Mumbai Indians players plays pool volleyball in UAE: ఐపిఎల్ 2021 టోర్నమెంట్లో మిగిలిన మ్యాచ్‌ల కోసం ఆగస్టు 13న అబు ధాబి చేరుకున్న ముంబై ఇండియన్స్ టీమ్ అప్పటి నుంచి క్వారంటైన్లో ఉన్న సంగతి తెలిసిందే. వారం రోజుల పాటు క్వారంటైన్ (IPL 2021 quarantine) పూర్తి కావడంతో ఇవాళ ముంబై ఇండియన్స్ జట్టు ఆటగాళ్లు సరదాగా పూల్ వాలీబాల్ ఆడుతూ క్వారంటైన్ ముగిసిన సంబరాన్ని సరదాగా సెలబ్రేట్ చేసుకున్నారు. తమ పూల్ వాలీబాల్ క్రీడను ఇన్స్టాగ్రామ్ ద్వారా అభిమానులతో షేర్ చేసుకున్న ముంబై ఇండియన్స్ జట్టు ''డ్రైవింగ్ స్ట్రెయిట్ ఔట్ ఆఫ్ క్వారంటైన్ ఫర్ ఏ గేమ్ ఆఫ్ పూల్ వాలీబాల్'' అంటూ ఆ ఇన్‌స్టా పోస్టుకు క్యాప్షన్ పెట్టింది.
Also read : T20 World Cup: టీ20 వరల్డ్ కప్ కోసం జట్టును ప్రకటించిన Cricket Australia
ఐపిఎల్ టోర్నమెంట్స్‌లో ముంబై ఇండియన్స్ జట్టు ఇప్పటివరకు ఐదుసార్లు ట్రోఫీ గెలుచుకుంది. ఈసారి ఐపిఎల్ కరోనావైరస్ కారణంగా మే 4న మధ్యంతరంగా వాయిదా పడే వరకు పాయింట్స్ పట్టికలో ముంబై ఇండియన్స్ (Mumbai Indians) జట్టు 4వ స్థానంలో నిలిచింది. పంజాబ్ కింగ్స్, ఢిల్లీ డెవిల్స్ జట్లు మాత్రమే 8 మ్యాచ్‌లు ఆడగా మిగిలిన జట్లన్నీ 7 మ్యాచ్‌లు మాత్రమే ఆడాయి.
ప్రస్తుతం ఇంగ్లాండ్ పర్యటనలో ఉన్న ముంబై ఇండియన్స్ కెప్టేన్ రోహిత్ శర్మ (Rohit Sharma), జస్ప్రిత్ బుమ్రా లేకుండానే ఆ జట్టు అబు ధాబికి చేరుకుంది. యూఏఈలో సెప్టెంబర్ 19న చెన్నై సూపర్ కింగ్స్ జట్టుతో తొలి మ్యాచ్ ఆడనుండగా.. అంతకంటే ముందుగానే ముంబై ఇండియన్స్ ఆటగాళ్లు అయిన రోహిత్ శర్మ, జస్ప్రిత్ బుమ్రా ఇంగ్లండ్ (Ind vs Eng) పర్యటన ముంగించుకుని అక్కడికి చేరుకోనున్నారు.
Also read : Mohammad Siraj Record: లార్డ్స్ టెస్ట్‌లో 39 ఏళ్ల రికార్డు సమం చేసిన టీమ్ ఇండియా పేసర్ సిరాజ్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook