IPL KKR vs Punjab: ఐపీఎల్లో భాగంగా ఇవాళ ముంబైలోని వాంఖడే స్టేడియంలో కోల్‌కతా-పంజాబ్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో కోల్‌కతా ఆరు వికెట్ల తేడాతో విజయం సాధించింది. పంజాబ్ నిర్దేశించిన 138 పరుగుల లక్ష్యాన్ని 14.3 ఓవర్లలోనే లక్ష్యాన్ని చేధించింది. లక్ష్య చేధనలో కోల్‌కతా మొదట తడబడినప్పటికీ రసెల్ మెరుపు ఇన్నింగ్స్‌తో మ్యాచ్‌లో నెగ్గింది. రసెల్ 31 బంతుల్లో 8 సిక్స్‌లు, 2 ఫోర్లతో 70 పరుగులు చేసి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. శ్రేయాస్ అయ్యర్ 25 (15), సామ్ బిల్లింగ్స్ (23) పరుగులు చేశారు. అజింక్యా రహానే, వెంకటేశ్ అయ్యర్ తక్కువ స్కోర్లకే ఔటయ్యారు.
అంతకుముందు, టాస్ ఓడి బ్యాటింగ్‌కి దిగిన పంజాబ్ కేవలం 137 పరుగులకే కుప్పకూలింది. తొలి ఓవర్ చివరి బంతికే కెప్టెన్ మయాంక్ అగర్వాల్ (1) పెవిలియన్ చేరాడు. ఆ తర్వాత వెంట వెంటనే వికెట్లు కోల్పోయి 102 పరుగులకే 8 వికెట్లు నష్టపోయింది. దీంతో పంజాబ్ 120 స్కోర్ అయినా సాధిస్తుందా లేదా అన్న సందేహాలు కలిగాయి. చివరలో రబడా 16 బంతుల్లో ఒక సిక్స్, నాలుగు ఫోర్లు బాది 25 పరుగులు చేయడంతో ఆ మాత్రం స్కోరైనా సాధించగలిగింది.
మూడో స్థానంలో బ్యాటింగ్‌కి దిగిన రాజపక్స మూడు సిక్స్‌లు, మూడు ఫోర్లతో 31 పరుగులు చేశాడు. క్రీజులో ఉన్నంతసేపు మెరుపులు మెరిపించిన రాజపక్స శివమ్ మావి బౌలింగ్‌లో క్యాచ్ ఔట్‌గా వెనుదిరిగాడు. పంజాబ్ బ్యాట్స్‌మెన్‌లో రాజపక్సనే టాప్ స్కోరర్. కోల్‌కతా బౌలర్లలో ఉమేష్ యాదవ్ నాలుగు వికెట్లు తీసి పంజాబ్‌ను తక్కువ స్కోర్‌కే ఆలౌట్ చేయడంలో కీలక పాత్ర పోషించాడు. సౌథీ రెండు వికెట్లు తీయగా.. శివమ్ మావి, నరైన్, రసెల్ తలో వికెట్ తీశారు.
Also Read: Telangana Weather: తెలంగాణలో ఆ 6 జిల్లాలకు వాతావరణ శాఖ హెచ్చరిక...
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook