హైదరాబాద్ ఉప్పల్ స్డేడియం వేదికగా జరిగిన ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ తొలి వన్డే మ్యాచ్‌లో ఇండియా..కివీస్ జట్టును 12 పరుగుల తేడాతో ఓడించింది. ఈ మ్యాచ్‌లో రోహిత్ శర్మ సరికొత్త రికార్డు సాధించాడు. ఆ వివరాలు మీ కోసం..
ఈ మ్యాచ్‌లో టీమ్ ఇండియా బ్యాటర్ శుభమన్ గిల్ డబుల్ సెంచరీతో అద్భుత ప్రదర్శన కనబరిచాడు. 208 పరుగులు చేయడం ద్వారా టీమ్ ఇండియా భారీ స్కోర్‌కు కారణమయ్యాడు. అటు హైదరాబాదీ పేసర్ మొహమ్మద్ సిరాజ్ మరోసారి సూపర్ స్పెల్ వేసి 4 వికెట్లు పడగొట్టాడు. ఇదే మ్యాచ్‌లో కెప్టెన్ రోహిత్ శర్మ సైతం అరుదైన రికార్డు తన సొంతం చేసుకున్నాడు. కేవలం రెండు సిక్సర్లు కొడుతూనే మహేంద్ర సింగ్ ధోనీ పేరిట ఉన్న రికార్డును తన పేరిట మార్చుకున్నాడు.
సిక్సర్ కింగ్‌గా రోహిత్ శర్మ
న్యూజిలాండ్‌తో జరిగి వన్డే మ్యాచ్‌లో రోహిత్ శర్మ 24 బంతుల్లో 34 పరుగుల చేయగా అందులో ఏకంగా 4 ఫోర్లు, 2 సిక్సర్లు ఉన్నాయి. ఈ రెండు సిక్సర్లతో వన్డే క్రికెట్‌లో భారతీయ గడ్డపై అత్యధిక సిక్సర్లు సాధించిన క్రికెట్ అయ్యాడు. ఈ రెండు సిక్సర్లు కొట్టడంతో అప్పటి వరకూ మహేంద్ర సింగ్ ధోని పేరిట ఉన్న రికార్డును చెరిపేసి తన పేరిట రాసుకున్నాడు. భారత గడ్డపై వన్డే క్రికెట్‌లో రోహిత్ శర్మ 125 సిక్సర్లు కొట్టగా, మహేంద్ర సింగ్ ధోని 123 సిక్సర్లు సాధించాడు.
భారత గడ్డపై వన్డేలో అత్యధిక సిక్సర్ల రికార్డు
రోహిత్ శర్మ 125 సిక్సర్లు
ఎంఎంస్ ధోని 123 సిక్సర్లు
సచిన్ టెండూల్కర్ 71 సిక్సర్లు
విరాట్ కోహ్లి 66 సిక్సర్లు
యువరాజ్ సింహ్ 65 సిక్సర్లు
పాకిస్తానీ బ్యాటర్ అఫ్రిది పేరిట రికార్డు
ఇక ప్రపంచ వన్డే చరిత్రలో అత్యధిక సిక్సర్లు కొట్టింది పాకిస్తాన్ క్రికెటర్ షాహిద్ ఆఫ్రిది. 398 వన్డేల్లో 351 సిక్సర్లు సాదించాడు. అటు రోహిత్ శర్మ 239 వన్డేల్లో 265 సిక్సర్లు కొట్టాడు. రోహిత్ శర్మ నాలుగవ స్థానంలో ఉన్నాడు.
వన్డే క్రికెట్‌లో అత్యధిక సిక్సర్లు సాధించిన బ్యాటర్లు
షాహిద్ ఆఫ్రిది 351 సిక్సర్లు
క్రిస్ గేల్ 331 సిక్సర్లు
సనత్ జయసూర్య 270 సిక్సర్లు
రోహిత్ శర్మ 265 సిక్సర్లు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook