Sajjala Ramakrishna Reddy On Early Elections: ఏపీలో ముందస్తు ఎన్నికలకు వెళ్లే ఉద్దేశం లేదని స్పష్టం చేశారు సజ్జల రామకృష్ణారెడ్డి. వచ్చే ఏడాది మే వరకు సమయం ఉందని.. చివరి రోజు వరకు సేవ చేస్తామని అన్నారు. గడవును పూర్తిగా వినియోగించుకుంటామని చెప్పారు.
KCR U TURN: తెలంగాణలో ముందస్తు ఎన్నికలు రాబోతున్నాయనే ప్రచారం చాలా రోజులుగా సాగుతోంది. దసరా తర్వాత అసెంబ్లీని సీఎం కేసీఆర్ రద్దు చేస్తారనే చర్చ జరుగుతోంది. అయితే తాజాగా ముందస్తు ఎన్నికలపై కేసీఆర్ యూటర్న్ తీసుకున్నారని తెలుస్తోంది. అసెంబ్లీని రద్దు చేస్తే కేంద్ర సర్కార్ తెలంగాణలో రాష్ట్రపతి పాలన పెట్టే అవకాశం ఉండటమే ఇందుకు కారణమంటున్నారు.
Munugode Bypoll: తెలంగాణలో అన్ని పార్టీలకు సవాల్ గా మారింది మునుగోడు ఉప ఎన్నిక. షెడ్యూల్ రాకముందే నియోజకవర్గంలో రాజకీయం పీక్ స్టేజీకి చేరింది. అయితే మునుగోడు ఉప ఎన్నిక విషయంలో మరో అనుమానం కూడా నెలకొంది.
KCR PLAN: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కు సెప్టెంబర్ నెలతో సెంటిమెంట్ ఉంది. గతంలో సెప్టెంబర్ లో తీసుకున్న నిర్ణయాలు ఆయనకు కలిసొచ్చాయి. సెప్టెంబర్ ను తనకు సెంటిమెంట్ గా భావించే.. ఈ నెలలోనే కీలక నిర్ణయాలు తీసుకుంటారనే టాక్ ఉంది.
Munugode Bypoll: తెలంగాణ రాజకీయాలన్ని మునుగోడు అసెంబ్లీ నియోజకవర్గం చుట్టే తిరుగుతున్నాయి. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రాజీనామాతో మునుగోడుకు ఉప ఎన్నిక జరగాల్సి ఉంది. అయితే బైపోల్ ఎప్పుడు వస్తుందో ఇంకా క్లారిటీ లేదు. అయినా ప్రచారం మాత్రం
ఓ రేంజ్ లో సాగుతోంది. పార్టీల హడావుడి చూస్తే ఉప ఎన్నిక వచ్చిందనే భావన కన్పిస్తోంది
Munugode ByElection: కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రాజీనామా ప్రకటనతో త్వరలో మునుగోడు అసెంబ్లీకి ఉప ఎన్నిక జరగనుంది.దీంతో అన్ని పార్టీలు మునుగోడుపై ఫోకస్ చేశాయి. క్షేత్ర స్థాయిలో తమ బలాన్ని అంచనా వేసుకుంటూ గెలుపే లక్ష్యంగా పావులు కదుపుతున్నాయి. మునుగోడు అసెంబ్లీకి ఇప్పటివరకు 12 సార్లు ఎన్నికలు జరగగా ఆరు సార్లు కాంగ్రెస్.. ఐదు సార్లు సీపీఐ.. ఒకసారి టీఆర్ఎస్ గెలిచింది.
Munugode ByElection:మునుగోడుకు ఉప ఎన్నిక ఎప్పుడు జరుగుతుంది.. అసలు ఉప ఎన్నిక వస్తుందా రాదా... సీఎం కేసీఆర్ ప్లాన్ ఏంటీ అన్న కొత్త చర్చలు తెరపైకి వస్తున్నాయి. ఖమ్మం జిల్లాకు చెందిన సీనియర్ నేత, మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చేసిన కామెంట్లు కొత్త అనుమానాలకు తావిస్తున్నాయి. మునుగోడు ఉపఎన్నికపై సస్పెన్స్ క్రియేట్ చేస్తున్నాయి.
Telanagana Elections: తెలంగాణాలో మూడోసారి అధికారంలోకి రావడంపై కన్నేసిన టీఆరెస్ ముందస్తుకు వెళ్లాలని ఆలోచిస్తుంది. దానిలో భాగంగానే ఇటీవల ఢిల్లీ వెళ్లిన కెసిఆర్ అసెంబ్లీ రద్దు, ముందస్తు ఎన్నికలకు వ్యూహాలు సిద్ధం చేసినట్లు పార్టీలో చర్చ నడుస్తోంది.
KCR DELHI TOUR: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఢిల్లీలో ఉన్నారు. మూడు రోజుల క్రితం హస్తిన వెళ్లిన ఆయన ఎక్కడ ఏం చేస్తున్నారో ఎవరికి తెలియడం లేదు. సమావేశాలు నిర్వహించినట్లు సమచారం లేదు. రాష్ట్రపతి ద్రౌపది ముర్మును మర్యాదపూర్వకంగా కలుస్తారని వార్తలు వచ్చినా... ఆయన రాష్ట్రపతి భవన్ కు వెళ్లలేదు.
ETELA RAJENDER: ముందస్తు ఎన్నికలకు సిద్ధమంటూ ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన ప్రకటన తెలంగాణ రాజకీయాలను షేక్ చేస్తోంది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో పాటు బీజేపీ నేతలపై ఆయనపై తీవ్రమైన ఆరోపణలు చేశారు. దీంతో సీఎం కేసీఆర్ ప్రకటనపై తీవ్రంగా స్పందిస్తున్నారు కమలనాధులు
Telangana Elections: తెలంగాణ రాజకీయాలన్ని ముందస్తు ఎన్నికల చుట్టే తిరుగుతున్నాయి.2018 తరహాలోనే ఈసారి కూడా కేసీఆర్ ముందస్తు ఎన్నికలకు వెళతారనే ప్రచారం కొన్ని రోజులుగా సాగుతోంది.చాలా రోజుల తర్వాత మీడియాతో మాట్లాడిన కేసీఆర్ ముందస్తు ఎన్నికలకు సంబంధించి కీలక ప్రకటన చేశారు
CM KCR: తెలంగాణలో ముందస్తు ఎన్నికలు వస్తాయనే కొంతకాలంగా ప్రచారం సాగుతోంది. ముందస్తు ఎన్నికలు వస్తాయనే విపక్షాలు దూకుడు పెంచాయి. అయితే తాజాగా ముందస్తు ఎన్నికలపై ముఖ్యమంత్రి కేసీఆర్ సంచలన ప్రకటన చేశారు. రాష్ట్రంలోని విపక్షాలకు సవాల్ చేశారు.
KTR COMMENTS : తెలంగాణలో ప్రస్తుతం రాజకీయ హడావుడి ఓ రేంజ్ లో ఉంది. విపక్షాలు దూకుడుగా వెళుతున్నాయి. బీజేపీ జాతీయ నేతలు తెలంగాణకు క్యూ కడుతున్నారు. మరో ప్రతిపక్షం కాంగ్రెస్ కూడా వరుస కార్యక్రమాలు నిర్వహిస్తోంది.ముందస్తు ఎన్నికలు వస్తాయనే ప్రచారంతోనే అన్ని పార్టీలు స్పీడ్ పెంచాయనే చర్చ ఉంది
Talasani On Early Elections: రంగారెడ్డి జిల్లా తుక్కుగూడలో జరిగిన బండి సంజయ్ ప్రజాసంగ్రామ ముగింపు సభలో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యలపై టీఆర్ఎస్ నేతలు భగ్గుమంటున్నారు. అమిత్ షా తో పాటు బండి సంజయ్ పై తీవ్రంగా విరుచుకుపడుతున్నారు.
Chandra babu Predicts Early Elections In AP: అమరావతి: చంద్రబాబు వ్యాఖ్యలతో ఏపీలో ముందస్తు ఎన్నికల అంశం తెరపైకి వచ్చింది. ఉమ్మడి ఏపీలో ముందస్తు ఎన్నికలు జరిగిన సందర్భాలు ఉన్నాయి. ఐతే నవ్యాంధ్ర ప్రదేశ్ ఏర్పడిన తర్వాత ముందస్తు ఎన్నికల మాటే లేదు. 2018లో తెలంగాణలో సీఎం కేసీఆర్ ముందస్తు ఎన్నికలకు వెళ్లి అఖండ విజయం సాధించారు.
Andhra Pradesh News: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ముందస్తు ఎన్నికలు రాబోతున్న వార్తలపై ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు స్పందించారు. ముందస్తు ఎన్నికులు ఎప్పుడూ జరిగినా వాటికి సిద్ధంగా ఉన్నామని ఆయన అన్నారు. ఈ నేపథ్యంలో తమ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలందరూ సిద్ధంగా ఉంటారని ధీమా వ్యక్తం చేశారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.