BJP National President: భారతీయ జనతా పార్టీ కొత్త జాతీయ అధ్యక్షుడి ఎంపిక ప్రక్రియను బీజేపీ అధిష్టానం స్పీడప్ చేసింది. డిసెంబర్ కల్లా కొత్త అధ్యక్షుడి ఎంపిక ప్రక్రియ పూర్తయ్యేలా అన్ని రాష్ట్రాల్లో సంస్థాగత ఎన్నికల ప్రక్రియను వేగవంతం చేయాలని ఆదేశించింది. ఈసారి దక్షిణాది రాష్ట్రాల వారికే అవకాశం ఎక్కువగా ఉందని తెలుస్తోంది. తద్వారా ఆ రాష్ట్రాల్లో పార్టీ మరింత బలోపేతం దిశగా చర్యలుంటాయని బీజేపీ వర్గాలు బలంగా చెబుతున్నాయి.
Twice Board Exams: విద్యార్థులు, వారి తల్లిదండ్రులకు కేంద్ర ప్రభుత్వం భారీ షాకిచ్చింది. ఇప్పటివరకు ఏడాదిలో ఒకసారి ఉన్న బోర్డు పరీక్షలను రెండు సార్లు నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇకపై విద్యార్థులు ఏడాదిలో రెండు పరీక్షలు రాయాల్సి ఉంటుంది.
Nirmala Seetharaman: కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ పై నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ప్రజాప్రతినిధులు అంటే నిర్మలా సీతారామన్ లాగే ఉండాలంటున్నారు. మరి ఇంతకీ నిర్మలా సీతారామన్ పై నెటిజన్ల ప్రశంసలకు కారణమేంటీ..?
JEE Mains 2021 fourth session Exam Dates: కరోనా వైరస్ మహమ్మారి కారణంగా ఇదివరకే తొలి మూడు ఎగ్జామ్స్ షెడ్యూల్స్‌లో మార్పులు చోటుచేసుకోగా, తాజాగా జేఈఈ మెయిన్స్ నాల్గో విడత పరీక్షలు వాయిదా వేస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
Petrol, diesel and LPG prices latest updates| న్యూఢిల్లీ: వాహనదారులకు, సామాన్యులకు గుడ్ న్యూస్. పెట్రోల్, డీజిల్ ధరలతో పాటు ఇటీవల కాలంలో భారీగా పెరిగిన ఎల్పీజీ ధరలు మళ్లీ తగ్గుముఖం పట్టనున్నాయి. ఈ విషయాన్ని స్వయంగా పెట్రోలియం శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ప్రకటించారు. ఇప్పటికే పెట్రోల్, డీజిల్, ఎల్పీజీ ధరలు తగ్గుముఖం పట్టాయని, రానున్న రోజుల్లో మరింత తగ్గనున్నాయని ధర్మేంద్ర ప్రధాన్ వెల్లడించినట్టుగా ప్రముఖ న్యూస్ ఏజెన్సీ ఏఎన్ఐ పేర్కొంది.
బీహార్ ఎన్నికల ఎన్నికల ( bihar election ) నేపథ్యంలో ఆ రాష్ట్ర ప్రజలకు ఉచితంగా కరోనా వ్యాక్సిన్ అందజేస్తామని బీజేపీ (BJP) మేనిఫెస్టోలో ప్రకటించింది. ఇంకా తయారు కాని వ్యాక్సిన్‌ను ఎలా ఉచితంగా అందిస్తారంటూ ఎన్డీఏ కూటమిని విపక్షపార్టీలన్నీ చుట్టుముడుతున్నాయి. ఈ తరుణంలోనే కేంద్ర మంత్రి ప్రతాప్ చంద్ర సారంగి (Pratap Chandra Sarangi) కీలక ప్రకటన చేశారు.
కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాకు కరోనావైరస్ పాజిటివ్ ( Coronavirus positive ) అనే వార్త నుంచి ఇంకా తేరుకోకముందే తాజాగా మరో కేంద్ర మంత్రికి కరోనా పాజిటివ్ అని తేలింది. పెట్రోలియం శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌కి కరోనా సోకడంతో చికిత్స నిమిత్తం ఆయన్ను గురుగ్రామ్‌లోని మేదాంత హాస్పిటల్లో చేర్పించారు.
ఆయిల్ అండ్ న్యాచురల్ గ్యాస్ (ఓఎన్జీసీ) సంస్థ విధులలో భాగంగా ఏడుగురితో ముంబై నుంచి బయల్దేరిన పవన్‌హన్స్ హెలీక్యాప్టర్ గాల్లోకి ఎగిరిన కొద్దినిమిషాల్లోనే ముంబై తీరానికి సమీపంలో సముద్రంలో కూలిపోయింది. శనివారం ఉదయం గాల్లోకి ఎగిరిన కొద్ది నిమిషాలకే పవన్ హన్స్ హెలీక్యాప్టర్ తో సంబంధాలు తెగిపోయాయని ముంబై ఏటీసీ ( ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్) చెప్పడంతో వెంటనే రంగంలోకి దిగిన ఇండియన్ నేవీ, ఇండియన్ కోస్ట్ గార్డ్ సిబ్బంది హెలీక్యాప్టర్లు, స్పీడ్ బోట్ల ద్వారా సంయుక్తంగా సెర్చ్ ఆపరేషన్ చేపట్టారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.