డేరా సచ్ఛా సౌధ అధిపతి గుర్మీత్ రామ్ రహీం సింగ్ చేసిన పాపాల చిట్టా రోజు రోజుకూ పెరుగుతోంది. డేరాలో ఈ దొంగ బాబా సాగించిన అక్రమాలు రోజుకొకటి బయటపడడంతో ఆశ్చర్యపోవడం పోలీసుల వంతు అవుతోంది. ఇప్పటికే ఇద్దరు సాధ్వీలపై అత్యాచారం చేసిన కేసులో గుర్మీత్ బాబాకు కోర్టు ఇరవై సంవత్సరాల జైలుశిక్ష విధించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో బాధితులు అనేకమంది తమకు జరిగిన అన్యాయాలను బహిర్గతం చేసేందుకు ముందుకు వస్తున్నారు.
అత్యాచారం కేసులో శిక్షపడ్డ గుర్మీత్ బాబా పాపాల చిట్టా తవ్వే కొద్ది బయటపడుతూనే ఉంది. తనకు ఎదురు తిరిగిన వారిని హత్య చేసి ఇక్కడే పూడ్చి పెట్టిన ఘటనలు ఎన్నో ఉన్నాయని గుర్మీత్ పై పలు ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో దీనిపై విచారణ జరిపేందుకు ప్రభుత్వం సిట్ ఏర్పాటు చేసింది. విచారణ ముందుకెళ్తున్న కొద్ది డేరా బాబా అరాచకాలు వెలుగులోకి వస్తున్నాయి. గుర్మిత్ బాబా ఆశ్రమ పరిసరాల్లో ఇప్పటి వరకు 600 అస్థి పంజరాలు వెలికితీసినట్లు విచారణ జరుపుతున్న ఓ అధికారి వెల్లడించారు. కాగా డేరాకు వచ్చే గుర్మీత్ భక్తులు తాము మరణిస్తే.. మోక్షం కోసం ఈ ప్రాంతంలోనే ఖననం చేయాలని కోరుతుంటారని..
రోహ్ తక్ జైలులో డేరా బాబా దుర్భర దారిద్ర్యాన్ని అనుభవిస్తున్నాడు. గుర్మీత్ జైలు జీవితంపై జైళ్ల శాఖ డీజీపీ కేపీ సింగ్ వివరించారు. ఆయన రోజూ 8 గంటల శ్రమకు కూలి 20 రూపాయలు ఇస్తున్నారట. గుర్మీత్ జైలులో సాధారణ ఖైదీగానే ఉన్నారని తెలిపారు. ఆయన సెల్ లో మరో ముగ్గురు ఖైదీలు కూడా ఉన్నారని వెల్లడించారు. ఆయన దగ్గర రెండు పుస్తకాలు, రెండు జతల చెప్పులు, దుస్తులు మాత్రమే ఉన్నాయని ఆయన చెప్పారు. ఆయన దగ్గర రెండు పుస్తకాలు, రెండు జతల చెప్పులు, దుస్తులు మాత్రమే ఉన్నాయని ఆయన చెప్పారు. ఆయనకు కనీసం టీవీ, పత్రికలు కూడా అందుబాటులో లేవని, ఫోన్ సౌకర్యం కూడా కల్పించలేదని ఆయన చెప్పారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.