Covid19 Treatment: కోవిడ్ మహమ్మారి చికిత్సకు ఇప్పటికీ ప్రయోగాలు జరుగుతున్నాయి. వివిధ రకాల మందుల్ని ప్రయోగిస్తూ పరిశోధనలు చేస్తున్నారు. తాజా అధ్యయనంలో మరో మందు గురించి ఆసక్తికరమైన విషయాలు వెల్లడయ్యాయి.
కరోనావైరస్ను ( Coronavirus ) ఎదుర్కొనేందుకు వ్యాక్సిన్ తయారు చేస్తోన్న దేశాల్లో ఒకటైన చైనా.. ఆ వ్యాక్సిన్ ( COVID-19 vaccine ) ధరను 1000 యువాన్లుగా ( 144.27 డాలర్లు ) నిర్ణయించింది. చైనాకు చెందిన జాతీయ ఫార్మాసుటికల్ గ్రూప్ సినోఫార్మ్ ( Sinopharm's Vaccine ) తయారుచేస్తోన్న వ్యాక్సిన్కి సంబంధించి ప్రస్తుతం మూడో దశ క్లినికల్ ట్రయల్స్ ( Clinical trials ) నిర్వహిస్తున్నారు.
కోవిడ్ 19 వ్యాక్సిన్ ( Covid 19 Vaccine ) కు భారతదేశం పూర్తిగా ప్రయత్నిస్తోంది. దేశీయ కంపెనీతో కలిసి పూణేలోని నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ ( Pune- National institute of virology ) అభివృద్ధి చేసిన కో వ్యాక్జిన్ ( Covaxin ) క్లినికల్ ట్రయల్స్ ఇప్పటికే ప్రారంభమయ్యాయి. రెండు ఫేజ్ ల క్లినికల్ ట్రయల్స్ కోసం 1125 శాంపిల్స్ ఇప్పటికే సిద్ధంగా ఉన్నాయి.
ప్రపంచవ్యాప్తంగా మానవాళిని కుదిపేస్తోన్న కరోనా మహమ్మారికి వాక్సిన్ తయారీకి ప్రపంచ ప్రఖ్యాత పరిశోధన సంస్థలు తమ ప్రయత్నాలను ముమ్మరం చేస్తున్నాయి. ఇదే క్రమంలో ఆక్స్ఫర్డ్ విశ్వవిద్యాలయంలో
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.