New Look of CSK Captain MS Dhoni during practice session ahead of IPL 2023: 2020 ఆగస్టులో టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు చెప్పారు. రిటైర్మెంట్ ఇచ్చిన తర్వాత మహీ బయట పెద్దగా కనబడడం లేదు. కుటుంబం, వ్యాపారంతో ఫుల్ బిజీ అయిపోయారు. మరోవైపు ప్రాక్టీస్ కూడా చేస్తున్నారు. కేవలం ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) ఉన్నప్పుడు మాత్రమే ఫాన్స్ కంట పడుతున్నారు. మరో 2-3 నెలల్లో ఐపీఎల్ 2023 మొదలవనున్న నేపథ్యంలో ధోనీ తన ప్రాక్టీస్‌ను ఆరంభించారు. ఇటీవలే మహీ ప్రాక్టీస్‌కు సంబంధించిన వీడియో ఒకటి నెట్టింట చక్కర్లు కొట్టింది.
ఐపీఎల్ 2023 కోసం జార్ఖండ్ స్టేట్ క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలో చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ ఎంఎస్ ధోనీ తీవ్రంగా ప్రాక్టీస్ చేస్తున్నారు. గురువారం ప్రాక్టీస్ చేసి మైదానం నుంచి బయటకు వచ్చారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. వీడియోలో మహీ.. తెల్ల గడ్డం, నల్ల జుట్టుతో ఉన్నారు. 41 ఏళ్ల ధోనీ వయసు స్పష్టంగా కనిపిస్తోంది. తెల్ల గడ్డంతో ధోనీని చూసిన అభిమానులు.. కొత్త లుక్‌ని ఇష్టపడుతున్నారు. ఈ వీడియోకి లైకుల, కామెంట్ల వర్షం కురుస్తోంది.
ఎంఎస్ ధోనీ ప్రాక్టీస్‌కు సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇందులో మహీ లాంగ్ షాట్‌లు ఆడటం, డిఫెన్స్ ఆడడం మనం చూడొచ్చు. చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు ఐపీఎల్ 2023 సీజన్ ప్రత్యేకమైనది. ఎందుకంటే ఈ సీజన్ తర్వాత ధోనీ ఐపీఎల్‌కు గుడ్‌బై చెబుతాడని ఊహాగానాలు వినబడుతున్నాయి. ధోనీ తన చివరి ఐపీఎల్ మ్యాచ్‌ను చెన్నై జట్టు హోమ్‌గ్రౌండ్ ఎంఏ చిదంబరం స్టేడియంలో ఆడాలనుకుంటున్నాడు. గతేడాదే ధోనీ రిటైర్మెంట్ ఇవాలనుకున్నా.. కరోనా కారణంగా దేశం వెలుపల ఐపీఎల్ మ్యాచులు జరగడంతో తన నిర్ణయాన్ని మార్చుకున్నారట.
New look of MS Dhoni during the practice session ahead of IPL 2023 pic.twitter.com/5V7qARShxp
— Johns. (@CricCrazyJohns) January 20, 2023
ఐపీఎల్ 2022లో రవీంద్ర జడేజాకు చెన్నై సూపర్ కింగ్స్ నాయకత్వ బాధ్యతలు అప్పగించినా.. మధ్యలోనే జడ్డు వైదొలగడంతో తిరిగి ఎంఎస్ ధోనీకే జట్టు పగ్గాలు వచ్చాయి. గత సీజన్‌లో చెన్నై 14 మ్యాచ్‌లు ఆడి.. నాలుగింటిలో మాత్రమే గెలిచి తొమ్మిదో స్థానంలో నిలిచింది. దాంతో ఈ ఏడాదైనా ఐపీఎల్ టైటిల్ గెలిచి మహీకి ఘనంగా వీడ్కోలు ఇవ్వాలని చెన్నై మేనేజ్మెంట్ భావిస్తోంది. మహీ సారధ్యంలో సీఎస్‌కే ఇప్పటివరకు నాలుగుసార్లు ఐపీఎల్ విజేతగా నిలిచింది.
Also Read: Tata Car Sales 2022: హ్యుందాయ్, మారుతిని కొట్టేసి.. గేమ్ గెలిచేసిన టాటా!
Also Read: IND vs NZ: విజయం ఉత్సాహంలో ఉన్న భారత్‌కు బిగ్ షాక్.. భారీ జరిమానా! తప్పిదాన్ని అంగీకరించిన రోహిత్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.