Ding Liren Wins 2023 FIDE World Championship: నయా చెస్ ఛాంపియన్ అవతరించాడు. గత కొన్నేళ్లుగా చెస్ ఛాంపియన్ షిప్ లో మాగ్నస్ కార్ల్సన్దే హవా. ఇప్పడు ఆ పేరు గతం. తాజాగా ప్రపంచ చెస్ ఛాంపియన్షిప్ విజేతగా చైనా గ్రాండ్‌మాస్టర్ డింగ్ లిరెన్ నిలిచాడు. రష్యా ఆటగాడు ఇయాన్ నెపోమ్నిషిని టైబ్రేక్‌లో 2.5-1.5తో ఓడించి.. ప్రపంచ చెస్ కిరీటాన్ని ఎగరేసుకుపోయాడు చైనా ఆటగాడు లిరిన్. భారత గ్రాండ్ మాస్టర్ విశ్వనాథన్ ఆనంద్ తర్వాత ఆసియా నుంచి ప్రపంచ చెస్ విజేత అయింది లిరెన్ మాత్రమే.
కజకిస్తాన్ రాజధాని ఆస్తానా వేదికగా జరిగిన ప్రపంచ చెస్ ఛాంపియన్ షిప్ లో లిరెన్-ఇయాన్ చెరో ఏడు గేమ్‌లు నెగ్గడంతో విజేతను తేల్చడానికి ఆదివారం టైబ్రేక్ నిర్వహించారు. టైబ్రేక్‌లో ర్యాపిడ్ పద్ధతిలో జరిగిన నాలుగు గేమ్‌లలో తొలి మూడు గేమ్‌లు డ్రా అయ్యాయి. నాలుగో గేమ్‌ను లిరెన్ గెలుచుకున్నాడు. దీంతో టైటిల్ 30 ఏళ్ల ఈ చైనా ఆటగాడి సొంత అయింది. ఈ విజయంతో కార్ల్సన్ ఏకచక్రాధిపత్యానికి తెరపడినట్లు అయింది. ఈసారి వరల్డ్ చెస్ ఛాంపియన్‌షిప్‌లో ఆడకూడదని డిఫెండింగ్ ఛాంపియన్ కార్ల్సన్ నిర్ణయించుకున్న విషయం తెలిసిందే.
Also Read: WTC Final 2023: డబ్ల్యూటీసీ ఫైనల్‌కు మరో ఐదుగురు ఆటగాళ్లు ఎంపిక.. స్టాండ్ ప్లేయర్లుగా జట్టులోకి..!
2013 తర్వాత తొలిసారిగా 17వ ప్రపంచ ఛాంపియన్‌గా డింగ్ లిరెన్ నిలిచాడు. విజేతగా నిలిచిన లిరెన్ కు 1.1 మిలియన్లు యూరోలు ప్రైజమనీ ఇవ్వనుండగా.. నెపోమ్నిషి 900,000 యూరోలు అందుకోనున్నాడు. ఈ సారి మహిళల ప్రపంచ చెస్ టైటిల్‌ను కూడా చైనాకు చెందిన వెన్జువాన్ గెలుచుకున్న సంగతి తెలిసిందే.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook