ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్‌లో మహిళల సింగిల్స్ ఫైనల్లో పీవీ సింధు పరాజయం పాలైంది. ఒలింపిక్ స్వర్ణ పతక విజేత స్పెయిన్ క్రీడాకారిణి కరోలినా మారిన్ ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్ విజేతగా నిలిచి స్వర్ణం గెలుచుకుంది. పీవీ సింధు రజత పతకంతో సరిపెట్టుకుంది.
మొదటి గేమ్‌లో కరోలినా పైచేయి సాధించినా.. సింధు గట్టి పోటీ ఇచ్చింది. మొదటి గేమ్‌ను 19-21 తేడాతో చేజార్చుకున్న సింధు.. రెండో గేమ్‌లో తన ఆధిపత్యాన్ని కొనసాగించి.. కరోలినా ధాటికి చేతులెత్తేసింది. రెండో గేమ్ 10-21 తేడాతో సింధు ఓడిపోయి రజత పతకంతో సరిపెట్టుకుంది. ఫైనల్లో కరోలినా 21-19, 21-10 తేడాతో వరుస గేమ్స్‌లో విజయం సాధించింది. చైనాలోని నన్జింగ్ ఒలింపిక్ స్పోర్ట్స్ సెంటర్లో ఈ ఫైనల్ మ్యాచ్ జరిగింది.
అటు కరొలినా మారిన్ మూడు బీడబ్ల్యూఎఫ్ వరల్డ్ ఛాంపియన్షిప్లను సాధించి రికార్డు సృష్టించింది. కోపెన్హాగన్ (2014), జకార్తా (2015), నన్జింగ్ (2018)లలో విజేతగా నిలిచింది.
ఓడినా.. అద్భుత ప్రతిభ చూపించావ్: చంద్రబాబు
ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్‌లో రజతం కైవసం చేసుకున్న పీవీ సింధును సీఎం చంద్రబాబు అభినందించారు. ఫైనల్లో కరోలినా మారిన్ చేతిలో ఓడినా అద్భుత ప్రతిభ చూపించి.. భారత షట్లర్ల ఘనతను చాటిందని చంద్రబాబు కొనియాడారు.