IND Vs PAK 1st Innings Highlights: హైఓల్టెజ్ మ్యాచ్‌లో భారత బౌలర్లు రెచ్చిపోయారు. దయాది పాకిస్థాన్‌ను సూపర్ బౌలింగ్‌తో తక్కువ స్కోరుకే కట్టడి చేశారు. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న పాకిస్థాన్ నిర్ణీత 50 ఓవర్లలో 241 పరుగులకే ఆలౌట్ అయింది. 242 పరుగుల లక్ష్యంతో భారత్ బరిలోకి దిగనుంది. వన్‌డౌన్ బ్యాట్స్‌మెన్ సౌద్ షకీల్ (62) హాఫ్ సెంచరీ బాదగా.. కెప్టెన్ రిజ్వాన్ (46) రాణించాడు. ఖుష్దిల్ షా (38) చివర్లో మెరుపులు మెరిపించాడు. ఎన్నో అంచనాలు పెట్టుకున్న బాబర్ ఆజం (23) తక్కువ స్కోరుకే ఔట్ అయ్యాడు. భారత బౌలర్లలో కుల్దీప్ యాదవ్ 3 వికెట్లు తీయగా.. హార్థిక్ పాండ్యా 2, అక్షర్ పటేల్, రవీంద్ర జడేజా, హర్షిత్ రాణా తలో వికెట్ పడగొట్టారు.
టాస్ గెలిచిన పాక్ కెప్టెన్ రిజ్వాన్ మరో ఆలోచన లేకుండా మొదట బ్యాటింగ్ ఎంచుకున్నాడు. ఓపెనర్లు బాబర్ ఆజం, ఇమామ్-ఉల్-హక్ మొదటి వికెట్‌కు 41 పరుగులు జోడించారు. హార్థిక్ పాండ్యా బౌలింగ్‌లో కీపర్ కేఎల్ రాహుల్‌కు బాబర్ ఆజం (23) క్యాచ్ ఇచ్చి ఔట్ అవ్వడంతో పాక్ తొలి వికెట్ కోల్పోయింది. కాసేపటికే అనవసరమైన సింగిల్ కోసం ప్రయత్నించి.. అక్షర్ పటేల్ సూపర్ త్రోకు ఇమామ్ (10) రనౌట్ అయ్యాడు. వన్‌డౌన్ బ్యాట్స్‌మెన్ సౌద్ షకీల్, కెప్టెన్ మహ్మద్ రిజ్వాన్ ఇన్నింగ్స్ చక్కదిద్దారు. ఇద్దరు స్ట్రైక్ రొటెట్ చేస్తూ.. వికెట్ ఇవ్వకుండా భారత బౌలర్లను ధీటుగా ఎదుర్కొన్నారు. వీరిద్దరు 3వ వికెట్‌కు 104 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పడంతో పాక్ జట్టు కోలుకున్నట్లే కనిపించింది.
రిజ్వాన్ (77 బంతుల్లో 46 పరుగులు)ను 34వ ఓవర్‌లో అక్షర్ పటేల్ ఔట్ చేయడంతో పాక్ మళ్లీ కష్టాల్లో పడింది. కాసేపటికే హాఫ్ సెంచరీతో ఆకట్టుకున్న సౌద్ షకీల్ (76 బంతుల్లో 62 పరుగులు)ను కుల్దీప్ యాదవ్ పెవిలియన్‌కు పంపించాడు. తయ్యాబ్ తహీర్ (4) జడేజా క్లీన్‌బౌల్డ్ చేశాడు. ఖుష్దిల్ షా (39 బంతుల్లో ౩8, 2 సిక్సర్లు) రాణించడంతో పాక్ గౌరవప్రదమైన స్కోరు చేసింది. అక్షర్ పటేల్ రెండు రనౌట్లు చేయడం విశేషం.
Also Read: School Holiday: విద్యార్థులకు బంపర్ గుడ్‌న్యూస్.. తెలంగాణలో రేపు అన్నీ స్కూళ్లు, కాలేజీలకు సెలవు..
Also Read: Tesla Unit in AP: టెస్లా కోసం చంద్రబాబు ప్రయత్నాలు, ఏపీకు ఉన్న అవకాశాలేంటి
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి