Pak Vs Eng: పాక్ గడ్డపై అడుగుపెట్టిన ఇంగ్లండ్ జట్టులో కలకలం.. 14 మంది ఆటగాళ్లకు అస్వస్థత

England Players Hit By Virus: పాక్ గడ్డపై టెస్ట్ సిరీస్‌ ఆడేందుకు ఇప్పటికే ఇంగ్లండ్ జట్టు ఆ దేశానికి చేరుకుంది. గురువారం నుంచి రెండు జట్ల మొదటి టెస్ట్ మ్యాచ్‌ ఆరంభం కానుండగా.. ఇంగ్లండ్ జట్టులో 14 మంది ఆటగాళ్లు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు.  

Written by - ZH Telugu Desk | Last Updated : Nov 30, 2022, 04:44 PM IST
Pak Vs Eng: పాక్ గడ్డపై అడుగుపెట్టిన ఇంగ్లండ్ జట్టులో కలకలం.. 14 మంది ఆటగాళ్లకు అస్వస్థత

England Players Hit By Virus: డిసెంబర్ 1 నుంచి పాకిస్థాన్-ఇంగ్లండ్ జట్ల మధ్య టెస్ట్ సిరీస్ మొదలుకానుంది. ఇందుకోసం ఇంగ్లండ్ జట్టు ఇప్పటికే పాకిస్థాన్‌లో అడుగుపెట్టింది. ఈ నేపథ్యంలో ఇంగ్లండ్ జట్టులో ఆటగాళ్లు అనారోగ్యానికి గురవ్వడం కలకలం రేపుతోంది. కెప్టెన్ బెన్ స్టోక్స్‌తో సహా జట్టులోని 14 మంది సభ్యులకు గుర్తు తెలియని వైరస్‌ సోకడంతో తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. దీంతో రేపు రావల్పిండిలో జరగనున్న టెస్ట్ మ్యాచ్ జరిగేది అనుమానంగా మారింది. ప్రస్తుతం ఆటగాళ్లు విశ్రాంతి తీసుకుంటున్నారు. 

ఇంగ్లండ్‌-పాకిస్థాన్‌ల మధ్య మూడు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో తొలి మ్యాచ్ గురువారం నుంచి రావల్పిండిలో ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలోనే ఇంగ్లండ్ ఆటగాళ్లు అస్వస్థతకు గురవ్వడం కలకలం రేపుతోంది. ఫుడ్ పాయిజన్ అని కొందరు ప్రచారం చేస్తుండగా.. ఫ్లూ లాంటి వైరస్ బారిన పడ్డట్లు మరికొందరు చెబుతున్నారు. ఇంగ్లండ్ ఆడగాళ్లు ఏ వైరస్ బారిన పడ్డారో ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది.

టెస్టు మ్యాచ్‌కు ఒకరోజు ముందు కేవలం ఐదుగురు ఆటగాళ్లు మాత్రమే ప్రాక్టీస్ సెషన్‌కు వచ్చినట్లు తెలిసింది. అనారోగ్యం కారణంగా ఆటగాళ్లు ప్రాక్టీస్‌కు రాలేకపోయారు.  
ఆటగాళ్లు హోటల్‌లో విశ్రాంతి తీసుకుంటున్నారు. గురువారం రావల్పిండి వేదికగా తొలి మ్యాచ్, రెండో టెస్టు డిసెంబర్ 9 నుంచి ముల్తాన్‌లో జరగనుంది. చివరి మ్యాచ్ డిసెంబర్ 17 నుంచి కరాచీలో జరుగుతుంది. సెప్టెంబర్ నెలలో ఇరు జట్ల మధ్య 7 మ్యాచ్‌ల టీ20 సిరీస్ జరిగింది. 

చివరిసారిగా ఇంగ్లండ్-పాకిస్తాన్ జట్ల మధ్య 2005లో టెస్టు సిరీస్ ఆడింది. ఇటీవల టీ20 సిరీస్‌కు పాకిస్థాన్‌లో అడుగుపెట్టింది. 17 ఏళ్ల తర్వాత పాక్ గడ్డపై టెస్టు సిరీస్ ఆడేందుకు వచ్చిన ఇంగ్లండ్‌ ఆటగాళ్లు ఇలా అనుకోకుండా అనారోగ్యానికి గురవ్వడం షాక్‌కు గురిచేస్తోంది. అదేవిధంగా బుధవారం క్వెట్టా ప్రాంతంలో మానవబాంబు దాడి జరిగింది. ఈ ఘటనలో ఒక ఉగ్రవాదితోపాటు ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. దేశంలో మరిన్ని మానవబాంబులకు ప్లాన్ చేసినట్లు తెహ్రీక్‌ ఇ తాలిబన్‌ సంస్థ ప్రకటించడం.. తమ ఆటగాళ్లు అస్వస్థతకు గురవ్వడం ఇంగ్లండ్ జట్టులో కలవరం నెలకొంది. గతేడాది భద్రతా కారణాల రీత్యా టెస్ట్ సిరీస్‌ను రద్దు చేసుకుని న్యూజిలాండ్ జట్టు వెనక్కివెళ్లిపోయింది. ఇంగ్లండ్ కూడా వాయిదా వేసుకుని ఇప్పుడు ఆడేందుకు వచ్చింది. 

ఇంగ్లండ్ జట్టు: జేమ్స్ అండర్సన్, బెన్ స్టోక్స్ (కెప్టెన్), బెన్ డకెట్, బెన్ ఫాక్స్ (వికెట్ కీపర్), విల్ జాక్స్, కీటన్ జెన్నింగ్స్, జాక్ లీచ్, లియామ్ లివింగ్‌స్టోన్, జామీ ఓవర్‌టన్, ఒల్లీ పోప్, రెహాన్ అహ్మద్, ఆలీ రాబిన్సన్, హ్యారీ బ్రూక్, జాక్ క్రాలే, జో రూట్, మార్క్ వుడ్.

Also Read: India Vs New Zealand: మూడో వన్డే కూడా రద్దు.. న్యూజిలాండ్‌దే సిరీస్  

Also Read: China-America: భారత్‌తో సంబంధాల్లో జోక్యం చేసుకోవద్దు.. అమెరికాకు చైనా వార్నింగ్  

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook

Trending News