Eoin Morgan: ఐర్లాండ్ తరుఫున అరంగేట్రం.. ఇంగ్లండ్ నుంచి రిటైర్మెంట్.. ఇయాన్ మోర్గాన్ క్రికెట్ జర్నీ

Eoin Morgan Retirement Announced: ఐర్లాండ్ తరుపున అరంగేట్రం చేసి.. ఇంగ్లండ్ జట్టు నుంచి రిటైర్మెంట్ ప్రకటించాడు మాజీ కెప్టెన్ ఇయాన్ మోర్గాన్. అన్ని ఫార్మాట్ల నుంచి తప్పుకుంటున్నట్లు వెల్లడించాడు. ఇక నుంచి కుటుంబంతో ఎక్కువ సమయం గడిపేందుకు అవకాశం ఉంటుందన్నాడు.  

Written by - ZH Telugu Desk | Last Updated : Feb 13, 2023, 05:03 PM IST
  • అన్ని ఫార్మాట్లకు మోర్గాన్ గుడ్‌ బై
  • ఇప్పటికే అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు
  • క్రికెట్‌తో అనుబంధం కొనసాగుతుందని ప్రకటన
Eoin Morgan: ఐర్లాండ్ తరుఫున అరంగేట్రం.. ఇంగ్లండ్ నుంచి రిటైర్మెంట్.. ఇయాన్ మోర్గాన్ క్రికెట్ జర్నీ

Eoin Morgan Retirement Announced: ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ ఇయాన్ మోర్గాన్ అన్ని ఫార్మాట్ల నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించాడు. గతేడాది అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన మోర్గాన్.. ప్రస్తుతం ఇంగ్లండ్‌ కౌంటీల్లో, దక్షిణాఫ్రికా టీ20 లీగ్‌లో మాత్రం ఆడుతున్నాడు. తాజాగా వీటికి కూడా గుడ్‌ బై చెబుతున్నట్లు వెల్లడించాడు మోర్గాన్. ఈ మేరకు ట్విట్టర్‌లో పోస్ట్ పెట్టాడు. అయితే క్రికెట్‌తో తన అనుబంధం కొనసాగుతుందని పేర్కొన్నాడు. కామెంటేటర్‌గా, అనలిస్ట్‌గా తాను కొనసాగుతానని చెప్పాడు.   

'ఇంటర్నేషనల్ క్రికెట్ నుంచి తప్పుకున్న తరువాత ఎక్కవ సమయం ఫ్యామిలీతో గడపుతున్నా. తాజా నిర్ణయంతో మరింత సమయం కుటుంబానికి కేటాయించే అవకాశం ఉంటుంది. నా ప్రయాణంలో అండగా నిలిచిన ఫ్యాన్స్‌, సహచరులు, నా కుటుంబ సభ్యులకు ధన్యవాదాలు..' అని మోర్గాన్ రాసుకొచ్చాడు.

 

ఐర్లాండ్‌ జట్టు నుంచి ఇయాన్ మోర్గాన్ అంతర్జాతీయ కెరీర్‌ను ప్రారంభించాడు. ఆ తరువాత ఇంగ్లండ్ జట్టుకు మారిపోయాడు. మోర్గాన్ తన కెరీర్‌లో ఎక్కవగా వన్డేలు, టీ20లే ఆడాడు. తన సుదీర్ఘ కెరీర్‌లో కేవలం 16 టెస్టు మ్యాచ్‌లు (ఐర్లాండ్ తరుపున కలిపి) ఆడాడు.

ఇయాన్ మోర్గాన్ 115 టీ20 ఇంటర్నేషనల్స్‌లో 2458 పరుగులు చేశాడు. ఇందులో 14 అర్ధ సెంచరీలు ఉన్నాయి. టీ20 అత్యధిక స్కోరు 91. 16 టెస్టు మ్యాచ్‌ల్లో 700 రన్స్ చేశాడు. ఇందులో రెండు సెంచరీలు, మూడు హాఫ్ సెంచరీలు ఉన్నాయి. ఇంగ్లండ్ తరఫున 225 వన్డేల్లో 13 సెంచరీలతో 6957 పరుగులు చేశాడు. ఓవరాల్‌గా వన్డే క్రికెట్‌లో మోర్గాన్ 14 సెంచరీలతో 7701 పరుగులు చేశాడు. 126 మ్యాచ్‌లలో ఇంగ్లండ్‌ జట్టుకు నాయకత్వం వహించాడు. ఇందులో 76 మ్యాచ్‌లో జట్టుకు విజయాన్ని అందించాడు. మోర్గాన్ కెప్టెన్సీలోనే ఇంగ్లండ్‌ తొలి ప్రపంచకప్‌ గెలిచింది. వన్డే క్రికెట్‌లో ఇంగ్లండ్ తరుఫున అత్యధిక పరుగులు, అత్యధిక మ్యాచ్‌లు ఆడిన ఆటగాడిగా మోర్గాన్ పేరిటే రికార్డు ఉంది.

Also Read: Jayamangala Venkataramana: మాజీ ఎమ్మెల్యేకు సీఎం జగన్ బంపర్ ఆఫర్.. టీడీపీకి షాక్..!  

Also Read: 7th Pay Commission: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు బంపర్ గిఫ్ట్.. ఒకేసారి మూడు కీలక ప్రకటనలు..?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

TwitterFacebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

 

Trending News