Surya Gochar 2023 in August: ప్రతి గ్రహం నిర్ణీత సమయం తర్వాత తన రాశిని మారుస్తుంది. సూర్యభగవానుడు నెలకొకసారి తన రాశిని మారుస్తాడు. ఇలా సంవత్సరం మెుత్తం మీద 12 రాశులలో సంచరిస్తాడు. సూర్యుడి రాశి మార్పునే సంక్రాంతి అని పిలుస్తారు. ఆగస్టు 17న సూర్యభగవానుడు సింహరాశిలోకి ప్రవేశించనున్నాడు. పైగా సింహరాశికి అధిపతిగా సూర్యుడిని భావిస్తారు. ఏడాది తర్వాత ఆదిత్యుడు తన సొంత రాశి అయిన సింహరాశిలోకి ప్రవేశించనున్నాడు. ఇది 5 రాశులవారికి కలిసి రానుంది. ఆ లక్కీ రాశులేంటో తెలుసుకుందాం.
సూర్య సంచారం ఈ రాశులకు వరం
సింహరాశి: ఇదే రాశిలో సూర్యుడి సంచారం జరగబోతుంది. పైగా ఇదే రాశికి అధిపతి కూడా. సూర్యుడి రాశి మార్పు ఈరాశి వారికి అనుకూలంగా ఉంటుంది. మీరు ఆర్థికంగా లాభపడతారు. అప్పుగా ఇచ్చిన డబ్బు తిరిగి వస్తుంది. మీ ఆరోగ్యం బాగుంటుంది. అంతేకాకుండా మీరు కెరీర్ లో మంచి పొజిషన్ కు చేరుకుంటారు.
కర్కాటకం: భాస్కరుడు సంచారం కర్కాటక రాశి వారికి లాభాలను ఇస్తుంది. మీరు ప్రతి పనిలో విజయం సాధిస్తారు. జాబ్ చేసేవారికి ప్రమోషన్ లభించే అవకాశం ఉంది. అదృష్టం మీ వెంటే ఉంటుంది.
వృషభం: సూర్యుడి రాశి మార్పు వృషభరాశి వారికి మేలు చేస్తుంది. ఆకస్మిక ధనలాభం ఉంటుంది. మీ ఆర్థిక పరిస్థితి బలపడుతుంది. ఉద్యోగులకు ప్రమోషన్ దక్కే అవకాశం ఉంది. కుటుంబంలో ఆనందం వెల్లివిరిస్తుంది.
మిథునరాశి: సింహరాశిలో సూర్యుని ప్రవేశం మిథునరాశి వారికి మంచి ప్రయోజనాలను ఇస్తుంది. మీ కెరీర్ బాగుంటుంది. మీకు అదృష్టం కలిసి వచ్చి ప్రతి పనిని విజయవంతంగా పూర్తి చేస్తారు. ఆగిపోయిన పనులు మెదలవుతాయి.
కన్య: సూర్య సంచారం కన్యారాశి వారికి శుభప్రదంగా ఉంటుంది. మీరు కెరీర్ లో విజయం సాధిస్తారు. మీ ఆర్థిక పరిస్థితి బలపడుతుంది. మీరు ప్రతి పనిలో విజయం సాధిస్తారు. మీకు లక్ కలిసి వస్తుంది.
Also Read: Shukra Gochar 2023: 23 రోజులు పాటు ఊహించని లాభాలు పొందబోయే రాశులవారు వీరే, ఇక డబ్బే..డబ్బు..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook