World Cup 2023: ఇదేం క్రేజ్ భయ్యా.. భారత్-పాక్ మ్యాచ్‌కు ఏకంగా ఆసుపత్రి బెడ్స్‌ బుకింగ్

India Vs Pakistan World Cup 2023: ఇండియా-పాకిస్థాన్ జట్ల మధ్య ప్రపంచకప్‌లో జరిగే పోరును వీక్షించేందుకు అభిమానులు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే హోటల్స్ రూమ్స్ ధరలు పది రెట్లకుపైగా పెరిపోగా.. ఫ్లైట్ ఛార్జీలు ఆకాశాన్ని తాకుతున్నాయి. అయినా రూమ్స్ దొరక్కపోవడంతో ఏకంగా ఆసుపత్రుల్లో బెడ్స్ బుక్ చేసుకుంటున్నారు అభిమానులు.  

Written by - Ashok Krindinti | Last Updated : Jul 21, 2023, 09:38 PM IST
World Cup 2023: ఇదేం క్రేజ్ భయ్యా.. భారత్-పాక్ మ్యాచ్‌కు ఏకంగా ఆసుపత్రి బెడ్స్‌ బుకింగ్

India Vs Pakistan World Cup 2023: భారత్-పాక్ జట్ల మధ్య మ్యాచ్ అంటే ఎంత క్రేజ్ ఉంటుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అదీ వరల్డ్ కప్‌లో దాయాదుల మధ్య పోరు అంటే.. ఏ రేంజ్‌లో హైప్ ఉంటుందో తెలిసిందే. అక్టోబర్ 15న ఇండియా-పాకిస్థాన్ జట్ల మధ్య జరగబోతున్న మ్యాచ్‌ను ప్రత్యక్షంగా చూసేందుకు ప్రపంచ వ్యాప్తంగా క్రికెట్ అభిమానులు ఇప్పటి నుంచే సిద్ధం చేసుకుంటున్నారు. మ్యాచ్‌ జరిగే రోజు ఇప్పటికే ఫ్లైట్ టికెట్ ధరలు ఆకాశాన్ని తాకగా.. హోటళ్ల గదుల ధరలు అయతే ఏకంగా పది రెట్లు పెరిగిపోయాయి. అయినా ఫ్యాన్స్ తగ్గేదేలా అంటూ అక్టోబర్ 15వ తేదీకి అడ్వాన్స్ బుకింగ్స్ చేసుకుంటున్నారు. అన్ని హోటళ్లలో హౌస్ ఫుల్ బోర్డులు కనిపిస్తుండడంతో అభిమానులు కొత్త మార్గం ఎంచుకుంటున్నారు.

దాయాదుల మధ్య మ్యాచ్‌ను ఎలాగైనా స్టేడియంలో వీక్షించాలనే కోరికతో ఏకంగా ఆసుపత్రుల్లో బెడ్‌లను బుక్ చేసుకుంటున్నారు. పూర్తి బాడీ చెకప్‌తో పాటు ఒక రాత్రి స్టే చేయడానికి బెడ్స్‌ బుక్ చేసుకుంటున్నారట. అక్టోబర్ 15వ తేదీకి ఆయా హాస్పిటల్స్‌లోని రూమ్‌లు, బెడ్స్‌ కూడా నిండుతున్నాయని వైద్యులు చెబుతున్నారు. నగరంలోని ఓ ఆసుపత్రి వైద్యుడు డాక్టర్ పరాస్ షా మాట్లాడుతూ.. తమది ఆసుపత్రి అయినందున పూర్తి బాడీ చెకప్‌తోపాటు రాత్రిపూట బస చేసేందుకు అడుగుతున్నారని చెబుతున్నారు. ఆరోగ్య పరీక్షలు చేయించుకోవడంతోపాటు భారత్-పాక్ మ్యాచ్‌ చూసినట్లవుతుందని అంటున్నారని తెలిపారు.

అయితే రోగులను దృష్టిలో ఉంచుకుని అడ్వాన్స్ బుకింగ్‌పై ఆలోచన చేస్తున్నామని చెప్పారు. డీలక్స్ నుంచి సూట్ రూమ్ వరకు అన్ని రెడీగా ఉన్నాయని.. కానీ తమకు పరిమిత గదులు ఉన్నాయన్నారు. రోగుల సంరక్షణను దృష్టిలో ఉంచుకుని.. ఎన్‌ఆర్ఐల నుంచి అడ్వాన్స్ బుకింగ్‌ల విషయంలో న్యాయంగా వ్యవహరిస్తున్నామన్నారు. "మా వద్ద స్పెషల్, సాధారణ గదులు ఉన్నందున నా ఆసుపత్రిలో ఉన్నాయి. వీటి కోసం యూఎస్‌ఏ నుంచి నా స్నేహితుల నుంచి కాల్స్ చేసి రూమ్‌ల కోసం అడుగుతున్నారు. ఇండో-పాక్ మ్యాచ్‌ను చూడటంతో పాటు వైద్య సదుపాయాలను కూడా ఉపయోగించుకోవాలని అనుకుంటున్నామని అంటున్నారు." అని ఆయన చెప్పుకొచ్చారు.

అహ్మదాబాద్‌లోని హోటల్ రూమ్ ధరలు విపరీతంగా పెరిగాయి. రూ.59 వేల కంటే ఎక్కువగా ఉండగా.. సాధారణ ధరల కంటే 20 రెట్లు ఎక్కువ. ముఖ్యంగా అహ్మదాబాద్‌లోని ఐటీసీకి చెందిన వెల్‌కమ్‌హోటల్ ఆ తేదీన రూ.72 వేలు వసూలు చేస్తోంది. నగరంలోని టీసీ నర్మద, కోర్ట్‌యార్డ్ బై మారియట్‌తో సహా అనేక ఇతర హోటళ్లలో గదులు అందుబాటులో లేవని బోర్డుల కనిపిస్తున్నాయి. నరేంద్ర మోదీ స్టేడియం భారత్-పాకిస్థాన్ మ్యాచ్‌తో పాటు మొత్తం ఐదు మ్యాచ్‌లకు అతిథ్యం ఇవ్వనుంది. వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ నవంబర్ 19న ఇక్కడే జరగనుంది. 

Also Read: Yashasvi Jaiswal: రోహిత్‌తో కలిసి బ్యాటింగ్ చేయడం అద్భుతం.. ఆ సీక్రెట్ బయటపెట్టిన యశస్వి జైస్వాల్    

Also Read: MLC Kavitha: ఎంపీ అరవింద్‌కు ఎమ్మెల్సీ కవిత 24 గంటల డెడ్‌లైన్.. ముక్కు నేలకు రాసి క్షమాపణ చెప్పాల్సిందే..!  

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitterFacebook

Trending News