Deepak Hooda century put pressure on Virat Kohli: టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కోహ్లీ మైదానంలోకి అడుగుపెట్టాడంటే.. ఫార్మాట్ ఏదైనా పరుగుల వరద పారాల్సిందే. ప్రపంచ టాప్ బౌలర్లను సైతం అలవోకగా ఎదుర్కొంటూ.. రన్స్ చేస్తాడు. చూస్తుండగానే హాఫ్ సెంచరీ, సెంచరీ చేస్తుంటాడు. ఇప్పటికే ఎన్నో చిరస్మరణీయ ఇన్నింగ్స్ ఆడిన కోహ్లీ.. మరెన్నో ఘనతలను ఖాతాలో వేసుకున్నాడు. ఈ క్రమంలోనే రన్‌మెషీన్‌గా పేరు తెచ్చుకున్నాడు. అయితే ఇదంతా గతం.
గత మూడేళ్ళుగా విరాట్ కోహ్లీ జోరుకు బ్రేక్ పడింది. ఏమైందో ఏమో తెలియదు కానీ సెంచరీల మోత మోగించే కోహ్లీ బ్యాట్ మూగబోయింది. మూడు ఫార్మాట్లలో ఆడపాదడపా ఇన్నింగ్స్‌లు ఆడుతున్నా.. తన స్థాయికి తగ్గ ప్రదర్శన మాత్రం చేయడం లేదు. కోహ్లీ తిరిగి ఫామ్‌లోకి వస్తాడని, సెంచరీ చేస్తాడని కళ్లు కాయలు కాసేలా ఎదురు చూసిన అభిమానులు ఆశలు వదిలేసుకుంటున్నారు. మరోవైపు మాజీల నుంచి విమర్శలు కూడా ఎక్కువయ్యాయి. కోహ్లీ 2-3 నెలలు విశ్రాంతి తీసుకోవాలని అందరూ సూచిస్తున్నారు. దీంతో భారత్ యాజమాన్యం సైతం అతడికి విశ్రాంతినిచ్చింది.
ఐపీఎల్ 2022 అనంతరం జూన్‌లో స్వదేశంలో దక్షిణాఫ్రికాతో జరిగిన టీ20 సిరీస్‌కు విరాట్ కోహ్లీని టీమిండియా సెలెక్టర్లు ఎంపిక చేయలేదు. నెల రోజులకు పైగా విరామం అనంతరం ఇంగ్లండ్‌తో ఆడిన ఐదో టెస్టులోనూ (11, 20) నిరాశ పరిచాడు. ఇప్పుడు ఇంగ్లండ్‌తో టీ20 సిరీస్ తొలి మ్యాచ్‌లో ఇషాన్ కిషన్ మినహా అందరూ రాణించారు. దీపక్ హుడా, సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా, దినేశ్ కార్తీక్ దంచికొట్టారు. రాబోయే ప్రపంచకప్‌లో ఎలాగైనా జట్టులో స్థానం సంపాదించాలని చుస్తున్నారు. ముఖ్యంగా హుడా ఐర్లాండ్‌తో ఆడిన రెండు మ్యాచ్‌ల్లో అదరగొట్టడమే కాకుండా ఇంగ్లండ్‌తో తొలి మ్యాచ్‌లో విరాట్ స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చి దుమ్ములేపాడు. కోహ్లీ ఆడే మూడో స్థానంలో పాతుకుపోయేందుకు ఎదురు చూస్తున్నాడు.
మరోవైపు టెస్ట్ ఆడిన రిషబ్ పంత్, శ్రేయస్ అయ్యర్, రవీంద్ర జడేజా రెండో టీ20కి అందుబాటులోకి వస్తారు. దీంతో జట్టులో తీవ్ర పోటీ నెలకొంది. తుది జట్టులో ఎవరు చోటు దక్కించుకుంటారనేది ఇప్పుడు ఆసక్తిగా మారింది. విరాట్ కోహ్లీ స్థానంలో దీపక్ హుడా బరిలోకి దిగినా ఆచ్చర్యపోనక్కర్లేదు. ఈ సిరీస్ అనంతరం వెస్టిండీస్ పర్యటనకు వెళ్లబోడని వార్తలు వినిపిస్తున్నాయి. అదే నిజమైతే టీ20 ప్రపంచకప్ 2022 టోర్నీకి ముందు కోహ్లీ ఇదే చివరి టీ20 సిరీస్ కానుంది. దీంతో ఈ సిరీస్‌లో కోహ్లీ రాణించాల్సిన అవసరం ఎంతో ఉంది.
Also Read: Ravindra Jadeja: సీఎస్‌కేని వీడనున్న రవీంద్ర జడేజా.. బెంగళూరులోకి జడ్డు!
Also Read: Mahesh Babu- Trivikram Movie: ఆగస్టులో రంగంలోకి మహేష్ బాబు.. సమ్మర్ టార్గెట్ ఫిక్స్
స్థానిక నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook