Sara Tendulkar Crying: టిమ్ డేవిడ్ రనౌట్.. స్టేడియంలో ఏడ్చేసిన సచిన్ కుమార్తె!

Sara Tendulkar Crying: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL)లో బుధవారం జరిగిన ఉత్కంఠకరమైన మ్యాచ్ లో ముంబయి ఇండియన్స్ టీమ్ పై సన్ రైజర్స్ హైదరాబాద్ విజయం సాధించింది. ఈ మ్యాచ్ లో గెలుపు అంచులకు వచ్చిన ముంబయి టీమ్.. త్రుటిలో విజయాన్ని చేజార్చుకుంది. అయితే ఈ ఓటమికి టిమ్ డేవిడ్ రనౌట్ అవ్వడమే ప్రధాన కారణంగా తెలుస్తోంది. టిమ్ డేవిడ్ రనౌట్ అయిన క్రమంలో సచిన్ కుమార్తె కంటతడి పెట్టుకుంది.   

Written by - ZH Telugu Desk | Last Updated : May 18, 2022, 10:42 AM IST
Sara Tendulkar Crying: టిమ్ డేవిడ్ రనౌట్.. స్టేడియంలో ఏడ్చేసిన సచిన్ కుమార్తె!

Sara Tendulkar Crying: ముంబయిలోని వాంఖడే వేదికగా జరిగిన మ్యాచ్ లో బుధవారం సన్ రైజర్స్ హైదరాబాద్ టీమ్ తో ముంబయి ఇండియన్స్ తలపడింది. ఈ మ్యాచ్ లో భాగంగా తొలుత బ్యాటింగ్ చేసిన సన్ రైజర్స్ హైదరాబాద్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 193 పరుగులు చేసింది. ఆ తర్వాత 194 రన్స్ లక్ష్యంతో బరిలో దిగిన ముంబయి ఇండియన్స్ టీమ్ ఓపెనర్లు శుభారంభాన్ని ఇచ్చారు. 

ముంబయి కెప్టెన్ రోహిత్ శర్మ (48), ఇషాన్ కిషన్ (43) ఫర్వాలేదనిపించారు. ఆ తర్వాత బ్యాటింగ్ కు వచ్చిన టిమ్ డేవిడ్ కేవలం 18 బంతుల్లో 46 పరుగులు చేశాడు. అందులో 3 ఫోర్లు, 4 సిక్సర్లు ఉన్నాయి. అయినా చివరిలో టిమ్ డేవిడ్ చేసిన పోరాటం వృథా అయ్యింది. టిమ్ డేవిడ్ రనౌట్ అవ్వడం వల్ల గెలవాల్సిన ముంబయి జట్టు కేవలం 3 పరుగుల తేడాతో సన్ రైజర్స్ హైదరాబాద్ చేతిలో ఓటమి పాలైంది. 

అయితే గెలవాల్సిన మ్యాచ్ లో ఓటమి పాలవ్వడం పట్ల ముంబయి ఇండియన్స్ టీమ్ ఫ్యాన్స్ నిరాశకు గురయ్యారు. మరీ ముఖ్యంగా మెరుపు ఇన్నింగ్స్ తో గెలుపు అంచుల వరకు జట్టును తీసుకొచ్చిన టిమ్ డేవిడ్ రనౌట్ ప్రతీ ముంబయి ఇండియన్స్ అభిమానిని భావోద్వేగానికి గురిచేసింది. ఈ క్రమంలో స్టాండ్స్ లో సచిన్ కుమార్తె సారా తెందూల్కర్ కూడా భావోద్వేగానికి లోనయ్యి.. ఏడ్చేసింది. అందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. 

Also Read: Shikhar Dhawan: వెండి తెరపైకి మరో స్టార్ క్రికెటర్‌ రాబోతున్నాడా..? నిజమెంత..?

Also Read: IPL 2022 Playoffs Scenario: ముంబైపై ఢిల్లీ గెలిస్తే.. ఆ నాలుగు జట్లు ఔట్! రసవత్తరంగా ఐపీఎల్ 2022 ప్లే ఆఫ్స్‌

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News