Amavasya In November 2023: ప్రతి సంవత్సరం అమావాస్య తిథి నుంచే కార్తీక మాసం ప్రారంభమవుతుంది. హిందూ సాంప్రదాయంలో దీపావళి తర్వాత వచ్చే అమావాస్యకి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంటుంది. అంతేకాకుండా ఈ అమావాస్యను సోమవతి అమావాస్యగా కూడా పిలుస్తారు. ఈ సోమవతి అమావాస్య(Somvati Amavasya 2023)గా పిలవడానికి ప్రధాన కారణమేంటంటే అన్ని వాటిళ్ల రాకుండా ఈ అమావాస్య కేవలం సోమవారం రోజే వస్తుంది. కార్తీక మాసం అమావాస్య ఈ సంవత్సరం నవంబర్ 13న వచ్చింది. అయితే ఈ కార్తీక మాసం అమావాస్య ప్రాముఖ్యత ఏంటో, ఈ రోజు ఏయే దేవతలకు పూజా కార్యక్రమాలు చేయాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం.
సోమవతి అమావాస్య రోజు శ్రీమహావిష్ణువును పూజించడం అనవాయితిగా వస్తోంది. అంతేకాకుండా ఈ రోజు పూర్వీకుల ఆత్మ శాంతి చేకూరాలని వారికి ప్రత్యేక నైవేద్యాలు సమర్పిస్తారు. ఈ అమావాస్య తిథి రోజు నది పుణ్య స్నానాలను ఆచరించడానికి కూడా ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. ఈ సమయంలో నది పుణ్య స్నానాలు చేసి..సూర్యుడికి అర్ఘ్యం సమర్పించడం వల్ల సూర్యభగవానుడి అనుగ్రహం కలుగుతుందని పురాణాల్లో పేర్కొన్నారు. అంతేకాకుండా కొన్ని రాష్ట్రాల్లో స్త్రీలు ఈ రోజు తమ భర్త దీర్ఘాయువు కోసం ఉపవాసాలు కూడా పాటిస్తారు.
కార్తీక మాస అమావాస్య ప్రారంభ సమాయాలు:
కార్తీక, కృష్ణ అమావాస్య నవంబర్ 12 సాయంత్రం 02:44 నుంచి ప్రారంభమవుతుంది.
కార్తీక, కృష్ణ అమావాస్య నవంబర్ 13 సాయంత్రం 02:56 ముగుస్తుంది.
Also Read:`Kishan Reddy: తెలంగాణలో కాషాయ జెండా ఎగురవేస్తాం.. కిషన్ రెడ్డి ధీమా
సోమవతి అమావాస్య ప్రాముఖ్యత:
హిందూ గ్రంథాల్లో సోమవతి అమావాస్యకు ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. ఈ రోజు పవిత్ర నదులలో స్నానాన్ని ఆచరించి, మరణించి పూర్వీకులకు నైవేద్యాన్ని సమర్పించడం వల్ల జీవితంలో ఆనందంతో పాటు శ్రేయస్సు కూడా పొందుతారని జ్యోతిష్య శాస్త్రంలో పేర్కొన్నారు. ఈ సోమవతి అమావాస్య రోజు శివుడిని పూజించడం వల్ల కోరుకున్న కోరికలు నెరవేరుతాయని భక్తులు నమ్మకం. అంతేకాకుండా చాలా మంది భక్తులు ఈ రోజు లక్ష్మీ అమ్మవారికి కూడా పూజిస్తారు. ఈ రోజు ఉపవాసాలు పాటించేవారికి జీవితంలో ఆర్థిక సమస్యల నుంచి విముక్తి లభిస్తుందని భక్తుల నమ్మకం.
సోమవతి అమావాస్య పూజా విధానం:
సోమవతి అమావాస్య(Somvati Amavasya 2023)రోజు ప్రత్యేక పూజలు ఆచరించాలనుకునేవారు ఉదయాన్నే నిద్రలేవాల్సి ఉంటుంది.
పవిత్ర నది లేదా ప్రవహించే గంగా స్నానాన్ని చేయాలి.
ఇంటిని కూడా గంగాజలంతో శుభ్రం చేసుకోవాలి.
ఆ తర్వాత ఇంట్లో ఉండే గుడిని శుభ్రం చేసుకుని నెయ్యితో దీపం వెలిగించాల్సి ఉంటుంది.
సూర్య భగవానుడికి రాగి చెంబులో గల ప్రత్యేక గంగాజలంతో అర్ఘ్యం సమర్పించండి.
ఉపవాసాలు పాటించాలనుకునేవారు పూజ సమయం నుంచే ప్రారంభించాల్సి ఉంటుంది.
తర్వాత శ్రీమహావిష్ణువు విగ్రహానికి అభిషేకం చేసి..పూలతో అలంకరించాల్సి ఉంటుంది.
Also Read:`Kishan Reddy: తెలంగాణలో కాషాయ జెండా ఎగురవేస్తాం.. కిషన్ రెడ్డి ధీమా
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook