Shubman Gill Century: విరాట్ కోహ్లీ, శిఖర్ ధావన్ రికార్డు బద్దలు కొట్టిన శుభ్‌మన్‌ గిల్‌.. అంతర్జాతీయ క్రికెట్‌లో రెండో బ్యాటర్!

IND vs NZ 1st ODI, Shubman Gill hits 1000 Runs in 19 Innings Only. భారత్ తరఫున వన్డేల్లో అత్యంత వేగంగా 1000 పరుగులు పూర్తి చేసిన బ్యాటర్‌గా శుభ్‌మన్‌ గిల్ రికార్డుల్లో నిలిచాడు.   

Written by - P Sampath Kumar | Last Updated : Jan 18, 2023, 05:01 PM IST
  • 87 బంతుల్లోనే గిల్ శతకం
  • కోహ్లీ, ధావన్ రికార్డు బద్దలు కొట్టిన గిల్‌
  • అంతర్జాతీయ క్రికెట్‌లో రెండో బ్యాటర్ గిల్‌
Shubman Gill Century: విరాట్ కోహ్లీ, శిఖర్ ధావన్ రికార్డు బద్దలు కొట్టిన శుభ్‌మన్‌ గిల్‌.. అంతర్జాతీయ క్రికెట్‌లో రెండో బ్యాటర్!

Shubman Gill Breaks Shikhar Dhawan and Virat Kohli spectacular ODI Record: టీమిండియా యువ ఓపెనర్ శుభ్‌మన్ గిల్ అరుదైన రికార్డు నెలకొల్పాడు. భారత్ తరఫున వన్డేల్లో అత్యంత వేగంగా 1000 పరుగులు పూర్తి చేసిన బ్యాటర్‌గా గిల్ రికార్డుల్లో నిలిచాడు. హైదరాబాద్ ఉప్పల్ స్టేడియంలో న్యూజిలాండ్‌తో జరుగుతన్న మొదటి వన్డేలో సెంచరీ చేయడంతో ఈ రికార్డు నమోదు చేశాడు. ఇక అంతర్జాతీయ క్రికెట్‌లో అత్యంత వేగంగా వెయ్యి పరుగులు పూర్తి చేసిన రెండో బ్యాటర్‌గా రికార్డు నెలకొల్పాడు. పాకిస్థాన్ బ్యాటర్ ఫకార్ జమాన్ 18 ఇన్నింగ్స్‌లలో 1000 పరుగులు పూర్తి చేసి అందరికంటే ముందున్నాడు.

టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ వన్డేల్లో 1000 పరుగులు పూర్తి చేయడానికి 24 ఇన్నింగ్స్‌లు తీసుకున్నాడు. అలానే సీనియర్ ఓపెనర్ శిఖర్ ధావన్ కూడా 24 ఇన్నింగ్స్‌లలో వెయ్యి పరుగులు పూర్తి చేశాడు. శుభ్‌మన్ గిల్ మాత్రం 19 ఇన్నింగ్స్‌ల్లోనే ఈ మైలురాయిని అందుకుని ఆ ఇద్దరిని అధిగమించాడు. ఇమామ్‌ ఉల్ హక్‌తో కలిసి గిల్‌ రెండో స్థానంలో ఉన్నాడు. న్యూజిలాండ్‌తో జరుగుతన్న మొదటి వన్డేలో 87 బంతుల్లోనే గిల్ శతకం నమోదు చేశాడు. 

శుభ్‌మన్‌ గిల్‌ వరుస సెంచరీలతో దూసుకుపోతున్నాడు. జనవరి 15న శ్రీలం‍కతో జరిగిన మూడో వన్డేలో 97 బంతుల్లో 116 రన్స్ బాదాడు. గిల్ ఇన్నింగ్స్‌లో 14 ఫోర్లు, 2 సిక్సర్లు ఉన్నాయి. నేడు (జనవరి 18) న్యూజిలాండ్‌తో జరుగుతున్న తొలి వన్డేలోనూ సెంటిరీ బాదాడు. సహచర ప్లేయర్స్ పెవిలియన్ బాట పడుతున్నా.. క్రీజులో నిలబడి శతకం బాదాడు. ఇప్పటికే 128 బంతుల్లో 158 రన్స్ చేశాడు. గిల్ ఇప్పటికే 19 ఫోర్లు, 3 సిక్సర్లు కొట్టాడు. ఇంకా ఆరు ఓవర్లు ఉన్న నేపథ్యంలో డబుల్ సెంచరీ చేసే అవకాశం కూడా ఉంది. 

Also Read: Rohit Sharma Record: ఎంఎస్ ధోనీ అరుదైన రికార్డు బద్దలు కొట్టిన రోహిత్‌ శర్మ!

Also Read: Bhadra Rajyog 2023: అరుదైన భద్ర రాజయోగం.. ఈ రాశుల వారు ప్రతి పనిలో విజయం సాధిస్తారు! వివాహం జరిగే అవకాశం  

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

TwitterFacebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News