Telangana Assembly Elections 2023: తెలంగాణకు పట్టిన చీడ, పీడ వదలాలంటే కోదండరాం సహకారం అవసరమని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అన్నారు. సోమవారం హైదరాబాద్ నాంపల్లిలోని టీజేఎస్ కార్యాలయంలో టీజేఎస్ అధ్యక్షుడు కోదండరాంతో భేటీ అనంతరం రేవంత్ రెడ్డి మీడియా మాట్లాడారు. గత పదేళ్లుగా కోదండరాం బీఆర్ఎస్ ప్రభుత్వ విధానాలపై పోరాడుతున్నారు ఆయన మద్దతు కాంగ్రెస్‌కు ఇవ్వాలని కోరేందుకు ఇక్కడికి వచ్చామన్నారు. ప్రజలకి కోదండరాం మీద విశ్వాసం ఉందని, అధిష్ఠానం సూచన మేరకు కోదండరాం ని కలిశామని వెల్లడించారు. కోదండరాం తెలంగాణ ఆత్మగౌరవాన్ని నిలబెట్టారని, ప్రజల పక్షాన నికార్సుగా నిలబడ్డారన్నారు. కేసీఆర్ కుటుంబం నుండి విముక్తి కలిగించాలని కలసి పని చేద్దాం అని కోరామన్నారు రేవంత్ రెడ్డి.
రాష్ట్రంలో ప్రజా ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు కలిసి ముందుకెళతామని రేవంత్ రెడ్డి చెప్పుకొచ్చారు. భవిష్యత్‌లో సమన్వయ కమిటీని నియమించుకుని ముందుకెళతామన్నారు. టీజేఎస్ నుంచి ప్రభుత్వంలో భాగస్వామ్యం అయ్యేలా కమిటీ ఉంటుందని తెలిపారు. ఎన్నికల క్షేత్రంలో టీజేఎస్, కాంగ్రెస్ కలిసి పనిచేస్తుందన్నారు. వచ్చే కాంగ్రెస్ ప్రభుత్వంలో టీజేఎస్‌కు కీలక స్థానం ఉంటుందన్నారు. లక్ష్యాన్ని ముద్దాడే వరకు అండగా ఉంటామని కోదండరాం హామీ ఇచ్చారని రేవంత్ రెడ్డి వెల్లడించారు.
సీట్లు ఓట్లు కంటే.. ఒక గొప్ప లక్ష్యం కోసం కలిసి పనిచేస్తున్నామన్నారు రేవంత్ రెడ్డి. ఒక నియంతను గద్దె దించి ప్రజా పాలన తీసుకురావాల్సిన అవసరం ఉందన్నారు. కేసీఆర్ ప్రైవేటు సైన్యంపై అధికారంలోకి వచ్చాక చర్యలు తీసుకుంటామన్నారు. టెలిఫోన్ ట్యాపింగ్‌తో పాటు హ్యాకర్స్‌ను ఉపయోగించి తమ ఫోన్‌లు హ్యాక్ చేస్తున్నారని ఆరోపించారు. కాంగ్రెస్‌ను నియంత్రించాలని కేటీఆర్, కేసీఆర్ ప్రయత్నిస్తున్నారన్నారు. అందరి ఫోన్ లు ట్యాప్ చేస్తున్నారు.
Also Read: Anasuya : ఎక్స్‌పోజింగ్ చేయడం ఈజీ కాదు.. నెటిజన్‌కు అనసూయ దిమ్మతిరిగే కౌంటర్
ప్రైవేట్ సైన్యం ని తయారు చేసుకున్నారు. హ్యాకర్స్ ని కూడా ఎంగేజ్ చేశారు కేటీఆర్. మా ఫోన్ లు హ్యాకింగ్ చేస్తున్నారు. మమ్మల్ని నియంత్రించాలని చూస్తున్నారు. మాకు సహకరించాలి అనుకున్న వారిని బెదిరిస్తున్నారు. మా బంధువులు.. మిత్రులను కూడా బెదిరిస్తున్నారు కేటీఆర్. తాము ఫోన్‌లో ప్రైవేటుగా మాట్లాడుకున్న సంభాషణలను హ్యాక్ చేసి వింటున్నారని మండిపడ్డారు. ఈ పద్దతి మంచిది కాదు.
కేటీఆర్..వ్యాపారులను బెదిరిస్తున్నాడు. హరీష్..కేటీఆర్..కేసీఆర్.. అనైతికంగా వ్యవహారం చేస్తున్నారు. కేసీఆర్ సైన్యంలో పని చేస్తున్న అధికారులపై విచారణ చేస్తాం. అధికారం లోకి రాగానే అన్నింటిపై విచారణ ఉంటుందని రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు.
Also Read: CM KCR: చేతగాని దద్దమ్మలు కత్తి పోట్లకు ఒడిగట్టారు.. నాపై దాడిగానే భావిస్తా..: సీఎం కేసీఆర్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3P3R74U
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి..