Surya gochar 2023: సూర్యుడి మకరరాశి ప్రవేశంతో ఆ రాశులకు ఎదురయ్యే ఇబ్బందులు తీర్చే ఉపాయాలు

Surya gochar 2023: సూర్యుడి మకర రాశి ప్రవేశం కారణంగా చాలా రాశుల జాతకాలపై ప్రభావం పడుతుంది. కొన్ని రాశులవారికి శుభంగా, కొన్ని రాశులవారికి అశుభ సూచకంగా ఉంటుంది. ఏయే రాశులవాళ్లు అప్రమత్తంగా ఉండాలో తెలుసుకుందాం..

Written by - Md. Abdul Rehaman | Last Updated : Jan 16, 2023, 11:22 PM IST
Surya gochar 2023: సూర్యుడి మకరరాశి ప్రవేశంతో ఆ రాశులకు ఎదురయ్యే ఇబ్బందులు తీర్చే ఉపాయాలు

జనవరి 14 రాత్రి సూర్యుడి మకర రాశిలో ప్రవేశించాడు. ఫలితంగా కొన్ని రాశులపై శుభంగా, మరికొన్ని రాశులపై అశుభంగా ఉంటుంది. జ్యోతిష్యం ప్రకారం గ్రహాల రాశి పరివర్తనం ఏ రాశులపై దుష్ప్రభావం పడనుందనేది తెలుసుకుందాం..

జ్యోతిష్యం ప్రకారం ఏదైనా గ్రహం రాశి మారితే ఆ ప్రభావం అన్ని రాశులపై పడుతుంది. సూర్యుడి గోచారం కారణంగా కొన్ని రాశులపై తీవ్రమైన దుష్ప్రభావం పడుతుంది. ఎంతగా అంటే జీవితం దుర్భరమైపోతుంది. అయితే కొన్ని ఉపాయాల ద్వారా సూర్యుడి కటాక్షం పొందవచ్చంటున్నారు జ్యోతిష్య పండితులు.

మిధునరాశి 

జ్యోతిష్యం ప్రకారం సూర్యుడు మకర రాశిలో గోచారం కారణంగా మిధున రాశి జాతకులపై ప్రతికూల ప్రభావం పడనుంది. ఈ సందర్భంగా సూర్యుడు మీ కుండలి మూడవభాగానికి గురువుగా ఉంటాడు. ఈ దశను ఆ వ్యక్తి సాహసం, పరాక్రమం భావంగా పిలుస్తారు. సూర్యుడి ఈ రాశి 8వ భాగంలో గోచారం చేస్తాడు.జ్యోతిష్యుల ప్రకారం సూర్యుడి ఈ దశలో గోచారం చేయడం అశుభంగా భావిస్తారు. మిధునరాశి జాతకులు తమ వాయిస్ నియంత్రణలో ఉంచుకోవాలి. పనిచేసే చోట ఆధికారుల్నించి ఒత్తిడి రావచ్చు. ఈ సమయంలో చాలా అప్రమత్తంగా ఉండాలి.

ఉపాయం

ఒకవేళ మీరు సూర్యుడి శుభ ఫలాల్ని దక్కించుకోవాలంటే నల్ల ఆవు లేదా పెద్దన్నయ్యకు సేవ చేయాలి. ఇలా చేస్తే మంచి ఫలితాలుంటాయి

మకర రాశి

జ్యోతిష్యశాస్త్రం ప్రకారం మీ కుండలిలో అష్టమభాగానికి సూర్యుడు గురువు. ఈ భాగంలో జీవితంలో ఎదురయ్యే దుర్ఘటనలు, ఆకస్మిక ఘటనలు రావచ్చు. సూర్యుడు ఈ రాశి లగ్నంలో గోచారం చేయనున్నాడు. దీనివల్ల పనుల్లో కాస్త ఆలస్యం ఉంటుంది. జరిగే పనులు కూడా నిలిచిపోతాయి. తండ్రి నుంచి భార్య నుంచి విభేదాలు రావచ్చు.

ఉపాయం

సూర్యుడి శుభ ఫలం కోసం ఫిబ్రవరి 13 వరకూ ప్రతిరోజూ ఉదంయ స్నానం చేసిన తరువాత సూర్యదేవుడికి అర్పణం చేయాలి. దీనివల్ల మంచి ఫలితాలుంటాయి. సమాజంలో గౌరవ మర్యాదలు లభిస్తాయి.

కుంభరాశి

సూర్యుడు మకర రాశిలో ప్రవేశించడం వల్ల కుంభరాశి జీవితంలో కష్టాలు పెరుగుతాయి. సూర్యుడు మారక స్థానానికి అధిపతి. అంతేకాకుండా సూర్య గోచారం కుంభరాశి గోచారం కుండలిలో 12వ భాగంలో ఉంటుంది. ఈ సమయంలో మీ విలువైన సామాను పట్ల జాగ్రత్త అవసరం. అభివృద్ధిలో ఇబ్బందులు ఏర్పడుతాయి. జ్యోతిష్యం ప్రకారం ఎగుమతి, దిగుమతుల వ్యాపారంలో కూడా ఇబ్బందులు ఎదుర్కోవల్సి వస్తుంది. 

ఉపాయం

సూర్యుడి అశుభ ప్రభావాల్నించి కాపాడుకునేందుకు ఫిబ్రవరి వరకూ ధార్మిక పనుల్లో ఎక్కువ తోడ్పాటు లభిస్తుంది. 

Also read: Vastu Tips: ఇంటి ఖజానాలో ఈ వస్తువులుంచితే అంతులేని డబ్బులు, అదృష్టం మీ సొంతం

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News