ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL 2020) టైటిల్ హాట్ ఫెవరెట్లలో చెన్నై సూపర్ కింగ్స్ (Chennai Super Kings) ఒకటి. ఎంఎస్ ధోనీ సారథ్యంలోని సీఎస్కే జట్టు ఆగస్టు 15 నుంచి స్థానిక చెపాక్ స్టేడియంలో ఫిట్నెస్ క్యాంపు, ట్రైనింగ్ సెషన్ నిర్వహించేందుకు ప్లాన్ చేసింది. ఈ సెషన్‌కు ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా (Ravindra Jadeja) దూరం కానున్నాడు. వ్యక్తిగత కారణాలతో జడేజా ఫిట్నెస్ క్యాంపునకు హాజరు కావడం లేదని ఈఎస్పీఎన్ క్రిక్ఇన్ఫోతో మాట్లాడుతూ సీఎస్కే సీఈవో విశ్వనాథన్ వెల్లడించారు. ఆగస్టు 21న దుబాయ్‌కి బయలుదేరే ముందు జడేజా జట్టుతో కలుస్తాడని తెలిపారు. SSB Jobs 2020: ఎస్ఎస్బీలో 1,522 కానిస్టేబుల్ జాబ్స్
Sridevi Birth Anniversary: హ్యాపీ బర్త్‌డే అమ్మ.. జాన్వీ కపూర్ పోస్టు వైరల్
ఐపీఎల్ 2020 నేపథ్యంలో తమిళనాడు ప్రభుత్వం అనుమతి తీసుకుని చెన్నై (CSK) జట్టు ఫిట్నెస్ క్యాంపు నిర్వహిస్తోంది. గతంలో మార్చి చివర్లో ఐపీఎల్ ప్రారంభమవుతుందని ఇదే క్యాంపు ఈ ఏడాది తొలిసారి నిర్వహించారు. కెప్టెన్ ధోనీ, హర్భజన్ సింగ్, రాయుడు సహా దేశీయ ఆటగాళ్లు ఆ ఫిట్నెస్ క్యాంపులో పాల్గొన్నారు. అయితే యూఏఈకి వెళ్లకముందు నిర్వహిస్తున్న తాజా ఫిట్నెస్ క్యాంపు సెషన్‌కు రవీంద్ర ఒక్కడే గైర్హాజరు అవుతాడని స్పష్టం చేశారు. Cricketer Commits suicide: ముంబై క్రికెటర్ ఆత్మహత్య కలకలం
Virat Kohli: రాజస్థాన్ రాయల్స్ జట్టులోకి కోహ్లీ.. కానీ ఓ కండీషన్
ఇటీవల జడేజా, అతడి భార్య రీవా సోలంకి ట్రాఫిక్ కానిస్టేబుల్‌తో గొడవపడ్డారు. కరోనా నేపథ్యంలో నిబంధనలు పాటించాల్సింది పోయి రూల్స్ ప్రశ్నించిన మహిళా కానిస్టేబుల్‌తో గొడవకు దిగడం వైరల్ అయింది. జడేజా భార్య మాస్కు ధరించకపోవడంతో ఈ వివాదం మొదలైంది. కానిస్టేబుల్‌కు వివరణ ఇచ్చుకోవాల్సింది పోయి జడ్డూ సైతం వాగ్వివాదానికి దిగడం హాట్ టాపిక్ అయింది. Photos: అందాల జాబిలి, నటి ఆషిమా సోగసు చూడతరమా..
పెళ్లికి ముందే గర్భం దాల్చిన నటీమణులు వీరే...