Ind Vs Pak, Asia Cup 2023: ఆసియా కప్ 2023 లో ఇండియా Vs పాకిస్తాన్ జరిగిన సూపర్ 4 మ్యాచ్‌లో భారత్ తమ చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్ ని చిత్తుచిత్తుగా ఓడించి దాయాదుల పోరులో అత్యంత భారీ తేడాతో గెలిచిన దేశంగా చరిత్ర సృష్టించింది. విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్ తమ బ్యాటింగ్‌తో పాకిస్థాన్ బౌలర్లకు చుక్కలు చూపించగా.. భారత స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ 5 వికెట్లు తీసి తన బౌలింగ్‌తో పాకిస్థాన్ బ్యాట్స్‌మెన్‌కి చుక్కలు చూపించాడు. ఫలితంగా టీమిండియా 228 పరుగుల భారీ తేడాతో పాకిస్థాన్‌ని ఓడించి భారతీయులకు అద్భుతమైన విజయాన్ని అందించింది.
ముందుగా బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత 50 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 356 పరుగుల భారీ స్కోర్ సాధించి పాక్‌కు 357 పరుగుల భారీ విజయ లక్ష్యాన్ని నిర్దేశించింది. అద్భుతమైన బ్యాటింగ్‌తో రాణించిన విరాట్ కోహ్లి 122 పరుగులు (94 బంతుల్లో), కేఎల్ రాహుల్ 111 పరుగులు (106 బంతుల్లో) నాటౌట్‌గా నిలిచారు.
అంతకంటే ముందుగా బ్యాటింగ్‌కి వచ్చిన టీమిండియా ఓపెనర్లు రోహిత్ శర్మ (56), శుభ్‌మన్ గిల్ (58) 121 పరుగుల భాగస్వామ్యం తర్వాత ఔట్ కాగా ఆ తరువాత ఒకరి తరువాత ఒకరిగా క్రీజులోకి వచ్చిన విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్ పాకిస్థాన్ బౌలర్లపై రెచ్చిపోయారు. విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్ దూకుడు ముందు పాకిస్థాన్ బౌలర్లు దాదాపు చేతులెత్తేశారు. అందువల్లే ఇంత భారీ స్కోర్ సాధ్యమైంది.
బౌలింగ్‌లో చేతులెత్తిన పాకిస్థాన్.. బ్యాటింగ్‌లోనూ ఏ దశలోనూ భారత్‌కి పోటీ ఇవ్వలేకపోయింది. కుల్దీప్ యాదవ్ 5 వికెట్లు తీయగా, శార్దూల్ థాకూర్, హార్దిక్ పాండ్యా, జస్‌ప్రీత్ బుమ్రాలకు తలో వికెట్ దక్కింది. భారత బౌలర్లు విసిరిన బంతులను ఎదుర్కోలేక పాకిస్థాన్ బ్యాట్స్‌మెన్ చతికిలపడ్డారు. ఫలితంగా పాకిస్థాన్ 8 వికెట్ల నష్టానికి 128 పరుగులకే చాప చుట్టేసింది. వాస్తవానికి నసీమ్ షా, హరీస్ రవూఫ్ రూపంలో మరో ఇద్దరు పాక్ బ్యాట్స్‌మేన్ మిగిలే ఉన్నప్పటికీ గాయం కారణంగా ఆ ఇద్దరూ అసలు బ్యాటింగ్‌కే రాలేదు. దీంతో భారత్ 228 పరుగుల భారీ తేడాతో పాకిస్తాన్‌పై ఘన విజయం సాధించింది.
ఇది కూడా చదవండి : IND Vs PAK Match Updates: పాక్ బౌలర్లకు టీమిండియా చుక్కలు.. సెంచరీలతో చెలరేగిన విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్
ఆసియా కప్ 2023 లో భారత్ నమోదు చేసిన ఈ అద్భుతమైన ఘన విజయం కేవలం టీమిండియాకు విజయాన్ని అందించడమే కాకుండా విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్ బ్యాటింగ్ విషయంలో వారిని వేలెత్తి చూపించే వారికి ఓ సమాధానం ఇచ్చినట్టయింది. కొలంబోలో విరాట్ కోహ్లీకి ఇది 4వ సెంచరీ కాగా ఇంటర్నేషనల్ కెరీర్లో ఇది 77వ సెంచరీ. అంతేకాకుండా అత్యంత వేగంగా 13000 పరుగులు పూర్తి చేసుకున్న ఆటగాడిగానూ విరాట్ కోహ్లీ రికార్డు సొంతం చేసుకున్నాడు.
ఇది కూడా చదవండి : All Time Cricket Records: వీళ్ల క్రికెట్ రికార్డులను బద్ధలు కొట్టినోళ్లే లేరు.. ఇప్పట్లో కొట్టేవాళ్లే లేరు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3P3R74U
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి