IPL Mega Auction 2022: ఐపీఎల్ మెగా వేలంలో టీమిండియా స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్‌కు భారీ ధర పలికింది. వేలంలో అశ్విన్ కనీస ధర రూ.2 కోట్లు కాగా.. రాజస్తాన్ రాయల్స్ జట్టు ఏకంగా రూ.5కోట్లకు అశ్విన్‌ను దక్కించుకుంది. వేలంలో అశ్విన్‌ను తిరిగి దక్కించుకోవాలని ఢిల్లీ జట్టు భావించినప్పటికీ రాజస్తాన్ రాయల్స్ భారీ ధర వెచ్చించి.. ఢిల్లీ ఆశలకు గండి కొట్టింది. అశ్విన్ అద్భుతమైన ఆఫ్ స్పిన్నరే కాదు, ఆల్ రౌండర్ గాను మంచి ట్రాక్ రికార్డ్ ఉంది. అందుకే రాజస్తాన్ రాయల్స్ అతన్ని భారీ ధరకు కొనుగోలు చేసింది.
Congratulations @ashwinravi99 on being a part of @rajasthanroyals #TATAIPLAuction @TataCompanies pic.twitter.com/hxXN8g8Nmv
— IndianPremierLeague (@IPL) February 12, 2022
విదేశీ ఆటగాడు, ఆస్ట్రేలియా టెస్ట్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్‌కు కూడా ఐపీఎల్ వేలంలో భారీ ధర పలికింది. కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టు కమిన్స్‌ను ఏకంగా రూ.7.25 కోట్లకు దక్కించుకుంది. కమిన్స్ కనీస ధర రూ.2 కోట్లు కాగా.. అంతకు దాదాపు మూడున్నర రెట్లు ఎక్కువగా వెచ్చించింది. కొత్త ఫ్రాంచైజీ గుజరాత్ టైటాన్స్ కమిన్స్‌ను దక్కించుకునేందుకు గట్టిగానే ప్రయత్నించినప్పటికీ చివరకు భారీ ధర వెచ్చించి కోల్‌కతా అతన్ని దక్కించుకుంది.
HE IS BACK with @KKRiders - Congratulations to @patcummins30 pic.twitter.com/8NUbHvPN3O
— IndianPremierLeague (@IPL) February 12, 2022
అంతకుముందు, టీమిండియా డాషింగ్ ఓపెనర్ శిఖర్ ధావన్‌ను పంజాబ్ కింగ్స్ రూ.8.25 కోట్లకు దక్కించుకుంది. ఇవాళ, రేపు (ఫిబ్రవరి 12, 13) రెండు రోజుల పాటు జరిగే ఈ ఐపీఎల్ మెగా వేలంలో మొత్తం 590 మంది ఆటగాళ్లు అందుబాటులో ఉండనున్నారు. ఇందులో 227 మంది విదేశీ ఆటగాళ్లు ఉన్నారు. ఆటగాళ్ల కోసం జట్ల మధ్య పోటాపోటీగా సాగే వేలం పాటను క్రికెట్ ఫ్యాన్స్‌ను ఆసక్తిగా వీక్షిస్తున్నారు. వేలం పాట ముగిసే లోగా ఏ ఆటగాడికి అత్యధిక ధర పలుకుతుందో చూడాలి.
Also Read: AP Special Status: ప్రత్యేక హోదాపై చర్చకు ఏపీకు ఆహ్వానం, త్వరలో హోదా రానుందా..??
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook