Virat Kohli Dressing Room Video: విరాట్ కోహ్లీకి చోలె భటురే అంటే అంత ఇష్టమా ?

Virat Kohli Dressing Room Video: విరాట్ కోహ్లీ డ్రెస్సింగ్ రూమ్ వీడియో చూసిన నెటిజెన్స్ ఆ లంచ్ పార్సెల్లో అంతగా ఏముంది అని చర్చించుకుంటున్నారు. అంతేకాదు.. విరాట్ కోహ్లికి ఢిల్లీలోని ఒక హోటల్లో తయారు చేసే చోలే భటురే అంటే చాలా ఇష్టం అనే సంగతి తెలిసిందే.

Written by - ZH Telugu Desk | Last Updated : Feb 18, 2023, 09:21 PM IST
Virat Kohli Dressing Room Video: విరాట్ కోహ్లీకి చోలె భటురే అంటే అంత ఇష్టమా ?

Virat Kohli Dressing Room Video: విరాట్ కోహ్లీకి సంబంధించిన డ్రెస్సింగ్ రూమ్ వీడియో ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. ఆ వీడియోలో అంత వైరల్ అయ్యే సీన్ ఏముందంటే.. ప్రస్తుతం జరుగుతున్న బార్డర్ - గవాస్కర్ ట్రోఫీ సిరీస్‌లో భాగంగా శనివారం నాడు ఇండియా vs ఆస్ట్రేలియా జట్ల మధ్య రెండో టెస్ట్ మ్యాచ్ జరుగుతుండగా.. డ్రెస్సింగ్ రూమ్ సిబ్బందిలో ఒకరు విరాట్ కోహ్లీకి లంచ్ పార్సెల్ తీసుకొచ్చాడు. లంచ్ పార్సెల్ చూడటంతోనే విరాట్ కోహ్లీ ఇచ్చిన రియాక్షన్ అభిమానులను, నెటిజెన్స్‌ని విశేషంగా ఆకట్టుకుంటోంది. ఎవరైనా తమకు చాలా ఆకలితో ఉన్నప్పుడు బాగా నచ్చిన, రుచికరమైన ఆహారం కళ్ల ముందుకు వస్తే ఎలా ఉంటుందో.. విరాట్ కోహ్లీ ఇచ్చిన రియాక్షన్ కూడా ఆల్మోస్ట్ అలాగే ఉంది.

బాగా ఆకలితో ఉండి.. ఆన్లైన్లో ఆర్డర్ చేసిన లంచ్ పార్సెల్ ఎప్పుడెప్పుడు వస్తుందా అని ఆకలితో ఎదురుచూసిన వాళ్ల కళ్లలో ఎలాంటి మెరుపైతే కనిపిస్తుందో.. అచ్చం అలాంటి ఫీలింగే విరాట్ కోహ్లీ ముఖంలోనూ కనిపించింది. 

విరాట్ కోహ్లీ డ్రెస్సింగ్ రూమ్ వీడియో చూసిన నెటిజెన్స్ ఆ లంచ్ పార్సెల్లో అంతగా ఏముంది అని చర్చించుకుంటున్నారు. అంతేకాదు.. విరాట్ కోహ్లికి ఢిల్లీలోని ఒక హోటల్లో తయారు చేసే చోలే భటురే అంటే చాలా ఇష్టం అనే సంగతి తెలిసిందే. విరాట్ కోహ్లీ ఇచ్చిన రియాక్షన్ చూస్తోంటే.. ఈ లంచ్ పార్సెల్లో ఆ చోలే భటురేనే ఉన్నట్టుంది అని విరాట్ కోహ్లీ ఫ్యాన్స్, నెటిజెన్స్ కామెంట్ చేస్తూ తమ ఫేవరైట్ క్రికెటర్‌ని ఆట పట్టిస్తున్నారు.

 

 

 

 

 

ఇంకొంత మంది నెటిజెన్స్ స్పందిస్తూ.. విరాట్ కోహ్లీకి చోలె భటురే అంటే అంత ఇష్టమా అని డౌట్ ఎక్స్‌ప్రెస్ చేస్తున్నారు.  

 

 

 

ఇటీవల ఇన్‌స్టాగ్రామ్ పేజీలో ఛోలె భటురే ఫోటోలు పోస్ట్ చేసిన విరాట్ కోహ్లీ భార్య అనుష్క శర్మ.. ఢిల్లీలోని చల్లటి వాతావరణంలో ఆ వేడి వేడి ఫుడ్ ని ఎంజాయ్ చేస్తున్నట్టు ఫోజిచ్చిన సంగతి తెలిసిందే. అంతేకాదు.. గతంలో ఒకసారి విరాట్ కోహ్లీ గురించి అనుష్కా శర్మ మాట్లాడుతూ.. " అప్పుడప్పుడు కోహ్లీ తనకు ఇష్టమైన మీల్స్ వీడియోలు చూస్తుంటాడు " అని కూడా వెల్లడించింది. మొత్తానికి విరాట్ కోహ్లి డ్రెస్సింగ్ రూమ్ వీడియో ఇండియా vs ఆస్ట్రేలియా రెండో టెస్ట్ మ్యాచ్ కంటే ఎక్కువ ఆకర్షించింది. అందుకే దీనిపై ఇప్పుడు సోషల్ మీడియాలో మీమ్స్ కూడా వైరల్ అవుతున్నాయి.

ఇది కూడా చదవండి : IPL 2023 Free Live streaming: ఉచితంగా ఐపిఎల్ 2023 లైవ్ స్ట్రీమింగ్.. ఎలా అంటే..

ఇది కూడా చదవండి : TVS Ronin: ధోని బైక్ కొన్నాడు.. 225CC పవర్‌ఫుల్ ఇంజన్.. ధర మాత్రం చాలా తక్కువే

ఇది కూడా చదవండి : Best Selling Hatchbacks: ఎక్కువగా అమ్ముడవుతున్న హ్యాచ్‌బ్యాక్ కార్లు ఇవే

ఇది కూడా చదవండి : Hyundai Creta Car: రూ. 12 లక్షల SUV కారు రూ. 4.75 లక్షలకే.. టెంప్ట్ చేస్తోన్న ఆఫర్

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook

Trending News