జొహన్నెస్‌బర్గ్ వేదికగా జరుగుతున్న నాలుగో వన్డేలో సౌతాఫ్రికా జట్టు క్రీడాకారులు 'పింక్ డ్రెస్' లో కనిపించారు. అసలు ఈ 'పింక్ డ్రెస్' కథ ఏంటో తెలుసుకుందామా ..! రొమ్ము క్యాన్సర్‌పై అవగాహన పెంచే కార్యక్రమంలో భాగంగా ఈ మ్యాచ్‌ను ‘పింక్ వన్డే’ గా పరిగణిస్తున్నారు. సంవత్సరంలో ఒకసారి ఈ మ్యాచ్ కోసం సఫారీ ఆటగాళ్లు గులాబీ దుస్తులతో బరిలోకి దిగడం సాంప్రదాయంగా వస్తోంది. ఈ మ్యాచ్ ద్వారా వచ్చే ఆదాయంలో పది లక్షల సౌతాఫ్రికా ర్యాండ్లను స్థానిక చార్లొట్ మ్యాక్సికే అకడమిక్ హాస్పిటల్‌కు అందజేస్తారు. 2011 నుంచి దక్షిణాఫ్రికా ఐదు వన్డేల్లో పింక్ దుస్తులతో బరిలోకి దిగగా ఐదింటిలోనూ విజయం సాధించడం విశేషం.స్పిరిట్ ఆఫ్ అకేషన్లో భాగంగా సౌతాఫ్రికన్లు 'పిచ్ అప్ ఇన్ పింక్' అనే హ్యాష్ ట్యాగ్‌ను వాడుతారు. 2013లో భారత జట్టు చివరి సౌతాఫ్రికా పర్యటనలో వాండరర్స్ గ్రౌండ్లో 'పింక్ వన్డే' ఆడింది.