India Vs Australia: ఓవల్‌లో టీమిండియా బౌలర్ల ప్రదర్శన ఇలా.. ఎవరు కీలకం అంటే..?

World Test Championship Final 2023: డబ్ల్యూటీసీ ఫైనల్ మ్యాచ్ జరిగే ఓవల్‌ గ్రౌండ్‌లో టీమిండియా బౌలర్లకు మెరుగైన రికార్డే ఉంది. ప్రస్తుతం జట్టులో ఉన్న బౌలర్లకు ఒక్క మ్యాచ్ అయినా ఆడిన అనుభవం ఇక్కడ ఉంది. ఈ పిచ్‌పై గతంలో రవీంద్ర జడేజా మంచి ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. ఇతర బౌలర్ల ప్రదర్శన ఎలా ఉందంటే..?  

Written by - Ashok Krindinti | Last Updated : Jun 5, 2023, 06:53 PM IST
India Vs Australia: ఓవల్‌లో టీమిండియా బౌలర్ల ప్రదర్శన ఇలా.. ఎవరు కీలకం అంటే..?

World Test Championship Final 2023: వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్‌ ఫైనల్ మ్యాచ్‌కు రంగం సిద్ధమైంది. భారత్, ఆస్ట్రేలియా జట్ల ఆటగాళ్లు ప్రాక్టీస్‌లో మునిగి తేలుతున్నారు. రెండు జట్లు విజయమే లక్ష్యంగా బరిలోకి దిగుతున్నాయి. ఈ నెల 7వ తేదీ నుంచి ఇంగ్లాండ్‌లోని ఓవల్‌ వేదికగా రెండు జట్ల మధ్య పోరు ఆరంభంకానుంది. ఈ మ్యాచ్ కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూశారు. ఓవల్ గ్రౌండ్‌లో టీమిండియా బౌలర్ల రికార్డు బాగానే ఉంది. రవీంద్ర జడేజా కీలకంగా మారే అవకాశం ఉంది. ప్రస్తుతం జట్టులో ఉన్న బౌలర్ల రికార్డు ఎలా ఉందో చూద్దాం..

ప్రస్తుతం జట్టులో ఉన్న బౌలర్లలో ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా ఈ గ్రౌండ్‌లో రెండు టెస్ట్ మ్యాచ్‌లు ఆడాడు. ఈ రెండు మ్యాచ్‌ల్లో 11 వికెట్లు పడగొట్టాడు. 2018లో ఇక్కడ తన తొలి మ్యాచ్ ఆడిన జడ్డూ.. ఆ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్‌లో జడేజా 30 ఓవర్లలో 79 పరుగులిచ్చి 4 వికెట్లు తీశాడు. రెండో ఇన్నింగ్స్‌లో 47 ఓవర్లు వేసి 3 వికెట్లు తీశాడు. మళ్లీ 2021లో ఆడిన రెండో టెస్టులో జడేజా రెండు ఇన్నింగ్స్‌ల్లో రెండు వికెట్ల చొప్పున నాలుగు వికెట్లు పడగొట్టాడు. 

పేసర్లు ఉమేష్ యాదవ్, శార్దూల్ ఠాకూర్, మహ్మద్ సిరాజ్ ఓవల్ గ్రౌండ్‌ ఒక్కో మ్యాచ్ ఆడారు. 2021లో ఇంగ్లండ్‌తో జరిగిన టెస్ట్ మ్యాచ్‌లో వీరు ముగ్గురు ఆడారు. ఈ మ్యాచ్‌లో ఉమేష్ యాదవ్ రెండు ఇన్నింగ్స్‌లో మూడు వికెట్ల చొప్పున 6 వికెట్లు తీశాడు. శార్దూల్ ఠాకూర్ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్‌లో 15 ఓవర్లలో 54 పరుగులిచ్చి ఒక వికెట్.. రెండో ఇన్నింగ్స్‌లో 8 ఓవర్లలో 22 పరుగులిచ్చి 2 వికెట్లు పడగొట్టాడు. మహ్మద్ సిరాజ్ తొలి ఇన్నింగ్స్‌లో 12 ఓవర్లలో 42 పరుగులిచ్చి ఒక వికెట్ తీయగా.. రెండో ఇన్నింగ్స్‌లో ఒక్క వికెట్ కూడా దక్కలేదు.

Also Read: WTC Final 2023: డబ్ల్యూటీసీ ఫైనల్ 2023.. జడేజా కంటే అశ్విన్‌ మంచి ఎంపిక: పాంటింగ్

ఈ గ్రౌండ్‌లో రవిచంద్రన్ అశ్విన్ 2014లో ఇంగ్లండ్‌తో టెస్ట్ మ్యాచ్ ఆడాడు. 21.3 ఓవర్లలో 72 పరుగులు ఇచ్చి 3 వికెట్లు పడగొట్టాడు. ఫాస్ట్ బౌలర్ మహ్మద్ షమీ చివరిసారిగా 2018లో ఇంగ్లాండ్‌తో ఈ మైదానంలో టెస్టు మ్యాచ్ ఆడాడు. తొలి ఇన్నింగ్స్‌లో షమీ 30 ఓవర్లలో 72 రన్స్ ఇచ్చి వికెట్లు ఏమీ తీయలేదు. రెండో ఇన్నింగ్స్‌లో మాత్రం షమీ 25 ఓవర్లలో 110 పరుగులిచ్చి 2 వికెట్లు తీశాడు. పిచ్ స్వభావాన్ని బట్టి.. ఒక స్పిన్నర్‌ను జట్టులోకి తీసుకుంటే రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్‌లలో ఒకరినే తుది జట్టులోకి తీసుకుంటారు. కాస్త పిచ్‌కు సహరించే అవకాశం ఉన్నా.. ఇద్దరు తుది జట్టులో ఉంటారు.

Also Read: WTC Final 2023: డబ్ల్యూటీసీ 2023.. రిషభ్‌ పంత్‌కు తుది జట్టులో చోటు!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebook మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News