అశ్విన్ చేసింది కరెక్టేనా... మన్కడింగ్‌ గురించి క్రికెట్ చట్టంలో ఏముంది ?

ఐపీఎల్ మ్యాచ్ లో  రవిచంద్రన్ అశ్విన్ వ్వవహారం తర్వాత క్రికెట్ లో మన్కడింగ్‌ అంశం చర్చకు దారి తీస్తోంది.

Last Updated : Mar 27, 2019, 01:35 PM IST
అశ్విన్ చేసింది కరెక్టేనా... మన్కడింగ్‌ గురించి క్రికెట్ చట్టంలో ఏముంది ?

రవిచంద్రన్ అశ్విన్ వ్యవహరం తర్వాత క్రికెట్ లో మన్కడింగ్‌ అంశం చర్చకు దారి తీస్తోంది. ఐపీఎల్ మ్యాచ్ లో భాగంగా రాజస్థాన్‌ బ్యాట్స్‌మన్‌ బట్లర్‌ను పంజాబ్‌ తరఫున ఆడుతున్న అశ్విన్‌ మన్కడింగ్‌ ద్వారా ఔట్‌ చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో అశ్విన్ తెలివిగా వ్యవహరించాడని కొందరు అతన్ని మద్దతిస్తుండగా ...మరికొందరు ఇది క్రీడా స్పూర్తికి వ్యతిరేకమని క్రికెట్ చట్టాలను ఉల్లంఘన చేశాడని అశ్విన్ తీరును తప్పుబడుతున్నారు. ఇలా మన్కడింగ్‌ అంశంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమౌతున్న నేపథ్యంలో ఎంసీసీ అధికారులు మన్కడింగ్‌ నిబంధనపై వివరణ ఇచ్చారు.

ఇది నిబంధనలకు విరుద్ధం కాదు ..కానీ

క్రికెట్‌ నిబంధనల చట్టాన్ని వివరిస్తూ ఎంసీసీ ఈ అంశంపై స్పష్టతనిచ్చింది.. నాన్‌స్ట్రైకర్‌ ఎండ్‌లో ఉన్న ఆటగాడు ఎప్పుడు క్రీజు వదిలి వెళ్లాలో..అలా వెళ్లిన వారిని వివాదం లేకుండా బౌలర్‌ ఎలా ఔట్‌ చెయ్యాలో ఇందులో వివరించారు. క్రీజులో లేని నాన్‌స్ట్రైకర్‌ను ముందే హెచ్చరించాలని గానీ ... ఇలా చేస్తే క్రీడాస్ఫూర్తికి విరుద్ధమనిగానీ ఎక్కడా క్రికెట్‌ చట్టంలో లేదని చెప్పారు. అయితే బట్లర్‌ విషయంలో అశ్విన్‌ బంతిని ఎప్పుడు వదిలాడో పరిగణించాల్సిన అవసరముందన్నారు. అశ్విన్‌ కావాలనే బౌలింగ్‌ చేస్తున్నట్టు నటించి బట్లర్‌ క్రీజు వదిలేలా చేశాడని.. ఒకవేళ నిజంగా అలా చేస్తే క్రీడాస్ఫూర్తికి విరుద్ధమని పలువురు పేర్కొంటున్నారు.
 

బ్యాట్స్ మెన్లకు అప్రమత్తంగా ఉండాలని సూచన..

కాగా నాన్‌స్ట్రైకర్‌గా ఉన్నవాళ్లు జాగ్రత్తగా ఉండాలని అనవసరంగా క్రీజు వదిలి ముందుకు వెళ్లకూడదని.. అలాగే బౌలర్లు నిర్దిష్ట సమయంలో బంతులు విసరాలని క్రికెట్ చట్టాలు చెబుతున్నాయని ఎంసీసీ వివరణ ఇచ్చింది. ఇదే సందర్భంలో మన్కడింగ్‌  జరిగిన సందర్భంలో చట్టబద్ధంగా స్పష్టతనిచ్చి టీవీ అంపైర్‌ బట్లర్‌ ఔట్‌ను ప్రకటించి ఉంటే బాగుండేదని ఎంసీసీ అభిప్రాయపడింది.

Trending News