
కర్కాటక రాశిచక్రం (Cancer): శని దేవుడి అస్తమయం మీ జాతకంలోని ఎనిమిదో ఇంట్లో జరగబోతుంది. దీని కారణంగా మీరు ఆరోగ్యంపై శ్రద్ధ తీసుకోవాల్సి ఉంటుంది. లైఫ్ పార్టనర్ తో విభేదాలు వచ్చే అవకాశం ఉంది. ఈ సమయంలో మీరు పార్టనర్ షిప్ తో వ్యాపారం చేయడం వల్ల లాభపడతారు. మీరు ఈ టైంలో బిజినెస్ లో పెట్టుబడి పెట్టినట్లయితే భారీగా నష్టపోతారు. మీరు మానసిక ఒత్తిడికి గురయ్యే అవకాశం ఉంది.
సింహ రాశి (Leo): శని దేవుడి అస్తమయం సింహరాశి వారికి అననుకూలంగా ఉంటుంది. ఎందుకంటే శని దేవుడు మీ రాశి నుండి ఏడవ ఇంట్లో అస్తమించబోతున్నాడు. మీరు వైవాహిక జీవితంలో సమస్యలను ఎదుర్కోవలసి ఉంటుంది. భాగస్వామ్యంతో చేసే పనుల్లో మీరు నష్టపోతారు. మీ ఖర్చులు పెరిగే అవకాశం ఉంది. ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కోనే అవకాశం ఉంది. బిజినెస్ మెుదలుపెట్టడానికి ఇది మంచి సమయం కాదు.
వృశ్చిక రాశిచక్రం (Scorpio): శని దేవుడి అస్తమయం మీకు హానికరం. ఎందుకంటే శని గ్రహం మీ రాశి నుండి నాల్గవ ఇంట్లో అస్తమించబోతోంది. ఈ సమయంలో మీరు ఆరోగ్యం పట్ల శ్రద్ద తీసుకోండి. వ్యాపారస్తులు లావాదేవీలు జరిపేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. నిరుద్యోగులకు జాబ్ ఆఫర్ వచ్చిన దానిని సద్వినియోగం చేసుకోలేరు.
Also Read: Shukra Gochar 2023: త్వరలో కుంభరాశిలోకి శుక్రుడు... ఈ 3 రాశులకు లక్కే లక్కు...
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook.