Amaravati Farmers Gandhigiri At YS Jagan Residence: అధికారంలో ఉన్నప్పుడు రాజధాని అమరావతి ప్రాంతాన్ని నిర్వీర్యం చేసిన అపద్ధర్మ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి అమరావతి రైతులు పంచ్ ఇచ్చారు. తమకు చేసిన అన్యాయాన్ని గాంధీగిరి ద్వారా నిరసన తెలిపారు.
సుప్రీం కోర్టులో అమరావతిలో పేదలకు ఇళ్ల స్థలాల కేసులో రైతులకు ఎదురుదెబ్బ తగిలింది. ఆర్-5 జోన్లో పేదలకు ఇళ్ల స్థలాలను ఇవ్వడాన్ని సమర్ధించిన ఏపీ హైకోర్టు ఉత్తర్వులపై స్టే ఇచ్చేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. రాజధాని కేసు విచారణ చేస్తున్న బెంచ్‌కు ఈ కేసును బదిలీ చేయాలని జస్టిస్ అభయ్ ఓకా ధర్మాసనం పేర్కొంది.
Amaravati Farmers Protest: Amaravati Farmers Maha Padayatra 2 to begin from today. అమరావతి నుంచి శ్రీకాకుళం జిల్లా అరసవిల్లి వరకూ మహా పాదయాత్ర 2 చేపట్టేందుకు అమరావతి రైతులు సిద్దమయ్యారు
Perni Nani fire on tdp: అమరావతి రైతుల పేరుతో రియల్ ఎస్టేల్ వ్యాపారులు.. చంద్రబాబు ఏజెంట్లు, బినామీలు పాదయాత్ర చేస్తున్నారని ఘాటు వ్యాఖ్యలు చేశారు పేర్ని నాని. ఇక ఈ యాత్రకు నిర్మాత, దర్శకుడు, స్క్రీన్‌ప్లే చంద్రబాబేనంటూ విమర్శించారు. టీడీపీ నేతలు చేపట్టిన ఈ యాత్రకు చందాల పేరుతో చంద్రబాబు అండ్ కో నల్లధనాన్ని (Black money) తెల్లధనంగా మార్చుకుంటున్నారని ఆరోపించారు.
అమరావతి రైతులకు ( Amaravati farmers ) అందాల్సినవన్నీ అందేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. ఒప్పందం ప్రకారం ఆ రైతులకు ఇవ్వాల్సిన వార్షిక కౌలు, పెన్షన్ ను ఏపీ ప్రభుత్వం విడుదల చేసింది. ప్రభుత్వానికి వ్యతిరేకంగా కోర్టును ఆశ్రయించినా..రైతుల ప్రయోజనాలు ఆగకపోవడం విశేషం.
ఆంధ్రప్రదేశ్ కు మూడు రాజధానులు ఉంటాయంటూ అసెంబ్లీ వేదికగా ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి చేసిన ప్రకటన అగ్గి రాజేస్తోంది. రాజధాని అమరావతి కోసం భూములను త్యాగం చేసిన అన్నదాతలు ఆగ్రహోదగ్రులవుతున్నారు. దాదాపు 20 రోజుల కిందట మొదలు పెట్టిన అమరావతి ఉద్యమం క్రమక్రమంగా బలపడుతోంది.
ఆంధ్రప్రదేశ్ లో ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి చేసిన 3 రాజధానుల ప్రకటన ప్రకంపనలు సృష్టిస్తోంది. అమరావతి రైతులు 19 రోజులుగా ఆందోళన కొనసాగిస్తున్నారు. ఉద్యమాన్ని ఉద్ధృతం చేస్తున్నా .. ప్రభుత్వం పట్టించుకోకపోవడం.. పైగా రాజధానుల ఏర్పాటుపై కమిటీలపై కమిటీలు వేస్తుండడంపై అన్నదాతలు ఆగ్రహంగా ఉన్నారు.
ఏపీకి మూడు రాజధానుల ఏర్పాటు ప్రతిపాదన ప్రకటన అనంతరం రైతుల ఆందోళనలకు వేదికగా మారిన అమరావతిపై త్వరలోనే ఏపీ సర్కార్ నుంచి మరో ప్రకటన వెలువడనుందనే వార్తలు వెలువడుతున్నాయి. అమరావతి ప్రాంత రైతులకు మేలు చేకూర్చేలా ఆ ప్రాంతాన్ని వాణిజ్య పరంగా అత్యంత విలువైన పంటలకు హబ్‌గా తీర్చిదిద్దేలా అక్కడ ప్రత్యేక అగ్రికల్చర్ జోన్‌గా ప్రకటించే అంశాన్ని ప్రభుత్వం పరిశీలిస్తోందని తెలుస్తోంది.
ఆంధ్రప్రదేశ్‌కు మూడు రాజధానుల ప్రకటన తర్వాత తొలిసారిగా విశాఖలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొనేందుకు వెళ్లిన ఏపీ సీఎం వైయస్ జగన్ మోహన్ రెడ్డికి అక్కడ ఘన స్వాగతం లభించింది. అమరావతి నుంచి రాజధానిని తరలించడాన్ని నిరసిస్తూ అమరావతిలో రైతులు, ప్రజా సంఘాలు తీవ్ర నిరసన వ్యక్తంచేస్తుండగా... విశాఖలో మాత్రం అందుకు భిన్నమైన సీన్ కనిపించింది.
ఏపీకి మూడు రాజధానులు అంటూ రాష్ట్రాన్ని అల్లకల్లోలం చేస్తున్నారని టీడీపి నాయకురాలు, మాజీ మంత్రి అఖిలప్రియ మండిపడ్డారు. మూడు రాజధానుల ఏర్పాటుపై జిఎన్ రావ్ నివేదిక ఇవ్వకముందే ఆ విషయాన్ని అసెంబ్లీలో ప్రకటించారంటే.. ఆ రిపోర్టును ఎవరు తయారు చేశారో స్పష్టంగా అర్థం అవుతోంది.
దేశంలో అలజడి సృష్టించిన పౌరసత్వ సవరణ చట్టం నుంచి, ఏపీలోనూ చర్చనియాంశమైన మూడు రాజధానుల ప్రతిపాదన వరకు ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలపై బీజేపి వైఖరి ఏంటనే విషయాన్ని స్పష్టంచేస్తూ ఏపీ బీజేపి చీఫ్ కన్నా లక్ష్మీనారాయణ పలు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు.
ఆంధ్రప్రదేశ్ రాజధాని ప్రాంతమైన అమరావతి కోసం తమ భూములను ధారాదత్తం చేసిన రైతులకు ప్రభుత్వం సువర్ణావకాశం కల్పిస్తోంది. వారిని త్వరలో సింగపూర్ ట్రిప్‌కు ప్రభుత్వం తీసుకెళ్ళనుందని మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ తెలియజేశారు. దాదాపు 100 పైగా రైతులను లాటరీ ద్వారా ఎంపిక చేసి, వారికి ఈ అవకాశాన్ని కల్పిస్తున్నట్లు ఆయన చెప్పారు. సీఆర్డీఏ కార్యాలయంలో ఆదివారం మధ్యాహ్నం జరిగిన లాటరీ కార్యక్రమంలో కమీషనర్‌తో పాటు మంత్రి కూడా పాల్గొ్న్నారు. సింగపూర్ నగరం ఎలా అత్యద్భుత స్థితికి చేరుకుందో ఈ పర్యటన ద్వారా రైతులకు కూడా వివరిస్తామని..
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.