Syed Modi International Tournament: భారత స్టార్ షట్లర్ పీవీ సింధుకు అంతర్జాతీయ స్థాయిలో వరుస ఓటముల నుంచి ఎట్టకేలకు ఊరట లభించింది. లక్నోలో జరుగుతున్న 'సయ్యద్ మోదీ అంతర్జాతీయ బ్యాడ్మింటన్ టోర్నీ 2022' ఉమెన్స్ సింగిల్స్ ఫైనల్స్‌లో విజయం సాధించింది. దీనితో అంతర్జాతీయ మ్యాచ్‌లలో 2022కు మంచి ఆరంభం (PV Sindhu wins) చేసింది.
ఈ టోర్నీ ఫైనల్ మ్యాచ్‌లో పీవీ సింధు.. మన దేశానికే చెందిన మాల్వికా బన్సోద్తో తలపడింది. 35 నిమిషాల పాటు సాగిన ఈ మ్యాచ్‌లో.. 12-13, 21-16 తేడాతో ఆధిపత్యం కొనసాగించి.. విజయం (Syed Modi tourney finals) సాధించింది.
సెమీస్‌లో ఇలా..
సెమీస్‌లో రష్యాకు చెందిన ఎవ్‌గెనియా కొస్సెత్సకయాతో తడబడింది సింధు. అయితే అమె మధ్యలోనే మ్యాచ్ నుంచి తప్పుకోవడంతో.. సింధును విజేతగా ప్రకటించారు న్యాయనిర్ణేతలు. దీనితో ఫైనల్స్‌కు చేరిన సింధు.. చివరి మ్యాచ్‌లో తన సత్తా (Syed modi tourney women's single) చాటుకుంది.
మిక్స్డ్ డబుల్స్‌లో
ఇదే టోర్నీ మిక్స్డ్ డబుల్స్ టైటిల్‌ను ఇషాన్- తనీషా జోడీ విజయం గెలుచుకుంది. మిక్స్డ్ డబుల్స్ ఫైనల్లో ఇషాన్- తనీషా జోడీ నాగేంద్ర, శ్రీవేద్య జోడీపై విజయం సాధించింది. 21-16, 21-12 తేడాతో టైటిల్‌ను కైవసం చేసుకుంది.
Also read: ICC Awards: 'టీ20 ప్లేయర్ ఆఫ్ ది ఇయర్'గా పాక్ క్రికెటర్.. ట్యామీ బ్యూమోంట్‌కు ఐసీసీ అవార్డు!!
Also read: IND vs PAK: వారిద్దరూ రాణించకపోతే.. టీమిండియాపై ఒత్తిడి తప్పదు: హఫీజ్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook