T20 World Cup 2024 Promo: జూన్ 1 నుంచి అమెరికా, వెస్టిండీస్ వేదికగా ప్రతిష్ఠాత్మక టీ20 ప్రపంచకప్ ప్రారంభం కానుంది. దాదాపు నెల రోజులపాటు జరిగే ఈ క్రికెట్ పోటీల్లో ఎప్పుడూ లేని విధంగా 20 జట్లు పాల్గొంటున్నాయి. ఈ మెగా టోర్నీకి సంబంధించిన జట్లను ప్రకటించేందుకు చివరి రోజు మే 01. ఈ నేపథ్యంలో వరల్డ్ కప్ కప్ కు జట్టును ఎంపిక చేసేందుకు బీసీసీఐ సెలక్షన్ కమిటీ కసరత్తు చేస్తుంది. టీమిండియా జట్టును ఏప్రిల్ 30 లేదా మే 01న ప్రకటించే అవకాశం ఉంది.
ఈ వరల్డ్ కప్ లో టీమిండియా తన తొలి మ్యాచ్ ను జూన్ 05న పసికూన ఐర్లాండ్‌తో ఆడబోతుంది. ఆ తర్వాత జూన్ 09న దాయాది పాకిస్థాన్‌తో తలపడబోతుంది. తాజాగా ప్రముఖ స్పోర్ట్స్ ఛానెల్ స్టార్ స్పోర్ట్స్ పొట్టి ప్రపంచకప్ నకు టీమిండియా రెడీ అంటూ ఓ ప్రోమోను రిలీజ్ చేసింది. టీ20 వరల్డ్ కప్ కు రోహిత్ సేన సిద్ధమవుతోంది. వాళ్ల యాక్షన్ చూసేందుకు మీరు సిద్ధమా?’ అనే క్యాప్షన్‌తో ఈ వీడియోను సోషల్ మీడియా వేదికగా షేర్ చేసింది.
వీడియో ఓపెన్ చేస్తే.. ఇందులో టీమిండియా ఆటగాళ్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజాలను చూపించారు. బ్యాక్ గ్రౌండ్ లో వందేమాతరం ’ఫ్లే అవుతోంది. ప్రోమో చివరిలో కోహ్లీ సెల్యూట్ చేయడం ఫ్యాన్స్ కు గుస్ బంప్స్ తెప్పిస్తుంది. ప్రస్తుతం ఈ సాంగ్ ప్రోమో సోషల్ మీడియాను ఓ ఊపు ఊపేస్తుంది. గతేడాది వన్డే ప్రపంచకప్ ఫైనల్లో ఓటమికి ప్రతీకారంగా టీ20 ప్రపంచకప్ గెలవాలని భారత అభిమానుల ఆశిస్తున్నారు.
𝙂𝙊𝙊𝙎𝙀𝘽𝙐𝙈𝙋𝙎 😍@ImRo45 & Co. are getting ready to light up the stage and claim the Ultimate T20 Prize! 🔥🏆
𝐈𝐧𝐝𝐢𝐚 𝐢𝐬 𝐫𝐞𝐚𝐝𝐲 𝐟𝐨𝐫 𝐭𝐡𝐞 𝐖𝐨𝐫𝐥𝐝 𝐂𝐮𝐩 - How excited are you to watch them in action? 🤩
Tune in to #T20WorldCupOnStar
June 2 onwards | only… pic.twitter.com/gvDVscqqi6— Star Sports (@StarSportsIndia) April 23, 2024
Also Read: Irfan Pathan: టీ20 వరల్డ్‌కప్‌లో రోహిత్ కు జోడి అతడే.. గిల్ కాదు..!
Also Read: IPL 2024 Updates: అంపైర్‌తో గొడవ.. విరాట్ కోహ్లీకి భారీ జరిమానా..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Facebook, Twitter