Salman Butt: మిగతా దేశాలు అలా చెయ్యట్లేదు.. అందుకే టీమిండియా దూసుకెళుతోంది: పాక్ మాజీ కెప్టెన్

సుదీర్ఘమైన ఫార్మాట్‌లో టీమిండియా వరుస విజయాల వెనుక టెస్ట్ కెప్టెన్ విరాట్ కోహ్లీ, మాజీ ప్రధాన కోచ్ రవిశాస్త్రి మరియు మాజీ ఎన్సీఏ హెడ్ రాహుల్ ద్రవిడ్ కృషి ఎంతో ఉందనడంలో ఎలాంటి సందేహం లేదు. అయితే పాకిస్థాన్ మాజీ క్రికెటర్ సల్మాన్ బట్ ఇంకో ముఖ్యమైన అంశం కూడా ఉందని చెప్పాడు. 

Written by - ZH Telugu Desk | Last Updated : Dec 19, 2021, 10:07 AM IST
  • అందుకే టీమిండియా టెస్ట్ క్రికెట్‌లో దూసుకెళుతోంది
  • మిగతా క్రికెట్‌ దేశాలు అలా చెయ్యట్లేదు
  • అప్పుడే టెస్ట్ మ్యాచులు తరచూ చూడొచ్చు
Salman Butt: మిగతా దేశాలు అలా చెయ్యట్లేదు.. అందుకే టీమిండియా దూసుకెళుతోంది: పాక్ మాజీ కెప్టెన్

Salman Butt Revels Team India's success Screat in Test cricket: గత కొన్ని సంవత్సరాలుగా సుదీర్ఘమైన ఫార్మాట్‌ (Test Cricket)లో టీమిండియా దూసుకెళుతోన్న విషయం తెలిసిందే. గతంలో ఎన్నడూ లేనివిధంగా విదేశీ గడ్డపై విజయాలు అందుకుంటోంది. ఇటీవలి కాలంలో ఆస్ట్రేలియాలో రెండు సిరీస్ విజయాలను ( 2018-19 మరియు 2020-21లో) సాధించింది. ఈ సంవత్సరం ఇంగ్లండ్ పర్యటనలో భారత్ అద్భుతమైన ప్రదర్శనను కనబరిచింది. ఇంగ్లండ్ గడపై ఐదు టెస్టుల సిరీస్‌లో 2-1 ఆధిక్యంలో నిలిచింది. ఈ సిరీస్‌లోని చివరి టెస్టు కరోనా వైరస్ (Cpronavirus) కారణంగా వాయిదా పడగా.. ఆ మ్యాచ్ జూలై 2022లో జరగనుంది. ఆ టెస్టును కనీసం డ్రా చేసుకున్నా సిరీస్ మన సొంతమవుతుంది. భారత్ ప్రస్తుతం దక్షిణాఫ్రికా (IND vs SA) పర్యటనలో ఉంది. ప్రొటీస్ గడ్డపై భారత్ ఇంకా టెస్టు సిరీస్ గెలవలేదు. అయితే పటిష్ట టీమిండియా అక్కడ కూడా సిరీస్ గెలిచే అవకాశం ఉంది. 

సుదీర్ఘమైన ఫార్మాట్‌లో టీమిండియా వరుస విజయాల వెనుక టెస్ట్ కెప్టెన్ విరాట్ కోహ్లీ (Virat Kohli), మాజీ ప్రధాన కోచ్ రవిశాస్త్రి మరియు మాజీ ఎన్సీఏ హెడ్ రాహుల్ ద్రవిడ్ కృషి ఎంతో ఉందనడంలో ఎలాంటి సందేహం లేదు. అయితే పాకిస్థాన్ మాజీ క్రికెటర్ సల్మాన్ బట్ (Salman Butt) ఇంకో ముఖ్యమైన అంశం కూడా ఉందని చెప్పాడు. ఇటీవల సల్మాన్ బట్ ఓ లైవ్ షోలో పాల్గొని అభిమానులు అడిగిన పలు ప్రశ్నలపై స్పందించాడు. విదేశీ పర్యటనలలో టీమిండియా విజయాలు సాధించడం వెనుక కారణం ఏంటని ఓ అభిమాని అడగ్గా... 'సీనియర్ జట్టు విదేశీ పర్యటనకు ముందు.. భారత్ తమ 'A' జట్లను అక్కడికి పంపుతుంది. ఇది ఆటగాళ్లకు ఎంతో సహాయపడుతుంది' అని సల్మాన్ తెలిపాడు. 

Also Read: Kidambi Srikanth: సరికొత్త చరిత్ర సృష్టించిన కిడాంబి శ్రీకాంత్‌.. సైనా, సింధు తర్వాత!!

'భారత్ 'ఎ' జట్లు ఇంగ్లండ్, ఆస్ట్రేలియాకు వెళ్లాయి. దక్షిణాఫ్రికా పర్యటనకు వెళ్లారు. దాంతో జాతీయ జట్టులోకి రాకముందే ఆటగాళ్లకు అనుభవం వస్తుంది. జట్టులోకి వచ్చాక మంచి ప్రదర్శన చేస్తున్నారు. ఇక్కడే టీమిండియా సక్సెస్ అవుతుంది. మిగతా జట్లు ఇలా చేయడం లేదు. ఓ ఉదాహరణ చెప్పాలంటే.. మహ్మద్ సిరాజ్ ఫస్ట్-క్లాస్ మ్యాచ్‌లలో ఎక్కువగా భారతదేశం వెలుపల ఆడాడు. మంచి ప్రదర్శన చేశాడు. ఇతర దేశాలు అలా చేయడం లేదు. భారతదేశం వలె నాలుగు రోజుల క్రికెట్‌కు తమ 'ఎ' జట్లను పంపడం లేదు. ఇంతకుముందు ఆస్ట్రేలియా 'ఎ' పాకిస్తాన్‌కు రావడాన్ని చూసేవారు. శ్రీలంక 'ఎ', దక్షిణాఫ్రికా 'ఎ' కూడా ఇక్కడకు వచ్చేవి. ఇప్పుడు అలా రావడం లేదు' అని పాకిస్థాన్ మాజీ క్రికెటర్ సల్మాన్ బట్ (Salman Butt) చెప్పాడు. 

Also Read: Pushpa Movie Latest Update: పుష్ప సినిమాలో ఇవాళ్టి నుంచి ఆ సీన్ కట్..రష్మిక ప్రైవేట్ పార్ట్స్‌పై..

'కొన్ని దేశాలు సుదీర్ఘ ఫార్మాట్లలో ((Test Cricket)) ఆడదానికి అంతగా ఆసక్తి చూపట్లేదు. టెస్టులు ఆడేందుకు ఆటగాళ్లు సిద్ధంగా లేరు. అందరూ ఇలా ఉన్నారని నా ఉద్దేశం కాదు. టెస్టు క్రికెట్‌కు సంబంధించిన ఆలోచనా విధానాన్ని మార్చాలి. ఆటగాళ్లలో మార్పు తీసుకురావాలి. అప్పుడే టెస్ట్ మ్యాచులు తరచూ మనం చూడొచ్చు' అని సల్మాన్ బట్ (Salman Butt) పేర్కొన్నాడు. మాజీ ఓపెనర్ అయిన సల్మాన్ బట్ పాకిస్థాన్ (Pakistan) తరఫున 33 టెస్టులు, 78 వన్డేలు, 24 టీ20లు ఆడాడు. ప్రస్తుతం సల్మాన్ వ్యాఖ్యాతగా కొనసాగుతున్నాడు. 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News