IPL 2022 Mega Auction: ఇప్పుడంతా ఎక్కడ విన్నా ఐపీఎల్ మెగా ఆక్షన్ 2022 గురించే చర్చ. ఈసారి కొత్తగా అండర్ 19 ఆటగాళ్లు కూడా ఐపీఎల్లో ఎంట్రీ ఇచ్చే అవకాశాలున్నాయి. ఎవరెవరంటే..
ఐపీఎల్ 2022 మెగా ఆక్షన్ మరి కొద్ది గంటల్లోనే ప్రారంభం కానుంది. ఈసారి ఐపీఎల్లో 10 జట్లు పాల్గొంటున్నాయి. కొత్తగా గుజరాత్ టైకూన్స్, లక్నో సూపర్ జెయింట్స్ జట్లు ఎంట్రీ ఇస్తున్నాయి. మరోవైపు ప్రతి యేటా ఉండే రైట్ టు మ్యాచ్ కార్డ్ నిబంధనను బీసీసీఐ తొలగించింది. అంటే వేలంలో పాడుకున్న ప్లేయర్‌ను అదే ధరకు పాత జట్టు పొందేందుకు ఈసారి వీలు లేదు. దాంతో ఈసారి పోటీ గట్టిగానే ఉండబోతోంది.
భారతదేశ క్రికెటర్లలో టాప్ 5లో శిఖర్ ధావన్, శార్ధూల్ ఠాకూర్, శ్రేయస్ అయ్యర్,యజువేంద్ర ఛాహల్,ఇషాన్ కిషన్ ఉంటారు. ఇక విదేశీ క్రికెటర్లలో అయితే ఆస్ట్రేలియా ఓపెనర్, విధ్వంసకర బ్యాటర్ డేవిడ్ వార్నర్, ట్రెంట్ బౌల్డ్, జేసన్ హోల్డర్, మిచెల్ మార్ష్, ప్యాట్ కమిన్స్‌కు భారీగా డిమాండ్ ఉంటుంది. ఈసారి వేలానికి 6 వందల మంది ప్లేయర్లు, 561 కోట్ల మూలధనం వివిధ ఫ్రాంచైజీల వద్ద సిద్ధంగా ఉంది. ఇవాళ తొలిరోజు 161 మంది ప్లేయర్లు వేలంలో పాల్గొంటారు. ఈసారి జరిగే వేలం కోసం బీసీసీఐ కీలక మార్పులు చేసింది. ఫలితంగా అండర్ 19 జట్టు ఆటగాళ్లకు కూడా అవకాశం లభిస్తోంది.
ఐపీఎల్ మెగా వేలం(IPL 2022 Mega Auction) ప్రారంభమయ్యే ముందే అండర్ 19 ఆటగాళ్లకు ఊరట కలిగింది. నాలుగు రోజుల క్రితం 19 ఏళ్ల వయస్సు పరిమితి, స్టేట్ సీనియర్ టీమ్‌కు ఒక మ్యాచ్ అయినా ఆడి ఉండాలనే నిబంధన ఉండేది. ఫలితంగా ఇప్పుడుున్న అండర్ 19 జట్టులో యశ్‌ధుల్ మినహాయించి..మరెవరికీ వేలంలో పాల్గొనేందుకు అవకాశం లేదు. అయితే యువ క్రీడాకారులకు ఐపీఎల్లో అవకాశం కల్పిస్తే బాగుంటుందనేది మెజార్టీ వర్గం అభిప్రాయమైంది. దాంతో ఐపీఎల్ 2022 మెగా ఆక్షన్‌కు ఒకరోజు ముందే బీసీసీఐ ఆ నిబంధన తొలగించి..అండర్ 19 ఆటగాళ్లకు వేలంలో పాల్గొనేందుకు అనుమతిచ్చింది. దాంతో యంగ్ ఇండియా జట్టు నుంచి 10 మంది ఆటగాళ్లు వేలంలో పేరు నమోదు చేసుకున్నారు. కెప్టెన్ యశ్‌ధుల్, వైస్ కెప్టెన్ షేక్ రషీద్, విక్కీ ఒస్త్వాల్, రాజ్ బవా, రాజ్ వర్ధన్ హంగ్ కర్కర్, దినేష్ బానా, రవి కుమార్, నిశాంత్ సింధు, గర్వ్ సంగ్వాన్, అంగ్క్రిష్ రఘువంశీలు ఈ జాబితాలో ఉన్నారు. ఈ పదిమంది కొత్తగా చేరడంతో మొత్తం వేలంలో పాల్గొనేవారి సంఖ్య 6 వందలకు చేరింది.
ఇక అండర్ 19 నుంచి రాజ్ బవా, వైస్ కెప్టెన్ షేక్ రషీద్‌పై ప్రధానంగా వివిధ ఫ్రాంచైజీలు దృష్టి సారించాయి. ఆస్ట్రేలియాతో జరిగిన సెమీ ఫైనల్స్‌లో 94 పరుగులు, ఇంగ్లండ్‌తో జరిగిన ఫైనల్స్‌లో హాఫ్ సెంచరీ సాధించిన అండర్ 19 జట్టు వైస్ కెప్టెన్ షేక్ రషీద్‌పై (Shaik Rashid)కొన్ని జట్లు ప్రధానంగా దృష్టి సారించాయని తెలుస్తోంది రాజ్ బవాపై చెన్నై సూపర్ కింగ్స్ జట్టు ఇప్పటికే కన్నేసింది.
Also read: IPL Mega Auction 2022: ఐపీఎల్ వేలంలో అత్యధిక ధర పలికే టాప్ 5 క్రికెటర్లు వీళ్లేనా
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook