IND vs ENG 3rd Test live score: ఇంగ్లండ్ తో జరుగుతున్న రాజ్ కోట్ టెస్టులో తొలి రోజు టీమిండియా అదరగొట్టింది. ఆదిలోనే మూడు వికెట్లు కోల్పోయినా అద్భుతంగా పుంజుకుని పటిష్ట స్థితిలో నిలిచింది. భారత్ కెప్టెన్ రోహిత్ శర్మ, రవీంద్ర జడేజాలు సెంచరీలతో చెలరేగారు. తొలి మ్యాచ్ ఆడుతున్న సర్ఫరాజ్ ఖాన్ హాఫ్ సెంచరీతో అదరగొట్టాడు. తొలి రోజు ఆట ముగిసే సమయానికి టీమిండియా 86 ఓవర్లలో ఐదు వికెట్లు కోల్పోయి 326 పరుగులు చేసింది. జడేజా(212 బంతుల్లో 110 బ్యాటింగ్, 9 ఫోర్లు, 2 సిక్సర్లు), కుల్‌దీప్ (1 నాటౌట్)క్రీజులో ఉన్నారు.
ఆదుకున్న రోహిత్-జడ్డూ..
టాస్ గెలిచి బ్యాటింగ్ కు దిగిన భారత్ ను మార్క్ వుడ్ ఆదిలోనే దెబ్బకొట్టాడు. యశస్వి, గిల్ వికెట్లను తీసి టీమిండియాను కష్టాల్లోకి నెట్టాడు. కాసేపటికే రజత్ పాటిదార్‌ను హర్ట్లీ ఔట్ చేశాడు. దీంతో రోహిత్ సేన 33 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయింది. ఈ సమయంలో జట్టును రోహిత్, జడేజా ఆదుకున్నరు. వీరిద్దరూ నాలుగో వికెట్ కు 204 పరుగుల పార్టనర్ షిప్ నెలకొల్పారు. ఈ క్రమంలో సెంచరీ చేసిన (196 బంతుల్లో 131, 14 ఫోర్లు, 3 సిక్సర్లు)ను మార్క్‌వుడ్ ఔట్ చేశాడు.
Also Read: IND vs ENG: సెంచరీతో చెలరేగిన రోహిత్.. దాదా రికార్డును బ్రేక్ చేసిన హిట్ మ్యాన్..
రాణించిన సర్ఫరాజ్..
అనంతరం హాప్ సెంచరీ చేసిన జడ్డూకు జతకలిసిన సర్ఫరాజ్ ఖాన్ అంచనాలకు మించి ఆడాడు. వీరిద్దరూ నిలకడగా ఆడుతూ స్కోరు బోర్డును పరుగులెత్తించారు. టీ బ్రేక్ తర్వాత రవీంద్ర జడేజా 99 పరుగుల వద్ద ఉండగా.. సర్పరాజ్ రనౌట్ అయ్యాడు. అనంతరం జడేజా శతకాన్ని సాధించాడు. ఇది టెస్టుల్లో జడ్డూకు నాలుగోది. ఇంగ్లండ్ బౌలర్లలో వుడ్ మూడు వికెట్లు తీశాడు.
Also Read: Sarfaraz Khan: టెస్టు ఆరంగ్రేటం చేసిన సర్ఫరాజ్.. కన్నీళ్లు పెట్టుకున్న తండ్రి.. వీడియో వైరల్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Facebook, Twitter