Telangana Assembly Elections 2023: తెలంగాణ ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ ముఖ్యమంత్రి అభ్యర్థిపై ఆ పార్టీ సీనియర్ నాయకుడు షబ్బీర్ అలీ చేసిన కామెంట్స్ చర్చనీయాంశంగా మారింది. ఆయన ఎవరు పేరు ప్రకటించారంటే..?
Congress Vijayabheri Yatra in Kosgi: కొడంగల్ ప్రజలు ఆలోచించి ఓటు వేయాలని.. ఒక ఫుల్ బాటిల్‌కో.. ఐదు వేలకో ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టకండని కోరారు రేవంత్ రెడ్డి. కొడంగల్‌ను అభివృద్ధి చేసింది తాను అని.. మన బతుకులు మారాలంటే కాంగ్రెస్ అధికారంలోకి రావాలని అన్నారు.
Palvai Sravanthi Resigns Congress Party: మునుగోడు అసెంబ్లీ టికెట్ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి ఇవ్వడంతో పాల్వాయి స్రవంతి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. పార్టీని నమ్ముకుని ఉన్న తనకు టికెట్ ఇవ్వకపోవడంతో ఆవేదన వ్యక్తం చేస్తూ.. రాజీనామా చేశారు. ఈ సందర్భంగా కాంగ్రెస్‌పై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు.
Telangana Elections 2023: వైఎస్సార్టీపీ పార్టీకి నాయకులు రాజీనామా చేయడంపై ఆ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల స్పందించారు. కేసీఆర్‌ను గద్దె దించ అవకాశం వచ్చినందుకు కాంగ్రెస్‌కు మద్దతు ఇచ్చినట్లు తెలిపారు. తనతో కలిసి నడిచిన అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళు ఆలోచన చేయాలని రిక్వెస్ట్ చేశారు.
BRS Meeting in Uppal Constituency: కాంగ్రెస్‌లో అప్పుడే మంత్రి పదవుల పంపకం మొదలైందని.. జానా రెడ్డి తానే సీఎం అంటున్నారని మంత్రి కేటీఆర్ అన్నారు. గత ఎన్నికల ముందు కూడా ఇలానే అన్నారని.. కానీ తరువాత ఏమైందని అడిగారు. తెలంగాణ ఉద్యమంలో కనిపించని నేతలు.. ఇప్పుడు తాము సీఎం అంటూ వస్తున్నారని మండిపడ్డారు.
తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికల సమరం కొనసాగుతుంది. ప్రత్యర్థుల సవాళ్లకు జవాబులు చెబుతూ.. సవాళ్లు విసురుతూ ఎన్నికల ప్రచారాలు ఆసక్తి కరంగా జరుగుతున్నాయి. బిజెపి జాతీయ అధికార ప్రతినిధి జాఫర్ మీడియాతో మాట్లాడారు. ఆ వివరాలు..
బుధవారం షాద్ నగర్ పట్టణంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కార్నర్ మీటింగ్ కార్యక్రమాన్ని కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి వీర్లపల్లి శంకర్ ఆధ్వర్యంలో జరిగింది. ఈ సందర్భంగా కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ బీఆర్ఎస్ పై ధ్వజమెత్తారు.
ఎన్నికల్లో రాజకీయ పార్టీల లీడర్లు జోరుగా ప్రచారాన్ని కోనసాగిస్తున్నాయి. ఎన్నికల్లో ప్రచారంలో భాగంగా పాలమూరులో కాంగ్రెస్ పార్టీ జరిపిన పాలమూరు ప్రజా భేరి సభలో రాహుల్ గాంధీ తెలంగాణ ప్రభుత్వంపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆ వివరాలు..
తెలంగాణలో ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతుంది, విమర్శలకు ప్రతి విమర్శలు చేస్తూ బిజీ బిజీ గా మారుతున్న నేపథ్యంలో మిర్యాలగూడ ఆశీర్వాద సభలో సీఎం కేసీఆర్ గారు ప్రసంగించారు. ఆ వివరాలు..
Congress Kollapur Public Meeting: కేసీఆర్ లక్ష కోట్లు దోచుకున్నాడని.. మరో లక్ష కోట్లు దోచుకునేందుకు మళ్లీ అధికారం ఇవ్వమంటున్నారని ఫైర్ అయ్యారు రేవంత్ రెడ్డి. కాంగ్రెస్‌కు ఒక్క అవకాశం ఇవ్వాలని.. ఆరు గ్యారంటీలను ప్రతి ఇంటికి చేరుస్తామన్నారు.
తెలంగాణలో ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతుంది. వచ్చే ఎన్నికల్లో తెలంగాణ కాంగ్రెస్ తెలంగాణ జన సమితితో కలిసి పోటీ చేయనున్నట్లు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.
తెలంగాణలో ఎన్నికల సమరం జోరుగా సాగుతుంది. నాయకులు ప్రచారాల్లో పాల్గొంటూ.. విమర్శలు చేసుకుంటున్నారు. మాజీ కేంద్ర మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి రేణుకా చౌదరి గాంధీభవన్ లో మాట్లాడారు. ఆ వివరాలు..
Telangana Vijaya Bheri Yatra in Sangareddy: నన్ను రేటెంత రెడ్డి అని కేసీఆర్ అంటున్నారని.. తనను కొనేటోడు ఈ భూమ్మీద ఇంకా పుట్టలేదంటూ రేవంత్ రెడ్డి ఘాటు వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి రావడం ఖాయమని.. కేసీఆర్ జీవిత కాలం ఫామ్‌హౌస్‌లో విశ్రాంతి తీసుకోవాల్సిందేనని అన్నారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.