Loksabha polls 2024: భారత ప్రజాస్వామ్య వ్యవస్థలో ఐదేళ్లకు ఒక సారి జరిగే ప్రజస్వామ్య వేడుకలో ప్రతి ఒక్కరు పాల్గొనాలని ఏపీ సీఈవో ముఖేష్ కుమార్ మీనా అన్నారు. ఓటింగ్ అనేది మనకు రాజ్యాంగం ప్రసాదించిన హక్కని ఆయన అన్నారు. ప్రజలంతా స్వేచ్ఛగా, నిర్భయంగా తమ ఓటు హక్కును ఉపయోగించుకోవాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా పిలుపునిచ్చారు.
4th Phase Lok Sabha Polls 2024: సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా నాల్గో విడత భాగంగా తెలంగాణలోని 17, ఏపీలో 25 సహా దేశ వ్యాప్తంగా 96 లోక్ సభ నియోజకవర్గాలుకు పోలింగ్ ప్రారంభమైంది.
YS Vijayamma: ఎన్నికల వేళ జగన్ కు ఆయన తల్లి విజయమ్మ బిగ్ షాక్ ఇచ్చారు. వైఎస్ రాజశేఖర్ ను అభిమానించే ప్రతి ఒక్కరికి తన నమస్కారాలు అంటూ పలకరించారు. కడపలో ఎంపీగా బరిలో నిలబడిన తన బిడ్డ వైఎస్ షర్మిలను భారీ మెజార్టీతో గెలిపించాలని అమెరికా నుంచి వీడియో రిలీజ్ చేశారు.
Traffic Jam: హైదరాబాద్ నుంచి ఏపీకీ భారీగా తమ వాహానాలలో వెళ్తున్నారు. దీంతో హైదరాబాద్ విజయవాడ హైవేల మీద వాహనాలు రద్దీ నెలకొంది. కిలో మీటర్ల మేర ట్రాఫిక్ జామ్ అయ్యింది.
Ap assembly Elections 2024: స్ట్రీట్ ఫుడ్ ఫెమ్ కుమారీ ఆంటీ ఒక్కసారిగా ఏపీ ఎన్నికల ప్రచారంలో పాల్గొని అందరిని షాకింగ్ కు గురిచేశారు. పదిహేనేళ్ల క్రితం గుడివాడ ఎలా ఉందో ఇప్పుడు కూడా అదేవిధంగా ఉందంటూ వ్యాఖ్యలు చేశారు. ఇక్కడ ఉద్యోగాలు, ఉపాధి దొరక్కపోవడం వల్లనే పక్కరాష్ట్రాలకు వెళ్తున్నామంటూ వ్యాఖ్యలు చేశారు.
AP Assembly Elections 2024: ఎన్నికలవేళ వైఎస్ షర్మిలకు ఊహించని పరిణామం ఎదురైంది. ఇటీవల కడప కోర్టు మాజీ మంత్రి వైఎస్ వివేక హత్యకు సంబంధించిన విషయాలపై ఎలాంటి వ్యాఖ్యలు చేయోద్దని ఏపీలోని రాజకీయనేతలకు సూచించింది. ఈ అంశాన్ని రాజకీయంగా వాడుకునేందుకు ప్రయత్నిన్నారంటూ కూడా కోర్టులో పిటిషన్ లు దాఖలయ్యాయి.
Land titling Act: ఆంధ్రప్రదేశ్లో లోక్సభ, అసెంబ్లీ ఎన్నికలకు మరికొన్ని రోజులు మాత్రమే మిగిలి ఉంది. ఈ నేపథ్యంలో ఏపీలో ల్యాండ్ టైటిల్ యాక్ట్ అనేది ప్రజల పాలిట యమపాశం అంటూ ప్రతిపక్షాలు ఏపీలోని వైసీపీ సర్కారుపై విరుచుకుపడుతున్నాయి. మరోవైపు ప్రభుత్వం మాత్రం ల్యాండ్ టైటిల్ యాక్ట్ ప్రజలకు మేలు చేసేదే అంటూ చెప్పుకొస్తుంది. ఈ నేపథ్యంలో ఈ ల్యాండ్ టైటిల్ యాక్ట్ అంటే ఏమిటి ? ఇది ప్రజలకు ప్రయోజనమా.. ? లేదా అనేది చూద్దాం..
AP DGP Rajendranath Reddy: ఎన్నికల సంఘం జగన్ సర్కారుకు ఊహించని ట్విస్ట్ ఇచ్చింది. వెంటనే ఏపీ డీజీపీని వెంటనే విధుల నుంచి రిలీవ్ చేయాలని సీఎస్ జవహర్ రెడ్డిని ఆదేశించింది.
YS Jagan Mohan reddy: ఏపీ సీఎం వైఎస్ జగన్ ఎమోషనల్ అయ్యారు. తన చెల్లెలు వైఎస్ షర్మిలను మిస్ అవుతున్నానంటూ ఎమోషనల్ అయ్యారు.ఈ ఘటన ఎన్నికల వేళ ఏపీలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
Former JD Lakshmi Narayana:జై భారత్ నేషనల్ పార్టీ ప్రెసిడెంట్ సీబీఐ మాజీ జాయింట్ డైరెక్టర్ జేడీ లక్ష్మీ నారాయణ సంచలన ఆరోపణలు చేశారు. తనను మర్డర్ చేయడానికి గాలి జనర్దన్ రెడ్డి బ్యాచ్ ప్లాన్ చేశారంటూ ఆయన ఎస్పీని కలిశారు.
Pawan kalyan:జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సజ్జల రామకృష్ణారెడ్డిపై మండి పడ్డారు. తన అన్న చిరంజీవి జోలికి వస్తే బాగుండదంటూ బహిరంగంగా హెచ్చరించారు. సామాజిక మాధ్యమాలలో రెచ్చిపోయి, పిచ్చి పిచ్చి వాగుడు వాగితే బాగుండదంటూ వార్నింగ్ ఇచ్చారు.
AP Nominations 2024: ఏపీలో సార్వత్రిక ఎన్నికల సందడి కొనసాగుతోంది. ఏపీ అసెంబ్లీ, లోక్సభ ఎన్నికలకు సంబంధించి నోటిఫికేషన్ వెలువడటంతో నామినేషన్ ప్రక్రియ ఆరంభమైంది. ఇక నేతలు నామినేషన్లు వేసేందుకు సిద్ధమౌతున్నారు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Andhra Pradesh: ఏపీ సీఎం వైఎస్ జగన్ పై దాడి ఘటన దేశ వ్యాప్తంగా తీవ్రదుమారంగా మారింది. దీనిపై ఎన్నికల కమిషన్ కూడా సీరియస్ గా స్పందించింది. దీనిపై తాజాగా విజయవాడ పోలీసులు కీలక ప్రకటన జారీచేశారు.
Pawan kalyan: జనసేన అధినేత పవన్ కళ్యాన్ పై ఒక ఆగంతకుడు రాళ్లతో దాడిచేయడానికి ప్రయత్నించాడు. అయితే ఆరాయి కాస్త ఆయనకు తగలకుండా కాస్త దూరంలో పడింది. వెంటనే సెక్యురిటీ సిబ్బంది అలర్ట్ అయ్యారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.