Nilamani Stone Benefits: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం రాశిచక్రాలను బట్టి రంగు రత్నాలను ధరిస్తారు. దీని ధరించడం వల్ల గ్రహదోషాలు శని ప్రభావాల నుంచి ఉపశమనం లభిస్తుందని కొందరి నమ్మకం. అయితే కొందరి జాతకాల్లో శని అశుభ స్థానంలో ఉండడం వల్ల అనేక రకాల నష్టాలు కలుగుతాయి. ఇలాంటి వారికి మానసిక ప్రశాంతత కూడా తొలగిపోతుంది. అయితే ఈ సమస్యలతో బాధపడేవారు శనిదేవుడికి ఎంతో ఇష్టమైన నీలం రంగు రత్నాన్ని ధరించాల్సి ఉంటుంది. దీనినే జ్యోతిష్య శాస్త్రంలో నీలమణి(Nilamani Stone) అని అంటారు. దీనిని ధరించడం వల్ల శని చెడు ప్రభావం వల్ల కలిగే దుష్ప్రభావాలు తొలగిపోతాయి. అంతేకాకుండా ఆర్థికంగా నష్టపోకుండా ఈ నీలం కాపాడుతుందని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు చెబుతున్నారు.
ప్రస్తుతం శని సాడే సాతి తో బాధపడేవారు మార్కెట్లో లభించే నీలమణి రత్నాన్ని కొనుగోలు చేసి ధరిస్తున్నారు అయినప్పటికీ కొంతమంది ఎలాంటి ఫలితాలు పొందలేకపోతున్నారని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే మార్కెట్లో లభించే ఖరీదైన చాలా రత్నాలు డూప్లికేట్ లో విక్రయిస్తున్నారు. దీని కారణంగా చాలామంది అసలైన నీలాన్ని పొందలేకపోతున్నారు. అయితే ఈ నీలాన్ని కొనుగోలు చేసేవారు ఆయుర్వేద నిపుణులు సూచించిన కొన్ని టిప్స్ పాటిస్తే అసలైన నీలమేదో సులభంగా తెలిసిపోతుంది. కాబట్టి మీరు కూడా అసలైన నీలాంటి కనుగొనడానికి ఇలా చేయండి.
ఇది కూడా చదవండి : Ways to Increase Hemoglobin: హిమోగ్లోబిన్ లేకపోతే ఎన్ని రకాల సమస్యలో తెలుసా ?
ఇలా అసలైన నీలమణి కనుగొనండి:
మీరు మార్కెట్లో నీలం రత్నానికి ఉన్న తర్వాత ఐదు నీలిరంగు కాటన్ దుస్తులను తీసుకోవాల్సి ఉంటుంది ఆ తర్వాత మీరు కొన్న నీలమణిని అందులో మూటగట్టి పడుకునే క్రమంలో దానిని మీ దిండు కింద పెట్టుకోండి. ఇలా పెట్టుకున్న తర్వాత ఆరోజు రాత్రి మీకు మంచి కలలు వస్తే అది అసలైన నీలమని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. ఒకవేళ మీకు చెడు కలలు వస్తే అది నకిలీ నీలంగా భావిస్తారట. అంతేకాకుండా నకిలీది ధరించిన వారికి దురద సమస్యలు వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి.
ఈ రత్నాన్ని ధరించడం వల్ల ఎన్నో రకాల ప్రయోజనాలు కలుగుతాయి ముఖ్యంగా శని చెడు ప్రభావంతో ఆర్థిక సమస్యలతో బాధపడే వారికి దీనివల్ల సులభంగా ఉపశమనం లభిస్తుందని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. తరచుగా వ్యాపారాల్లో నష్టాలు కలిగే వారికి ఈ రత్నాన్ని ధరించడం వల్ల మంచి ఫలితాలు కలుగుతాయి. అంతేకాకుండా ఆర్థికంగా బలపడే అవకాశాలు కూడా ఉన్నాయని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు.
ఇది కూడా చదవండి : Ways to Increase Hemoglobin: హిమోగ్లోబిన్ లేకపోతే ఎన్ని రకాల సమస్యలో తెలుసా ?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3P3R74U
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి