India Vs Srilanka 2nd Test Match: బెంగళూరులోని ఎం చిన్నస్వామి స్టేడియంలో జరుగుతున్న రెండో టెస్టు మ్యాచ్‌లో 238 పరుగుల తేడాతో శ్రీలంకపై భారత్ విజయం సాధించింది. జరిగిన రెండు సీరీస్ టెస్ట్ మ్యాచ్ లలో భారత్ 2-0 శ్రీలంక జట్టును క్లీన్ స్వీప్ చేసి, సీరీస్ కైవసం చేసుకుంది.
అయితే శ్రీలంక కెప్టెన్ దిముత్ కరుణరత్నే, సెంచరీ పూర్తి చేసి.. ఒంటరి పోరాటం కొనసాగించాడు. టీ బ్రేక్ తర్వాత అక్షర్ పటేల్ వరుసగా నిరోషన్ డిక్వెల్లా మరియు చరిత్ అసలంకలను అవుట్ చేయగా.. మొదటి సెషన్‌లో రవిచంద్రన్ అశ్విన్ వరుసగా కుసాల్ మెండిస్ మరియు ధనజయ డి సిల్వాలను కట్టడి చేసాడు.
అయితే రవీంద్ర జడేజా 1 పరుగుల వద్ద ఏంజెలో మాథ్యూను పెవిలియన్ కు పంపగా.. అప్పటికీ ఈ మ్యాచ్‌లో గెలిచి సిరీస్‌ను కైవసం చేసుకోవడానికి భారత్‌కు ఇంకా 6 వికెట్లు పడగొట్టాల్సి అవసరం ఉంది. అంతకుముందు, 2వ రోజు లాహిరు తిరిమన్నె కీలక ఆటగాడిని బుమ్రా డకౌట్‌గా ఔట్ చాయగా.. ఇతర ముఖ్యమైన ఆటగాళ్ల వికెట్లను పడగొట్టి భారత్ పూర్తి ఆధిక్యం కనబరిచింది.
2ND Test. India Won by 238 Run(s) https://t.co/loTQPg3SYl #INDvSL @Paytm
— BCCI (@BCCI) March 14, 2022
అంతకుముందు రెండవ రోజు, బ్యాటింగ్ ఆర్డర్ జను తగ్గించి, 300 మార్కును దాటి శీలంక జట్టుకు సరైన టార్గెట్ సెట్ చేసి బౌలింగ్ బరిలో దిగింది. ప్రారంభంలో, శ్రేయాస్ అయ్యర్ 92 పరుగుల స్కోరుతో భారత్ తొలి ఇన్నింగ్స్‌లో 252 పరుగులు చేశారు.
ఇండియా ప్లేయింగ్ XI: మయాంక్ అగర్వాల్, రోహిత్ శర్మ (C), హనుమ విహారి, విరాట్ కోహ్లీ, రిషబ్ పంత్ (WK), శ్రేయాస్ అయ్యర్, రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్, అక్షర్ పటేల్, మహ్మద్ షమీ, జస్ప్రీత్ బుమ్రా
శ్రీలంక ప్లేయింగ్ XI: దిముత్ కరుణరత్నే (C), లహిరు తిరిమన్నె, కుసల్ మెండిస్, ఏంజెలో మాథ్యూస్, ధనంజయ డి సిల్వా, చరిత్ అసలంక, నిరోషన్ డిక్వెల్లా (WK), సురంగ లక్మల్, లసిత్ ఎంబుల్దెనియా, విశ్వ ఫెర్నాండో, ప్రవీణ్ జయవిక్రమ్
Also Read: Gang War Video: రోడ్డు మధ్యలో యువతుల 'గ్యాంగ్ వార్'- తీరిగ్గా చూస్తున్న జనం!
Also Read: Soanli Bendre: 18 ఏళ్ల తర్వాత టాలీవుడ్‌కి... ఎన్టీఆర్ సినిమాతో రీఎంట్రీ ఇవ్వబోతున్న సోనాలీ బింద్రే!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook