Asia Cup 2022: ఆసియా కప్‌లో సూపర్-4 ఆసక్తికరంగా సాగుతోంది. తొలి మ్యాచ్‌లో పాక్ చేతిలో భారత ఓటమి పాలైంది. దీంతో మిగిలిన రెండు మ్యాచ్‌ల్లో తప్పక గెలవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇందులో ఏ ఒక్కటి ఓడిపోయినా..ఇంటి బాట పట్టాల్సి ఉంటుంది. ఈనేపథ్యంలో భారత్‌కు చావోరేవో కానుంది. సూపర్-4లో నిన్న భారత్, పాకిస్థాన్ జట్లు తలపడ్డాయి. చివరి ఓవర్ వరకు ఉత్కంఠగా మ్యాచ్ సాగింది. చివరకు పాక్ విజయం సాధించింది. దీంతో టీమిండియాకు దిమ్మదిరిగే షాక్ తగిలింది.
ఈమ్యాచ్‌లో సీనియర్ ప్లేయర్ దినేష్ కార్తీక్‌ను కాకుండా రిషబ్ పంత్‌ను ఆడించడంపై సీనియర్ ప్లేయర్లు పెదవి విరుస్తున్నారు. ఈమ్యాచ్‌లో పంత్ కేవలం 14 పరుగులు చేసి ఔట్ అయ్యాడు. దీంతో ఎన్నో ఆశలు పెట్టుకున్న టీమ్‌కు నిరాశ తప్పలేదు. ఈనేపథ్యంలో దినేష్ కార్తీక్ తీసుకోకపోవడంపై టీమిండియా మాజీ దిగ్గజం సునీల్ గావస్కర్ కీలక వ్యాఖ్యలు చేశాడు. మంచి ఫినిషర్ అయిన అతడిని తీసుకోకపోవడం తీవ్ర లోటు అని చెప్పాడు.
దినేష్ కార్తీక్‌ను ఎందుకు పక్కన పెట్టారో అర్థం కావడం లేదన్నాడు సునీల్ గావస్కర్. ఇప్పటికే అతనొక గొప్ప క్రికెటర్ అని అభివర్ణించాడు. ఇలాంటి పెద్ద మ్యాచ్‌లో చోటు ఇవ్వకపోవడం తనను ఆశ్చర్య పర్చిందన్నాడు. మరోవైపు మాజీ సారధి విరాట్ కోహ్లీ ఆటపై సైతం స్పందించాడు. అతడు తొలి బంతి నుంచే ఆత్మ విశ్వాసంతో ఆడాడని తెలిపాడు. కోహ్లీ ఇన్నింగ్స్‌లో అద్భుతమైన షాట్లు ఉన్నాయని గుర్తు చేశారు.
సిక్సర్‌తో హాఫ్ సెంచరీ చేయడం సూపర్‌గా ఉందని పేర్కొన్నాడు. స్పిన్‌లోనూ ధాటిగా ఆడాడని..ఇలా ఆడితే ఎలాంటి ప్లేయర్‌కైనా కాన్ఫిడెన్స్ వస్తుందని స్పష్టం చేశారు. ఇదే విషయం పాక్ మ్యాచ్‌లో కనిపించిందన్నాడు. ఈమ్యాచ్‌లో కోహ్లీ 60 పరుగులతో రాణించాడు. రేపు(మంగళవారం) భారత్, శ్రీలంక మధ్య కీలక మ్యాచ్ జరగనుంది. గెలిచిన జట్లు ఫైనల్‌కు దగ్గరవుతాయి. దీంతో ఈమ్యాచ్ హోరాహోరీగా సాగే అవకాశం ఉంది. ఇప్పటికే అఫ్ఘనిస్థాన్‌పై విజయంతో లంక మంచి జోష్ మీద ఉంది.
Also read:Birds Nest in House: ఇంట్లో పక్షుల గూళ్లు ఉంటే అరిష్టమా? మంచిదా? వాస్తు నిపుణుల సలహా..!
Also read:TTD: తిరుమలలో నటి అర్చనా గౌతమ్ వీరంగం..క్లారిటీ ఇచ్చిన టీటీడీ..!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3P3R74U
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి