Sourav Ganguly to join Delhi Capitals as Director of Cricket for IPL 2023: భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) మాజీ ప్రెసిడెంట్, భారత మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ మరోసారి కీలక బాధ్యతలు చేపట్టనున్నారు. ఏప్రిల్‌లో ప్రారంభమయ్యే ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2023లో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టుకు 'డైరెక్టర్ ఆఫ్ క్రికెట్'గా తిరిగి బాధ్యతలు చేపట్టనున్నారని సమాచారం తెలుస్తోంది. బీసీసీఐ పదవి నుంచి వైదొలగిన అనంతరం యూఏఈ టీ20 లీగ్‌లో దుబాయ్ క్యాపిటల్స్, దక్షిణాఫ్రికా టీ20 లీగ్‌లో ప్రిటోరియా క్యాపిటల్స్ జట్టు క్రికెట్ డైరెక్టర్‌గా దాదా ఇప్పటికే బాధ్యతలు చేపట్టారు.
సౌరవ్ గంగూలీ విషయంపై ఢిల్లీ క్యాపిటల్స్ ప్రాంచైజీ అధికారిక ప్రకటన చేయకపోయినా.. ఆ జట్టు వర్గాలు పేర్కొన్నాయని జాతీయ వార్త సంస్థ పీటీఐ ఓ ప్రకటనలో తెలిపింది. 'సౌరవ్ గంగూలీ తిరిగి ఢిల్లీ క్యాపిటల్స్ జట్టులోకి రాబోతున్నారు. దాదాతో జరుపుతున్న చర్చలు తుది దశకు చేరుకున్నాయి. త్వరలోనే అధికారిక ప్రకటన వస్తుంది. ఢిల్లీ క్యాపిటల్స్ జట్టుతో గంగూలీ ఇదివరకే పనిచేశారు. ఢిల్లీ ఫ్రాంఛైజీతో దాదాకు ప్రత్యేక అనుబంధం ఉంది. అందుకే అతడిని ఒప్పించాం' అని ఓ అధికారి చెప్పినట్టు పేర్కొంది.
2022 ఆక్టోబర్‌లో బీసీసీఐ అధ్యక్ష పదవి నుంచి భారత మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ వైదొలిగిన విషయం తెలిసిందే. దుబాయ్ క్యాపిటల్స్, ప్రిటోరియా క్యాపిటల్స్ ఫ్రాంచైజీలను ఐపీఎల్ జట్టు అయినా ఢిల్లీ క్యాపిటల్స్ యాజమాన్యం కొనుగోలు చేసిన విషయం తెలిసిందే. ఇక ఐపీఎల్ 2023 నుంచి ఢిల్లీ క్యాపిటల్స్ క్రికెట్ డైరెక్టర్‌గా దాదా తిరిగి బాధ్యతలు చేపట్టనున్నారు. బీసీసీఐ పదవికి ముందు ఢిల్లీ క్యాపిటల్స్ టీమ్‌కు హెడ్ కోచ్‌గా, మెంటర్‌గా దాదా బాధ్యతలు నిర్వర్తించారు.
— Sourav Ganguly (@SGanguly99) January 1, 2023
ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ రిషబ్ పంత్ తాజాగా కారు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన సంగతి తెలిసిందే. నూతన సంవత్సర వేడుకల కోసం ఢిల్లీ నుంచి ఇంటికి వెళుతుండగా కారు అదుపుతప్పి డివైడర్‌ను ఢీ కొట్టింది. పంత్ పూర్తిగా కోలుకోవడానికి దాదాపు ఆరు నెలల సమయం పట్టనుంది. ఈ నేపథ్యంలో ఢిల్లీ కెప్టెన్ ఐపీఎల్ 2023కి దూరం కానున్నాడు. ఒకవేళ పంత్ ఐపీఎల్ 2023కి దూరమైతే.. ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్‌గా ఆస్ట్రేలియా ప్లేయర్ డేవిడ్ వార్నర్ బాధ్యతలు చేపట్టే అవకాశం ఉంది.
Also Read: VVS Laxman India Coach: రాహుల్ ద్రవిడ్‌కు గుడ్‌బై.. టీమిండియా హెడ్ కోచ్‌గా హైదరాబాద్ ప్లేయర్!
Also Read: IND vs SL 2023: శ్రీలంకతో టీ20 సిరీస్.. భువనేశ్వర్ అరుదైన రికార్డుకు ఎసరు పెట్టిన చహల్!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook.